
మృతిచెందిన వల్లపు నాగమణి
మద్దిరాల (తుంగతుర్తి) : మనస్తాపంతో యువతి పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనా మండల పరిధిలోని కుక్కడం గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బలరాంనాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వల్లపు వెంకన్న రెండో కూమార్తె నాగమణి (20)ని అదే గ్రామానికి చెందిన పులుగుజ్జ నగేష్‌పై ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. నగేష్‌పై గతంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధింపలు ఆగకపోవడంతో మనస్తాపం చెందిన నాగమని పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. నాగమణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం తుంగతుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.