lower manair dam
-
మానేరు డ్యామ్ కు భారీ వరద..
-
16 గేట్లు ఎత్తి నీళ్లు వదులుతున్న అధికారులు
-
వలలో 20 కిలోల చేప.. మనోడికి పండగే పండగ
రుద్రంగి (వేములవాడ): ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి, కలికోట శివారులోని సూరమ్మ చెరువు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత అలుగు దూకింది. దీంతో శుక్రవారం సూరమ్మ ప్రాజెక్టులో నుంచి భారీ ఎత్తున చేపలు బయటకు వచ్చాయి. వాటిని పట్టేందుకు రెండు గ్రామాల ప్రజలు పోటెత్తారు. పెద్ద చేపలు పడడంతో జాలరుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కలికోటకు చెందిన ఎల్ల రాజు వలకు దాదాపు 20 కిలోల చేప చిక్కింది. దాన్ని విక్రయించగా రూ.1,600 వచ్చినట్లు రాజు చెప్పాడు. మానేరు అందాలు.. చూడగానే వాహ్.. అనిపించే ఈ సుందర దృశ్యం కరీంనగర్ జిల్లా లోయర్ మానేరు ప్రాజెక్టుది. ఎగువ నుంచి వస్తున్న వరదకుతోడు స్థానికంగా కురుస్తున్న వానలతో మానేరు డ్యామ్ జలకళతో సందర్శకులను ఆకట్టుకుంటోంది. భారీగా వరద వస్తుండడంతో అధికారులు గురువారం రాత్రి 12 గేట్లను తెరిచారు. శుక్రవారం మరో ఆరు గేట్లను తెరిచారు. మొత్తం 18 గేట్ల ద్వారా లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీటిని దిగువకు వదులుతున్నారు. నిండుకుండలా కనిపిస్తున్న డ్యామ్.. పచ్చని పొలాలు.. ఆ పక్కన కరీంనగర్ నగరం.. ఆకట్టుకునే హైదరాబాద్ హైవే.. తీగల వంతెనను తాకుతూ వరద వెళ్తుండడంతో ఆ దృశ్యం మరింత ఆకర్షణీయంగా మారింది. – కరీంనగర్ సీనియర్ ఫొటోగ్రాఫర్, శైలేంద్రారెడ్డి చెరువు అలుగే జలపాతమై.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లి గ్రామంలోని జానకీబాయి చెరువు పూర్తిగా నిండటంతో 40 అడుగుల ఎత్తు ఉన్న అలుగు నుంచి జలపాతాన్ని తలపిస్తూ నీరు కిందికి జాలువారుతోంది. వర్షాకాలం ముగిసేంత వరకు ఈ అలుగు పర్యాటకులను ఆకర్షిస్తోంది. గత రెండేళ్లుగా పర్యాటకులు పెరగడంతో వారి భద్రతకోసం మరిన్ని సౌకర్యాలు కల్పించినట్లు గ్రామ సర్పంచ్ తెలిపారు. – ఇందల్వాయి, రాజ్‌కుమార్ -
ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..
-
ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..
సాక్షి, కరీంనగర్: చేపల వేటకు వెళ్ళిన ముగ్గురు వ్యక్తులు వాగు మధ్యలో చిక్కుకుపోయారు. జిల్లాలోని వీణవంక మండలం చల్లూరు వద్ద మానేరు వాగులో ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితులను శ్రీనివాస్, రవి, తిరుపతిగా గుర్తించారు. వారిని రక్షించేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. మానేరు వాగులో చేపలు పడుతుండగా ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగిందని, దాంతో ముగ్గురూ చిక్కుకుపోయినట్టుగా స్థానికులు వెల్లడించారు. శ్రీనివాస్, రవి సురక్షిత ప్రాంతంలో ఉండగా, తిరుపతి ప్రమాదకరమైన ప్రదేశంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కరీంనగర్ నుంచి రెస్క్యూ బృందాన్ని రప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. కాగా, ఎడతెరిపిలేని వర్షాలతో దిగువ మానేరు నిండుకుండలా మారింది. 8 గేట్లు ఎత్తి 24 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో చల్లూరు వద్ద మానేరు వాగులో వరద ఉధృతి పెరిగింది. మానేరు వాగులో వరద ఉధృతిని తగ్గించేందుకు దిగువ మానేరు గేట్లను అధికారులు మూసివేశారు. (చదవండి: వాగు మధ్యలో ప్రసవం.. ) -
నిండుకుండలా వున్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు
-
దిగువమానేరు, శ్రీరాం సాగర్ గేట్ల ఎత్తివేత
సాక్షి, కరీంనగర్: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గత రాత్రి పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. వాగులు వంకలన్ని పొంగిపొర్లుతున్నాయి. చెరువులు కుంటలు అలుగు పారుతుండగా ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తింది. మోయతుమ్మెద వాగు ద్వారా 47 వేల క్యూసెక్కుల వరద, మీడ్ మానేర్ నుంచి 19 వేల క్యూసెక్కుల నీరు ఎల్ఎండీకి చేరుతుంది. దీంతో అధికారులు 20 గేట్లు ఎత్తి 57,652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి, మరో రెండు వేల క్యూసెక్కుల వాటర్‌ను కాకతీయ కాలువకు వదులుతున్నారు. మిడ్ మానేర్‌కు ఎస్సారెస్పీ వరద కాలువ ద్వారా 15 వేలు, మూలవాగు ద్వారా మరో 8వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో ఎంఎంఆర్‌కు చెందిన 6 గేట్లు ఎత్తి 19వేల క్యూసెక్కుల నీటిని దిగువ మానేరు డ్యామ్‌కు వదులుతున్నారు. ఎగువ మానేర్ నర్మాల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో గోదావరి ద్వారా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు లక్షా 52వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో 15గేట్లు ఎత్తి 1,43,865 క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా మంథని నియోజకవర్గంలో నిర్మించిన సుందిళ్ల పార్వతి బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజ్, మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌లకు భారీగా వరద వస్తుండడంతో ఆయా బ్యారేజీల గేట్లన్ని ఎత్తి దిగువకు లక్షలాది క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టుల గేట్లను ఎత్తడంతో అటు గోదావరి మానేరు వాపులు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. తీర ప్రాంత ప్రజలను అధికారులతో పాటు మంత్రి గంగుల కమలాకర్ అప్రమత్తం చేశారు. వర్షం వరదలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత నెలలో కురిసిన వర్షాలతో నీట మునిగి పంట నష్టపోయిన రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా మరోసారి వర్షం వరదలు అపార నష్టాన్ని మిగిల్చాయి. శ్రీరాం సాగర్ ప్రాజెక్టు 40 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల ఇన్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు అవుట్ ఫ్లో రెండు లక్షల 21 వేల క్యూసెక్కు లు వరద గేట్ల ద్వారా రెండు లక్షలు, కాలువల ద్వారా 21 వేల క్యూసెక్కుల నీటి విడుదల పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు ప్రస్తుత నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు లోయర్ మానేరు డ్యామ్ 20 గేట్లు ఎత్తి, 57652 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి విడుదల. ఇన్ ఫ్లో 59961 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 59961 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 24.034 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 23.645 టీఎంసీలు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి, 72509 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల. ఇన్ ఫ్లో 72518 క్యూసెక్కులు. ఔట్ ఫ్లో 73157 క్యూసెక్కులు. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు ప్రస్తుతం నీటి నిలువ 19.397 టీఎంసీలు. -
అక్కడ రోడ్డెలా నిర్మిస్తారు..!
లోయర్ మానేరు డ్యాంలో రోడ్డు నిర్మాణంపై హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ)లో రోడ్డు నిర్మాణం చేపట్టడంపై ఉమ్మడి హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరింది. ఎల్ఎండీలో రోడ్డు నిర్మా ణం చేపట్టబోమంటూ గత ఏడాది హైకోర్టు కు ఇచ్చిన హామీకి విరుద్ధంగా రోడ్డు నిర్మా ణానికి టెండర్లు ఎలా ఆహ్వానించారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరా లను తమ ముందుంచాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈమేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, జస్టిస్ తెల్లప్రోలు రజనీతో కూడిన ధర్మాస నం ఉత్తర్వులిచ్చింది. ప్రత్యామ్నాయ రోడ్డు ఉండగా, పర్యాటకులను ఆకర్షించే పేరుతో కొందరు రాజకీయ నాయకులకోసం ప్రభు త్వం లోయర్ మానేరు డ్యామ్‌లో రోడ్డు నిర్మాణం చేపడుతోందని, ఈ నిర్మాణం చేప ట్టబోమని గతంలో హామీఇచ్చి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ సామాజిక కార్యకర్త గజ్జెల కాంతం హైకోర్టు లో పిల్ వేశారు. దీనిపై ధర్మాసనం గురు వారం మరోసారి విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది నజీర్ అహ్మద్‌ఖాన్ వాద నలు వినిపిస్తూ.. రూ.60కోట్లతో రోడ్డు నిర్మా ణం నిమిత్తం ప్రభుత్వం జీవో జారీ చేసిం దన్నారు. గతంలో ఇదే అంశంపై పిల్ వేసి నప్పుడు, తాము రోడ్డు నిర్మాణం చేపట్ట బోమని, 5.2 కిలోమీటర్ల మేర ఫ్లైఓవర్ నిర్మి స్తామని కోర్టుకు తెలిపారన్నారు. ముంపు ప్రాంతంగా ప్రకటించిన చోట ఇప్పుడు రోడ్డు వేస్తున్నారన్నారు. ప్రత్యామ్నాయ రోడ్డు ఉన్నప్పటికీ, మరో రోడ్డు నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఇదంతా చేస్తోందన్నారు. అడ్వొకేట్ జనరల్(ఏజీ) జోక్యం చేసుకుంటూ... తాము 5.2 కి.మీ. మేర ఫ్లైవోవర్, మరో రోడ్డు కూడా నిర్మిస్తా మన్నారు. రోడ్డు వేయబోమని గతంలో కోర్టుకు హామీ ఇచ్చి, అందుకు విరుద్ధంగా ఎందుకు వ్యవహరిస్తారని కోర్టు ప్రశ్నిం చింది. గడువిస్తే పూర్తి వివరాలను కోర్టు ముందుం చుతానని ఏజీ తెలిపారు. -
లోయర్ మానేరు డ్యామ్ గేట్లు ఎత్తివేత
కరీంనగర్: గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్ట్‌లకు జలకళ వచ్చింది. జిల్లాలోని లోయర్ మానేరు డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. సోమవారం ఉదయం డ్యామ్‌ను సందర్శించిన మంత్రులు హరీష్‌రావు, ఈటల రాజేందర్లు వరద పరిస్థితిని సమీక్షించి డ్యామ్ 6 గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయంలో 21 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు. ఇన్‌ఫ్లో 40 వేల క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో 14 వేల క్యూసెక్కులుగా ఉంది.