ఆ హీరో అందరివద్ద చెప్పుకొని ఏడ్చాడు
ఆ హీరో అందరివద్ద చెప్పుకొని ఏడ్చాడు
Published Sat, Feb 4 2017 5:46 PM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM
బాలీవుడ్‌లో హృతిక్ రోషన్, కంగనా రనౌత్‌ల ప్రేమ గురించి జరిగినన్ని గొడవలు, వివాదాలు మరెప్పుడూ లేవు. తాజాగా ఈ అంశంపై కంగనా రనౌత్ మళ్లీ స్పందించింది. తమ మధ్య జరిగిన గొడవ గురించి హృతిక్ రోషన్ హిందీ సినిమా పరిశ్రమలో అందరి వద్ద చెప్పుకొని ఏడ్చాడని వ్యాఖ్యానించింది. నిజానికి ఈ గొడవల గురించి హృతిక్ ఎప్పుడూ పబ్లిగ్గా ఏమీ మాట్లాడలేదు గానీ, కంగనా మాత్రం మొదటిరోజు నుంచి ఏదో ఒకటి చెబుతూనే ఉంది. అప్పటివరకు నాలుగు గోడల మధ్య ఉన్న ఆ ఇద్దరి అనుబంధం ఒక్కసారిగా ప్రపంచానికి తెలిసింది.
తాజాగా జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హృతిక్‌పై కంగనా మరింత బురద చల్లింది. హృతిక్ అందరివద్దకు వెళ్లి చెప్పి, తన కెరీర్ నాశనం చేద్దామనుకున్నాడని ఆరోపించింది. అతడు వాళ్లతో మాట్లాడిన వెంటనే వాళ్లు తనకు ఫోన్ చేసి, తనవైపు ఏం జరిగిందో అడిగేవారని.. కానీ తాను మాత్రం వాళ్లను పని చూసుకొమ్మని చెప్పేదాన్నని వివరించింది. తనకు బెదిరింపులు కూడా వచ్చాయని, దాంతో తన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందారని చెప్పింది. తన గురించి అందరి ముందు చెబుతామనేవాళ్లని, వాళ్లు తనపై పన్నిన కుట్రలన్నింటి గురించి తనకు తెలుసని, అందుకే ధైర్యంగా ఉన్నానని కంగనా తెలిపింది.
Advertisement
Advertisement