lover attempt suicide
-
విశాఖ: పెళ్లి వేడుకలో హైడ్రామా.. భగతే నా ప్రియుడు అంటూ..
సాక్షి, విశాఖపట్నం: నగరానికి చెందిన యువకుడు.. ప్రేమ పేరుతో ఓ అమ్మాయిని మోసం చేశాడు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లి వచ్చాడు. తాజాగా మరో అమ్మాయితో పెళ్లికి రెడీ కావడంతో కల్యాణ మండపం వద్ద హైడ్రామా చోటుచేసుకుంది. ప్రేయసి పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. వివరాల ప్రకారం.. షీలానగర్‌లోని ఓ కల్యాణ మండపం వద్ద ప్రియాంక అనే యువతి పెట్రోల్ బాటిల్‌తో హడావుడి చేసింది. తన ప్రియుడు భగత్.. తనను మోసం చేశాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో భగత్ వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడని కల్యాణ మండపం వద్ద పెట్రోల్ ఒంటి మీద పోసుకుని నిప్పటించుకునే ప్రయత్నం చేసింది. దీంతో, అక్కడున్న వారు ఆమెను అడ్డుకున్నారు. అయితే, భగత్‌పై ఆరు నెలల క్రితమే ప్రియాంక.. దిశ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు.. భగత్‌ను రిమాండ్‌కు పంపించారు. ఈ క్రమంలో మూడు నెలల తర్వాత భగత్ జైలు నుంచి విడుదలయ్యాడు. అనంతరం, ఈరోజు భగత్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న ప్రియాంక కల్యాణ మండపం వద్ద హడావుడి చేసింది. -
ప్రేమ విఫలమై...
సాక్షి, మదనపల్లె క్రైం: ప్రేమించిన అమ్మాయి దక్కలేదన్న మనస్తాపంతో ఎక్స్‌రే టెక్నీషియన్ పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి రూరల్ పోలీసులు, బాధితుని కుటుంబసభ్యుల కథనం ఇలా ఉంది. వేంపల్లె పంచాయతీ దిగువకొనగంట వారిపల్లెకు చెందిన ఆర్.శ్రీరాములు కుమారుడు వెంకటరమణ(24) స్థానిక పుంగనూరు రోడ్డులోని ఓ మిషనరీ ఆసుపత్రిలో ఎక్స్‌రే టెక్నీషియన్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అదే ఆసుపత్రిలో పనిచేసే ఓ యువతితో మూడేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు. యువతిది స్థానిక బసినికొండ కావడంతో తల్లిదండ్రులు ఉన్న ఊరిలోనే కుమార్తెను కులాంతర వివాహం చేసేందుకు నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన వెంకటరమణ ఇంటిలో పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు బాధితుడిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియురాలి మృతితో ప్రియుడి ఆత్మహత్యాయత్నం
కావలి : ప్రియురాలు సూసైడ్ చేసుకుందని కలత చెందిన ఓ ప్రియుడు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. తనచావుకు ఎవరూ కారణం కాదని డీఎస్పీకి సూసైడ్ లేఖ ఇచ్చేందుకు వచ్చి స్పృహ తప్పిన వైనం నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే.... వరికుంటపాడు మండలం తూర్పుబోయడుగులకు చెందిన గురవయ్య పట్టణంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఎంటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. కావాలిలోనే ఉంటూ అప్పుడప్పుడు తిరుపతికి వెళ్లి వస్తుంటాడు. స్థానిక జనతాపేటలోని వస్త్ర దుకాణం నిర్వహిస్తున్న బాబు అనే వ్యక్తితో ఇతనికి పరిచయం ఉంది. నిన్నసాయంత్రం బాబుకు ఫోన్ చేసి తాను చనిపోతున్నానని, చదువుపరంగా తనకు చేసిన సహాయం మరవలేనని తెలిపాడు. అనంతరం సెల్ ఫోన్ స్విచాఫ్ చేశాడు. రాత్రి డీఎస్పీ కార్యాలయానికి చేరుకుని తన చావుకు ఎవరూ కారణం కాదనే సూసైడ్ లేఖను డీఎస్పీ బాలవెంకటేశ్వరావుకు ఇచ్చేందుకు వచ్చాడు. అప్పటికే పురుగుల మందు తాగి ఉన్న అతను అస్వస్థతకు గురై పడిపోయాడు. ఈ విషయాన్ని గమనించింది పోలీసులు అతడిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు.