love symbol
-
కొత్త సచివాలయం వారి ప్రేమకు చిహ్నం: బండి సంజయ్ వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన సచివాలయంపై మరోసారి విమర్శలు గుప్పించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఎంఐఎం, బీఆర్ఎస్ ప్రేమకు చిహ్నమే ఈ కొత్త సచివాలయ డిజైన్ అని సెటైర్లు వేశారు. వీరి ప్రేమకు కాంగ్రెస్, కమ్యూనిస్టులు రాయబారులు అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొత్త సచివాలయాన్ని కూలగొడతానని తానెప్పుడూ అనలేదని బండి సంజయ్ పేర్కొన్నారు. తెలంగాణలో మరో ఐదు నెలల్లో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌కు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. రోజూ కేసీఆర్ ఆఫీస్‌కు వస్తారా?: ఈటల రాజేందర్ కరీంనగర్: నూతన సచివాలయం ప్రారంభంపై బీజేపీ నేత ఈటల రాజేందర్ మాట్లాడుతూ, కొత్త సచివాలయం కట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మూడు, నాలుగు నెలలపాటు రోజు ఆఫీస్‌కు వస్తారా? అని ప్రశ్నించారు. ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేయడానికి, కేసీఆర్ ప్రతిష్ట కోసమే కొత్త సచివాలయాన్ని నిర్మించారని విమర్శించారు.తొమ్మిది సంవత్సరాలుగా తెలంగాణలో పాలన అస్తవ్యస్థమైందని ధ్వజమెత్తారు. కొత్త సచివాలయంలో అయినా పాలన బాగుపడాలని ఆశిస్తున్నాన్నట్లు తెలిపారు. చదవండి: కొంతమంది పిచ్చి కూతలు కూశారు: సీఎం కేసీఆర్ -
రావి ఆకును అతని హృదయంగా భావించి..
ప్రేమకు గుర్తు... హార్ట్ సింబల్. అలా అని అందరూ అనేస్తారు. కానీ ఎప్పుడైనా ఆలోచించారా... అసలు హార్ట్ ఆ షేపులో ఉంటుందా అని? గుండె షేపు వేరు. మరి ఈ సింబల్ ఎక్కడి నుంచి వచ్చింది? అది హృదయం ఎందుకయ్యింది? దాని వెనుక ఓ కథ ప్రచారంలో ఉంది. పూర్వం... క్లాడియస్ రాజు రోమ్ను పరిపాలిస్తున్న కాలంలో... సైనికులు పెళ్లిళ్లు చేసుకోకూడదనే నియమం ఉండేది. కానీ పాపం సైనికులూ మనుషులే కదా! వారి బాధను అర్థం చేసుకున్న వాలెంటైన్ అనే సెయింట్... సైనికులకు రహస్యంగా పెళ్లిళ్లు చేస్తుండేవాడు. అది రాజుకు తెలిసిపో యింది. వాలెంటైన్‌ను జైల్లో బంధించాడు. మరణ దండన విధించాడు. ఆ దండనను ఆమలు చేసే రోజు వచ్చింది. చనిపోయే ముందు ఈ ప్రపంచానికి తన చివరి సందే శాన్ని వినిపించాలనుకున్నాడు వాలెంటైన్. ఎలా ఆ పని చేయాలా అని ఆలోచిస్తుంటే రాలిపడిన రావిచెట్టు ఆకులు కనిపించాయి. వాటి మీద... ‘నేను సైనికుల జీవితాల్లో ప్రేమను నింపాలని వాళ్లకు పెళ్లిళ్లు చేశాను. ప్రతి మనిషికీ ప్రేమ కావాలి. ప్రేమ లేకపోతే జీవితమే ఉండదు. ప్రేమను బ్రతికించండి. ఇదే నా చివరి సందేశం’ అని బొగ్గుముక్కతో రాసి, తన గది కిటికీలోంచి వాటిని బయటకు విసిరేశాడు. ఆ తర్వాత మరణ దండనకు తలవంచాడు. అయితే వాలెంటైన్‌కు తెలియదు... తాను ఇచ్చిన ఆ సందేశం ఈ ప్రపంచం మొత్తాన్నీ తనకు అభిమానులుగా మార్చేస్తుందని. తాను మరణించిన రోజు వాలెంటైన్స్‌డేగా ప్రేమికులకు అంకితం అవుతుందని. వాలెంటైన్ తన చివరి సందేశాన్ని రాసిన రావి ఆకును అతని హృదయంగా భావించి, దాని ఆకారాన్ని హృదయా కారంగా, ప్రేమకు గుర్తుగా స్థిరపరిచారని ఓ కథనం. -
హార్ట్లీ బెలూన్స్
మనసు లయలను మధురంగా స్పర్శించే గొప్ప భావం ప్రేమ. ఆ భావాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు.. రాతల్లో చూపే ఆకారమే హృదయాకారం(లవ్ సింబల్). అవును మరి, అందులో కోటి భావాలను ఒకేసారి పలికించొచ్చు. అందుకే ప్రపంచమంతా ఆ సింబల్‌ని ‘మనసు చాటు మంత్రం’లా విరివిగా వాడుతుంది. అందానికే అందంతెచ్చే ఆ సింబల్స్‌ని నాజూకైన మీ గోళ్లపై ఎగరనివ్వండి. 1. ముందుగా నెయిల్స్ షేప్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. తరువాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్పరెంట్ కలర్ అప్లై చేసుకోవాలి. 2. ఇప్పుడు అన్ని నెయిల్స్‌కి లేదా మధ్య, ఉంగరపు వేళ్లకు మాత్రమే వైట్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మధ్య, ఉంగరపు వేళ్లకు మాత్రమే వైట్ కలర్ అప్లై చేసుకుంటే మిగిలిన నెయిల్స్‌కి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. 3. ఇప్పుడు లైట్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని... ఇంతకు ముందు వైట్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న మధ్య వేలుకి చిత్రంలో కనిపిస్తున్న విధంగా లవ్ సింబల్ వేసుకోవాలి. 4. తరువాత ఆ సింబల్ కింద భాగంలో చిత్రాన్ని అనుసరిస్తూ.. పెద్ద చుక్క దానికి ఇరు పక్కలా చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవాలి. 5. ఇప్పుడు రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని.. ఆ డిజైన్‌కి ఎడమ వైపు మరో సింబల్(సేమ్ సైజ్) చిత్రంలో కనిపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. 6. తరువాత అదే రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌తో ఆ సింబల్ కింది భాగంలో (చిత్రాన్ని గమనిస్తూ) ఎడమ వైపుకు పెద్ద చుక్క, కుడివైపుకు చిన్న చుక్క అప్లై చేసుకోవాలి. 7. ఇప్పుడు బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని లవ్ బెలూన్స్ లాగా (చిత్రాన్ని ఫాలో అవుతూ) డిజైన్ చేసుకోవాలి. 8. ఇప్పుడు డిజైన్ మొత్తం ఆరిపోయిన తరువాత ట్రాన్స్పరెంట్ కలర్ అప్లై చేసుకోవాలి.తరువాత మధ్యవేలును అనుసరిస్తూ... ఉంగరపు వేలుకి రెండు సింబల్స్ మధ్య కాస్త డిస్టెన్స్ ఉంచి సేమ్ డిజైన్ అప్లై చేసుకోవాలి. (ఒకవేళ మిగిలిన నెయిల్స్‌కి కూడా వైట్ కలర్‌నే అప్లై చేసుకుంటే మధ్య, ఉంగరపు వేళ్లకు ఎలా డిజైన్ చేసుకున్నామో అదే విధంగా వాటిని కూడా డిజైన్ చేసుకోవాలి.) -
మంచు కౌగిట్లో ప్రేమ చిహ్నం
మంచు ముసుగు తన్ని పడుకున్న తాజ్‌మహల్‌ను భానుడు తన నులి వెచ్చని కిరణాలతో నిద్రలేపుతున్న తరుణంలో క్లిక్‌మనిపించిన చిత్రమిది. ఈ సుందర సన్నివేశాన్ని చిత్రీకరించడానికి దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు మంగళవారం తెల్లవారుజామునే పెద్ద సంఖ్యలో తాజ్‌మహల్ వద్దకు చేరుకున్నారు. తమ తమ కెమెరాల్లో మంచుకౌగిట్లోని ప్రేమచిహ్నాన్ని క్లిక్‌మనిపించారు. -
వందనం.... ప్రేమ సందనం
సఖినేటిపల్లి : ముఖమే 'లవ్ సింబల్' లా ఉన్న ఈ విలక్షణ పక్షి గురువారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో దర్శనమిచ్చింది. గుంపుగా దాడి చేస్తున్న కాకుల మధ్య ఏకాకిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ పక్షి ఆదర్శ రైతు గంటా శేఖర్‌కి పొలంలో కనిపించింది. ఆయన కాకులను తరిమి, ఆ పక్షిని ఇంటికి తెచ్చి 'ప్రేమ'గా సపర్యలు చేయటంతో కోలుకుంది. ఇంతకీ ఆ పక్షి పేరు ఏంటనేది తెలియాల్సి ఉంది.