love harrasaments
-
పెళ్లి కుదిరింది.. 9 రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పిన వినలేదు..
సాక్షి, నల్గొండ: తనకు పెళ్లి కుదిరింది.. మరో తొమ్మిది రోజుల్లో నిశ్చితార్థం ఉందని చెప్పినా.. ఆ ప్రేమోన్మాది వినిపించుకోలేదు.. పైగా ఇంట్లో యువతి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి నన్నే ప్రేమించాలని ఒత్తిడి చేశాడు.. ఆపై శారీరకంగా కలవాలంటూ అత్యాచారయత్నం చేశాడు. బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు. అయితే పరువు పోయిందని భావించిన ఆ యువతి గడ్డిమందు తాగి చివరకు ప్రాణాలు విడిచింది. పోలీసులు, బంధువులు తెలిపిన వివరాలిలా.. నల్లగొండ జిల్లా కనగల్ మండలం లింగాలగూడెం గ్రామానికి చెందిన కదిరే శంకర్, మంగమ్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. చిన్న కూతురు మౌనిక(20) నల్లగొండలోని మహిళా డిగ్రీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతోంది. చదవండి: Viveka Case: కావాలనే ఇరికించారు.. బెయిల్ ఇవ్వండి ప్రేమించాలని మూడు నెలలుగా వేధింపులు నల్లగొండ మండల పరిధిలోని జి.చెన్నారం గ్రామానికి చెందిన బొల్లం శ్రవణ్ మూడు నెలల నుంచి మౌనికను ప్రేమించమని వెంటపడుతున్నాడు. ఆమె ఫోన్ నంబర్ తీసుకుని అసభ్యకరంగా మెసేజ్‌లు పెడుతున్నాడు. ప్రేమించకపోతే చంపుతానంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే క్రమంలో శ్రవణ్ ఈ నెల 9న మధ్యాహ్నం ఎవరూ లేని సమయంలో మౌనిక ఇంటికి చేరుకున్నాడు. ప్రేమించమని, శారీరకంగా కలవాలని చేయి పట్టుకోవడంతో మౌనిక కేకలు వేసింది. దీంతో శ్రవణ్ పారిపోతుండగా చుట్టు పక్కలవారు, తండ్రి శంకర్ గమనించి అతన్ని మందలించారు. ఈ ఘటనతో పరువుపోయిందని తీవ్ర మనస్తాపం చెందిన మౌనిక అదే రోజు సాయంత్రం గడ్డి మందు తాగింది. వాంతులు చేసుకుంటుండగా మౌనిక తమ్ముడు జాని గమనించి నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు. అక్కడ చికిత్స పొందుతున్న మౌనిక శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందింది. మృతురాలి తండ్రి శంకర్ ఫిర్యాదు మేరకు శ్రవణ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అంతిరెడ్డి తెలిపారు. -
ఉలిక్కిపడిన మంచిర్యాల.. యువకుడి దారుణ హత్య.. ఇదీ జరిగింది!
మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన మహేష్ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కనకయ్య కుటుంబానికి పోలీసులు మద్దతు ఇవ్వడం వల్లనే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. పోలీసుల వైఫల్యం వల్లే కొడుకు హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు. (సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు) పోలీసుల భారీ బందోబస్తు మహేష్ బంధువుల ఆందోళన నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుడి హత్య కేసులో ప్రమేయమున్న వారిపై చర్యలు తీసుకుంటామని జైపూర్ ఏసీపీ నరేందర్ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు మహేష్ బంధవులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తరలించారు. (ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్ షర్మిల) అయిదుగురిపై కేసు మరోవైపు యువకుడి హత్య కేసులో అయిదుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కనకయ్యతోపాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని జైపూర్ మండలంలో ఇందారంలో మహేష్ అనే యువకుడిని కత్తులతో దాడి చేసి, బండరాళ్లతో మోదీ హత్య చేసిన ఉదంతం తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగానే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యంత కిరాతకంగా అతడిని అంతమొందించారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారింది. ఇదీ జరిగింది.. ఇందారం గ్రామానికి చెందిన కనకయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెతో ఎం. మహేశ్(24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గతేడాది యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. పైళ్లైనా కూడా మహేష్‌ను వివాహితను వదిలిపెట్టలేదు. యువతిపై కక్ష పెంచుకొని.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను తన భర్తకు పంపాడు. ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి యువతి తన పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. భర్త చనిపోయినా కూడా మహేష్ వేధింపులు ఆపలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. పలుమార్లు యువతిని మహేష్ వేధిస్తూ వచ్చాడు. కూతురు కాపురం విచ్చిన్నం చేసి.. అల్లుడు మృతికి కారణమైన మహేష్‌పై కనకయ్య పగ తీర్చుకోవాలనుకున్నాడు. యువకుడి ప్రాణం తీసేందుకు పథకం రచించాడు. ఈ క్రమంలో ఇంటిముందు బైక్‌పై వెళ్తున్న మహేష్‌పై కనకయ్య, ఆయన కుటుంబ సభ్యులు ఆయుధాలతో దాడి చేశారు. దీంతో అతడు కిందపడిపోవడంతో కనకయ్య, ఆయన బార్య, కూతురు, కుమారుడు బండరాళ్లతో మోదీ, కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. అయితే ఇంత దారుణం జరుగుతున్నా అడ్డుకోవడానికి స్థానికులెవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. హత్య దృశ్యాలను కొందరు ఫోన్లో రికార్డ్ చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనాస్థలాన్ని ఏసీపీ నరేందర్, ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. (దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి) -
మధులికపై జరిగిన దాడిని ఖండించిన మహిళా సంఘాలు
-
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మద్దిరాల (తుంగతుర్తి) : మనస్తాపంతో యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనా మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లపు వెంకన్న రెండో కూమార్తె నాగమణి (20)ని అదే గ్రామానికి చెందిన పులుగుజ్జ నగేష్‌పై ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నగేష్‌పై గతంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపలు ఆగకపోవడంతో మనస్తాపం చెందిన నాగమని పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. నాగమణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రేమ వేధింపులతో.. బాలిక ఆత్మహత్యాయత్నం
ధర్మవరం అర్బన్: అభం.. శుభం కూడా తెలియని ఓ మైనర్ బాలిక ప్రేమ వేధింపులు తాళలేక ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. నిండా 14 సంవత్సరాలు కూడా నిండని ఆ బాలికను ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేయడంతో పాటు, చంపుతామని కూడా బెదిరించడంతో కన్నవారికి చెప్పుకోలేకా... తానే ఈ లోకం నుండి వెళ్ళిపోవాలని ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరం పట్టణం లక్ష్మినగర్‌కు చెందిన మైనర్ బాలిక జోత్స్న (14) కొత్తపేట ప్రాంతంలోని మసీదు వద్ద ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. సంవత్సరకాలం నుంచి ఇదే కాలనీలో కూలిమగ్గం నేసుకునే హరి అనే యువకుడు ప్రేమ పేరుతో ఆ బాలికను వేదింపులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో నెలరోజుల నుంచి ఈ వేధింపులు మరింత ఎక్కువగా కావడంతో విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకువెళ్ళింది. దీంతో తల్లిదండ్రులు విషయాన్ని పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయగా... పదిరోజుల క్రితం స్టేషన్‌కు తీసుకువచ్చి యువకుడికి కౌన్సెలింగ్ కూడా నిర్వహించారు. పెద్ద మనుషుల జోక్యం తర్వాత హరి వేధింపులు మరింత పెరిగాయి. నాలుగు రోజుల క్రితం కత్తి తీసుకుని వచ్చి ప్రేమించకపోతే చంపుతానని తీవ్రస్థాయిలోనే బెదిరించాడు. విషయాన్ని బయటకు చెప్పినా ఇదే గతి పడుతుందని బెదిరించడంతో బాలిక బయపడిపోయి విషయాన్ని కూడా బయటకు చెప్పలేదు. అయితే రెండు రోజుల క్రితం హరి అతని స్నేహితులు ముసుగులు ధరించి బాలికను కిడ్నాప్ చేసి ఎత్తుకుని పోతామని, ఎంతకైనా తెగిస్తామని చెప్పడంతో... భయపడిన బాలిక గురువారం రాత్రి 9.30గంటల సమయంలో ఇంట్లోని గదిలోకి వెళ్ళి ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన స్థానికులు బాలికను హుటాహుటిన ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా... 80శాతం కాలిన గాయాలు ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పట్టణ సీఐ భాస్కర్‌గౌడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.