కొనసాగుతున్న వర్షాలు
– పగిడ్యాలలో అత్యధికంగా 59.2 మి.మీ. వర్షపాతం
– ఆదోని డివిజన్‌పై చిన్నచూపే
– వర్షాలు పడితే రబీ పంటల సాగుకు అవకాశం
కర్నూలు(అగ్రికల్చర్): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల జిల్లాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలోని 36 మండలాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 8.8 మి.మీ. వర్షపాతం నమోదైంది. అయితే ఆదోని రెవెన్యూ డివిజన్లో మాత్రమ చినుకు రాలలేదు. అత్యధికంగా పగిడ్యాలలో 59.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. శ్రీశైలంలో 54 మి.మీ., ఆత్మకూరు 52, పాములపాడు 50.4, కొత్తపల్లి 43, వెలుగోడు 32.4, నందికొట్కూరు 28.2, జూపాడుబంగ్లా 28.2, మహానంది 12.2,గడివేములలో 10 మిమీ ప్రకారం వర్షాలు కురిశాయి. 26 మండలాల్లో తేలికపాటి వర్షాలు కురిశాయి. సెప్టంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మిమీ ప్రకారం వర్షపాతం నమోదైంది.