
సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. ఎఫ్ అండ్ వో సిరీస్ మొదటి రోజు కావడంతో వెంటనే అమ్మకాలు వెల్లువెత్తాయి, దీంతో సెన్సెక్స్ 106 పాయింట్లు నష్టపోయి 37724 వద్ద, నిఫ్టీ 31 పాయింట్లుకోల్పోయి 11220 వద్ద ట్రేడ్ అవుతోంది. ప్రభుత్వ బ్యాంకులుతప్ప మిగతా అన్ని రంగాల్లోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి. వేదాంత, ఎస్‌బ్యాంకు, బీవోబీ లాభపడుతుండగా, ఎంఫసీస్, టాటామోటార్స్, డీహెచ్‌ఎఫ్‌ఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ నష్టపోతున్నాయి. జులై ఎఫ్‌అండ్‌వో సిరీస్ చివరి రోజు ట్రేడర్లు పొజిషన్లు రోలోవర్ చేసుకోవడం,షార్ట్ కవరింగ్ కారణాలతో గురువారం మార్కెట్ భారీ ఒడిదొడుకులను ఎదుర్కొంది. ఆరంభంలో 100 పాయింట్లకుపైగా ఎగిసినా చివరికి నష్టాల్లోనే ముగిసిన సంగతి తెలిసిందే. అటు డాలర్ మారకంలో రుపీ బలహీనంగా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment