![వందనం.... ప్రేమ సందనం](/styles/webp/s3/article_images/2017/09/2/51389326646_625x300.jpg.webp?itok=F0nRu9dP)
వందనం.... ప్రేమ సందనం
సఖినేటిపల్లి : ముఖమే 'లవ్ సింబల్' లా ఉన్న ఈ విలక్షణ పక్షి గురువారం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం వీవీమెరకలో దర్శనమిచ్చింది. గుంపుగా దాడి చేస్తున్న కాకుల మధ్య ఏకాకిగా, నిస్సహాయ స్థితిలో ఉన్న ఈ పక్షి ఆదర్శ రైతు గంటా శేఖర్కి పొలంలో కనిపించింది. ఆయన కాకులను తరిమి, ఆ పక్షిని ఇంటికి తెచ్చి 'ప్రేమ'గా సపర్యలు చేయటంతో కోలుకుంది. ఇంతకీ ఆ పక్షి పేరు ఏంటనేది తెలియాల్సి ఉంది.