మనసు లయలను మధురంగా స్పర్శించే గొప్ప భావం ప్రేమ. ఆ భావాన్ని మాటల్లో చెప్పలేనప్పుడు.. రాతల్లో చూపే ఆకారమే హృదయాకారం(లవ్ సింబల్). అవును మరి, అందులో కోటి భావాలను ఒకేసారి పలికించొచ్చు. అందుకే ప్రపంచమంతా ఆ సింబల్‌ని ‘మనసు చాటు మంత్రం’లా విరివిగా వాడుతుంది. అందానికే అందంతెచ్చే ఆ సింబల్స్‌ని నాజూకైన మీ గోళ్లపై ఎగరనివ్వండి.
1. ముందుగా నెయిల్స్ షేప్ చేసుకుని శుభ్రం చేసుకోవాలి. తరువాత అన్ని నెయిల్స్‌కి ట్రాన్స్‌పరెంట్ కలర్ అప్లై చేసుకోవాలి.
2. ఇప్పుడు అన్ని నెయిల్స్‌కి లేదా మధ్య, ఉంగరపు వేళ్లకు మాత్రమే వైట్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి. ఒకవేళ మధ్య, ఉంగరపు వేళ్లకు మాత్రమే వైట్ కలర్ అప్లై చేసుకుంటే మిగిలిన నెయిల్స్‌కి రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవాలి.
3. ఇప్పుడు లైట్ పింక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని... ఇంతకు ముందు వైట్ కలర్ నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్న మధ్య వేలుకి చిత్రంలో కనిపిస్తున్న విధంగా లవ్ సింబల్ వేసుకోవాలి.
4. తరువాత ఆ సింబల్ కింద భాగంలో చిత్రాన్ని అనుసరిస్తూ.. పెద్ద చుక్క దానికి ఇరు పక్కలా చిన్న చిన్న చుక్కలు పెట్టుకోవాలి.
5. ఇప్పుడు రెడ్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని.. ఆ డిజైన్‌కి ఎడమ వైపు మరో సింబల్(సేమ్ సైజ్) చిత్రంలో కనిపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి.
6. తరువాత అదే రెడ్ కలర్ నెయిల్ పాలిష్‌తో ఆ సింబల్ కింది భాగంలో (చిత్రాన్ని గమనిస్తూ) ఎడమ వైపుకు పెద్ద చుక్క, కుడివైపుకు చిన్న చుక్క అప్లై చేసుకోవాలి.
7. ఇప్పుడు బ్లాక్ కలర్ నెయిల్ పాలిష్ తీసుకుని లవ్ బెలూన్స్ లాగా (చిత్రాన్ని ఫాలో అవుతూ) డిజైన్ చేసుకోవాలి.
8. ఇప్పుడు డిజైన్ మొత్తం ఆరిపోయిన తరువాత ట్రాన్స్‌పరెంట్ కలర్ అప్లై చేసుకోవాలి.తరువాత మధ్యవేలును అనుసరిస్తూ... ఉంగరపు వేలుకి రెండు సింబల్స్ మధ్య కాస్త డిస్టెన్స్ ఉంచి సేమ్ డిజైన్ అప్లై చేసుకోవాలి. (ఒకవేళ మిగిలిన నెయిల్స్‌కి కూడా వైట్ కలర్‌నే అప్లై చేసుకుంటే మధ్య, ఉంగరపు వేళ్లకు ఎలా డిజైన్ చేసుకున్నామో అదే విధంగా వాటిని కూడా డిజైన్ చేసుకోవాలి.)
Comments
Please login to add a commentAdd a comment