love break
-
చైనా కాలేజీల్లో ‘లవ్ బ్రేక్’
బీజింగ్: వేసవి సెలవులు, పండగ సెలవులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే కాలేజీలకు సెలవులు ఇవ్వడం సర్వసాధారణం. కానీ చైనాలో కాలేజీలు విద్యార్థులు ప్రేమలో మునిగి తేలడానికి సెలవులు ఇచ్చారు. అవును.. నిజమే.. చైనాలో యువ జనాభా తగ్గిపోతున్న విషయం తెలిసిందే కదా. దశాబ్దాల తరబడి అయితే ఒక్కరు లేదంటే వద్దు అన్న ఆంక్షల చట్రంలో గడిపిన చైనీయులు ఇప్పుడు ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్న పదాల పట్ల విముఖంగా ఉన్నారు. అందుకే నేటి తరంలో కాస్తయినా ప్రేమ భావనలు మొలకెత్తడానికి కొన్ని కళాశాలలు ఈ కొత్త ఆలోచన చేశాయి. ఏప్రిల్ అంటే వసంత కాలం. ఈ కాలంలో చెట్లన్నీ విరబూసి వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. స్ప్రింగ్ సీజన్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు లవ్‌లో కూడా పడండి అంటూ ఒక వారం రోజులు సెలవులు ప్రకటించాయి చైనా కాలేజీలు. ‘‘ప్రకృతిని ప్రేమించండి. . ప్రేమిస్తే ఎంత కొత్తగా వింతగా ఉంటుందో అనుభూతి చెందండి.లైప్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి’’ అని యువతకి ప్రేమించుకోవడానికి కొన్ని కాలేజీలు హాలీడేస్ ప్రకటించాయి. అలా ప్రేమలో పడ్డ జంటలైనా ఒక్కటై పిల్లల్ని కంటారని ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది. -
ఆ హీరో అందరివద్ద చెప్పుకొని ఏడ్చాడు
బాలీవుడ్లో హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల ప్రేమ గురించి జరిగినన్ని గొడవలు, వివాదాలు మరెప్పుడూ లేవు. తాజాగా ఈ అంశంపై కంగనా రనౌత్ మళ్లీ స్పందించింది. తమ మధ్య జరిగిన గొడవ గురించి హృతిక్ రోషన్ హిందీ సినిమా పరిశ్రమలో అందరి వద్ద చెప్పుకొని ఏడ్చాడని వ్యాఖ్యానించింది. నిజానికి ఈ గొడవల గురించి హృతిక్ ఎప్పుడూ పబ్లిగ్గా ఏమీ మాట్లాడలేదు గానీ, కంగనా మాత్రం మొదటిరోజు నుంచి ఏదో ఒకటి చెబుతూనే ఉంది. అప్పటివరకు నాలుగు గోడల మధ్య ఉన్న ఆ ఇద్దరి అనుబంధం ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసింది. తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హృతిక్‌పై కంగనా మరింత బురద చల్లింది. హృతిక్ అందరివద్దకు వెళ్లి చెప్పి, తన కెరీర్ నాశనం చేద్దామనుకున్నాడని ఆరోపించింది. అతడు వాళ్లతో మాట్లాడిన వెంటనే వాళ్లు తనకు ఫోన్ చేసి, తనవైపు ఏం జరిగిందో అడిగేవారని.. కానీ తాను మాత్రం వాళ్లను పని చూసుకొమ్మని చెప్పేదాన్నని వివరించింది. తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, దాంతో తన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారని చెప్పింది. తన గురించి అందరి ముందు చెబుతామనేవాళ్లని, వాళ్లు తనపై పన్నిన కుట్రలన్నింటి గురించి తనకు తెలుసని, అందుకే ధైర్యంగా ఉన్నానని కంగనా తెలిపింది.