Losses to the state
-
కమల దళంలో కలవరం!
‘బీజేపీ హఠావో– భారత్ బచావో‘ నినాదం రోజురోజుకు బలపడుతోంది. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో బీజేపీలో కలవరం మొదలైంది. జార్ఖండ్ ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పునిచ్చారు. బీజేపీ కుట్ర రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్–జే.ఎన్.ఏం కూటమిని గెలి పించారు. జార్ఖండ్ శాసనసభలో మొత్తం 81 స్థానాలుండగా, కాంగ్రెస్–జె.ఎన్.ఎం (యూపీఏ) కూటమి 48 స్థానాలలో గెలుపొంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. అధికార బీజేపీ 25 స్థానాలకు పరిమితం అయింది. మోదీ 9 ఎన్నికల సభల్లో ప్రసంగించగా కేవలం 3 చోట్ల మాత్రమే బీజేపీ గట్టెక్కింది. దీంతో ఏడాది కాలంలో వరుసగా 5 రాష్ట్రలలో బీజేపీ అధికారం కోల్పోయింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ లలో ప్రజలు బీజేపీని ఇంటికి పంపించారు. జార్ఖండ్ ఎన్నికల ఫలితాలను, బీజేపీ దేశ ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించాలనే దురుద్దేశంతో తీసుకున్న ఎన్.ఆర్.సి. నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రజలు ఇచ్చిన రెఫరెండంగా చూడాలి. భారత రాజ్యాంగ పునాదులను, విలువలను పెకలించేలా, దేశ ప్రజలను మతం పేరుతో విభజించే కుట్రలో భాగంగా కేంద్ర ప్రభుత్వం, మోదీ–షా ద్వయం పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.) అమల్లోకి తెచ్చింది. ఈ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీని ఈ దేశంలో లేకుండా చేస్తా మని కలలు కన్న బీజేపీ అధిష్టానానికి, ప్రజలు తమ పార్టీనే వరుసగా ఒక్కొక్క రాష్ట్రంలో సాగనంపుతుంటే తల బొప్పి కడుతోంది. 2019లో దేశ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేస్తూ, మెజారిటీ ఉన్నది కాబట్టి ఏం చేసినా చెల్లుతుందనే ధోరణిలో బీజేపీ అనేక ప్రజావ్యతిరేక చట్టాలు తెస్తోంది. కానీ తాము తీసుకున్న ప్రతీ నిర్ణయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని, సరైన సమ యంలో, సరైన నిర్ణయం తీసుకుంటారనే ఆలోచనే బీజేపీకి లేదు. దేశ అభివృద్ధి, ఆర్థిక పరిస్థితి, ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా వివాదాస్పద నిర్ణయాలతో మోదీ–షాలు కాలం వెళ్లదీస్తున్నారు. నోట్ల రద్దు నిర్ణయం, లోపభూయిష్ట జీఎస్టీ విధానం, కశ్మీర్ నిర్బంధం, సమాచార హక్కు చట్టానికి కోరలు పీకే సవరణలు లాంటి నిర్ణయాలు బీజేపీ అప్రజాస్వామిక పోకడలకు తార్కాణాలు. ఇపుడు, మైనార్టీ వర్గాలను ప్రత్యేకంగా ముస్లింలను టార్గెట్ చేస్తూ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సి.ఏ.ఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్.ఆర్.సి.) పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది. ఈ చట్టం అమలు విషయమై మోదీ–అమిత్ షా ఇద్దరూ పరస్పరం విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను మభ్యపెట్టా లని చూస్తున్నారు. ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. రాజ్యాంగ మౌలిక సూత్రాలను కాలరాసే ఈ పౌర చట్టం అమలును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాజ్‌ఘాట్ వేదికగా సత్యాగ్రహం చేపట్టింది. ఇప్పటికే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎంలు ఈ చట్టాన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. మోదీ–అమిత్ షా ధ్వయానికి అసలు సవాల్ ముందుంది. ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కమల దళంలో కలవరపాటు పెరుగుతోంది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ మినహా చెప్పుకోదగ్గ పెద్ద రాష్ట్రంలో ఎక్కడా అధికారంలో లేని బీజేపీకి ఈ ఎన్నికలు కత్తిమీద సాము లాంటివి. జార్ఖండ్ ఎన్నికల్లో లెక్కచేయని బీజే పీతో, బీహార్ ఎన్నికల్లో తాము కలిసి పోటీ చేసే విషయమై జేడీయూపార్టీ పునరాలోచనలో పడింది. బెంగాల్ రాష్ట్రంలో పాగా వేయటానికి బీజేపీ ఎన్ని అల్లర్లు సృష్టించినా అక్కడి ప్రజలు తిప్పికొడుతున్నారు. దీనికి తోడు పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, నిరుద్యోగ సమస్య, ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యమౌతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. బీజేపీ ఇదే ఒంటెద్దు పోకడలు కొనసాగిస్తే, 2020 నాటికి ‘బీజేపీ ముక్త్ భారత్‘ ఖాయంగా కనిపిస్తోంది. కొనగాల మహేష్ వ్యాసకర్త జాతీయ సభ్యులు, ఏఐసీసీ మొబైల్ : 98667 76999 -
బీజేపీ ప్రాభవం తగ్గుతోంది!
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల జాబితా నుంచి తాజాగా జార్ఖండ్ కూడా జారిపోయింది. 2017లో దేశ భూభాగంలోని 71%లో బీజేపీ ఆధికారంలో ఉంది. ఇప్పుడు 2019 డిసెంబర్ నాటికి అది 35 శాతానికి తగ్గిపోయింది. జనాభా విషయానికి వస్తే నాడు 69% జనాభా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉండగా, అదిప్పుడు 43 శాతానికి తగ్గింది. ఈ సంవత్సరం ఏప్రిల్– మే నెలల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన అనంతరం జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. త్వరలో ఢిల్లీ, బిహార్లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై బీజేపీ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి పరంపర 2018 నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ల్లో ఓటమి నుంచి ప్రారంభమైంది. ఆయా రాష్ట్రాల్లో పట్టున్న సామాజిక వర్గాల నుంచి కాకుండా వేరే వర్గాల నేతలను ప్రోత్సహించే విధానాన్ని బీజేపీ వదలాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. హరియాణాలో జాట్, మహారాష్ట్రలో మరాఠా, జార్ఖండ్‌లో గిరిజనులు బీజేపీకి వ్యతిరేకంగా నిలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హరియాణా, మహారాష్ట్రల్లో అతి పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ.. గత ఎన్నికల్లో గెలిచిన స్థానాలతో పోలిస్తే.. తక్కువ సీట్లనే గెలుచుకుంది. హరియాణాలో జననాయక్ జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ.. మహారాష్ట్రలో మిత్ర పక్షం శివసేనతో విభేదాల కారణంగా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయింది. తాజాగా, జార్ఖండ్‌లో అధికారాన్ని కోల్పోయింది. లోక్‌సభ ఎన్నికల తరువాత జరిగిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటు శాతం కూడా.. లోక్‌సభ ఎన్నికల్లో సాధించిన ఓట్ల శాతంతో పోలిస్తే బాగా తగ్గింది. లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లో బీజేపీ ఓటు శాతం 55 కాగా, తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అది 33 శాతానికి తగ్గింది. హరియాణాలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటుశాతం 58 కాగా, అది శాసనసభ ఎన్నికల నాటికి 36 శాతానికి తగ్గింది. ఆర్టికల్ 370, ట్రిపుల్ తలాఖ్, అయోధ్యలో రామ మందిరం.. తదితర సైద్ధాంతిక హామీలను నెరవేర్చినప్పటికీ.. ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించకపోవడం గమనార్హం. -
నష్టాలు రాష్ట్రానికి - గ్యాస్‌లో మాత్రం వాటాలేదు : వైఎస్ జగన్
నగరం: గ్యాస్ ఉత్పత్తిలో, పంపిణీలో ఏదైనా పొరపాటు జరిగితే అన్నిరకాలుగా రాష్ట్రానికి నష్టం వస్తుందని, గ్యాస్‌లో వాటా మాత్రం మన రాష్ట్రానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గ్యాస్ పైప్‌లైన్ పేలిన ప్రదేశాన్ని పరిశీలించి, బాధితులను పరామర్శించిన తరువాత ఆయన విలేకరులతో మాట్లాడారు. గ్యాస్ ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పారు. ఈ ప్రాంతానికి మాత్రం ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. గ్యాస్ ప్రమాదాలన్నీ రాష్ట్రంలోనే జరుగుతాయన్నారు. అయితే ఈ ప్రాంత మనుషుల జీవితాలకు, పర్యావరణానికి భద్రతలేదన్నారు. ఈ ప్రాంతంలో ఈ రకమైన ప్రమాదం జరగడం ఇదే మొదటి సారి కాదని చెప్పారు. గతంలో ఎన్నో జరిగాయని తెలిపారు. లీకేజీపై ఏడాదిగా ఫిర్యాదు చేస్తున్నట్లు స్థానికులు చెప్పారన్నారు. గ్యాస్ లీకైనప్పడు అప్పటికప్పుడు కాస్త తవ్వి సిమెంట్ వేసి వదిలేస్తున్నారని తెలిపారు. గ్యాస్ లీకవుతుంటే వారు నిర్లక్ష్యంగా వ్యవహరించబట్టే ఈ ప్రమాదం జరిగిందన్నారు. సింగరేణి కాలరీస్‌లో ఉత్పత్తి అయ్యే బొగ్గులో రాష్ట్రానికి 50 శాతం వాటా, కేంద్రానికి 50 శాతం వాటా అని వివరించారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు ఎటువంటి వాటాలేదన్నారు. ఇక్కడ గ్యాస్ ఉత్పత్తిలో మాత్రం మన రాష్ట్రానికి వాటా లేదని చెప్పారు. బొగ్గుపై సింగరేణి ఇస్తున్నట్లే, గ్యాస్‌పైనా 50 శాతం రాయల్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కళ్లు తెరవాలన్నారు. పైసా ఆదాయం రాని సంస్థల కోసం ప్రమాదాల బారిన పడుతున్నామన్నారు. మనుషులు సజీవ దహనమయ్యారు, ఇంతకన్నా దారుణం ఉంటుందా? అని ప్రశ్నించారు. కేంద్రంను అడిగి గ్యాస్‌లో వాటా, ఆదాయంలో వాటా తీసుకోవాలని చంద్రబాబును జగన్ కోరారు. ఈ ప్రమాదంలో దుర్మరణం చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని విమర్శించారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం చనక్కాయలు వేసినట్లుగా మూడు లక్షల రూపాయలు మాత్రమే ఇస్తుందన్నారు. ఒక్కో మృతుడి కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఓఎన్జిసి, గెయిల్, చంద్రబాబు ఆలోచించాలని కోరారు. ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు విదేశాల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో అవే ప్రామాణాలు ఇక్కడా పాటించాలన్నారు. యాజమాన్యాలకు భయం కలిగేలా చర్యలు ఉండాలని డిమాండ్ చేశారు. గ్యాస్ పంపిణీ స్టేషన్‌ను జనావాసాలకు దూరంగా తరలించాలని కోరారు. నష్టపోయిన కొబ్బరి రైతాంగానికి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కాలిపోయిన చెట్లను కొట్టివేసి కొత్త మొక్కలను నాటడానికి, అవి ఇంత ఎత్తున పెరగడానికి ఎకరానికి 20 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని వివరించారు. అందుకు తగ్గ సహాయం రైతులకు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై గెయిల్, ఓన్‌జీసీతోపాటు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించాలని కోరారు. అనంతరం జగన్ అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ క్షతగాత్రులను పరామర్శించారు.