బీజింగ్: వేసవి సెలవులు, పండగ సెలవులు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే కాలేజీలకు సెలవులు ఇవ్వడం సర్వసాధారణం. కానీ చైనాలో కాలేజీలు విద్యార్థులు ప్రేమలో మునిగి తేలడానికి సెలవులు ఇచ్చారు. అవును.. నిజమే.. చైనాలో యువ జనాభా తగ్గిపోతున్న విషయం తెలిసిందే కదా. దశాబ్దాల తరబడి అయితే ఒక్కరు లేదంటే వద్దు అన్న ఆంక్షల చట్రంలో గడిపిన చైనీయులు ఇప్పుడు ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్న పదాల పట్ల విముఖంగా ఉన్నారు.
అందుకే నేటి తరంలో కాస్తయినా ప్రేమ భావనలు మొలకెత్తడానికి కొన్ని కళాశాలలు ఈ కొత్త ఆలోచన చేశాయి. ఏప్రిల్ అంటే వసంత కాలం. ఈ కాలంలో చెట్లన్నీ విరబూసి వాతావరణం అత్యంత ఆహ్లాదంగా ఉంటుంది. స్ప్రింగ్ సీజన్‌ని ఎంజాయ్ చేయడంతో పాటు లవ్‌లో కూడా పడండి అంటూ ఒక వారం రోజులు సెలవులు ప్రకటించాయి చైనా కాలేజీలు. ‘‘ప్రకృతిని ప్రేమించండి. . ప్రేమిస్తే ఎంత కొత్తగా వింతగా ఉంటుందో అనుభూతి చెందండి.లైప్ ఎలా ఎంజాయ్ చేయాలో తెలుసుకోండి’’ అని యువతకి ప్రేమించుకోవడానికి కొన్ని కాలేజీలు హాలీడేస్ ప్రకటించాయి. అలా ప్రేమలో పడ్డ జంటలైనా ఒక్కటై పిల్లల్ని కంటారని ప్రభుత్వం ఆశగా ఎదురు చూస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment