The lowest temperature
-
కోహిర్@ 8.9
సాక్షి,నెట్వర్క్/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. రాత్రివేళనేకాదు...పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్ప ఉష్ణోగ్రత 8.9 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా చౌదరిగూడెంలో 9.4 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా సిర్పూరు(యు)లో 9.7 డిగ్రీలు నమోదు కావటంతో వాతావరణశాఖ అలర్ట్ నోటీస్ జారీ చేసింది. ఆయా జిల్లాల వారీగా చూస్తే... రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.8 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల పాటు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. -
సిటీలో చలి
ఉత్తరాది గాలులతో గజగజ మరో ఐదు రోజులపాటు ఇదే పరిస్థితి... గ్రేటర్లో ఒక్కసారిగా పడిపోయిన రాత్రి ఉష్ణోగ్రతలు సిటీలో చలి తీవ్రత పెరిగింది. ఆదివారం 12.9 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. గత నాలుగేళ్లలో ఇదే అత్యల్ప రికార్డు ఉష్ణోగ్రత కావడం గమనార్హం. ఉత్తరాది నుంచి వీస్తున్న గాలుల కారణంగా చలి పెరిగిందని, ఈ పరిస్థితి మరో ఐదు రోజులపాటు ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సిటీబ్యూరో: గ్రేటర్‌పై చలి పంజా విసురుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న తేమ గాలులు సిటీజన్లను గజగజలాడిస్తున్నారుు. ఆదివారం తెల్లవారు జామున కనిష్ట ఉష్ణోగ్రతలు అనూహ్యంగా 12.9 డిగ్రీలకు పడిపోవడంతో చలితీవ్రత అనూహ్యంగా పెరిగింది. నాలుగేళ్ల తరవాత నవంబరు నెలలో ఈ స్థారుులో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం గమనార్హం. 2012 నవంబరు 18న నగరంలో 12.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కాగా..ఆదివారం 12.9 డిగ్రీల మేర కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవడం విశేషం. చలితీవ్రత పెరగడంతో ఉదయం ఐదు గంటలకే నిద్రలేచే నగరవాసులు ఎనిమిదైనా ముసుగు తీయడం లేదు. వాతావరణంలో ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ మార్పులు చిన్నారులు, వృద్ధులు, బాలింతలు, గర్భిణులు, ఆస్తమా బాధితులు, వాహనదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మరో ఐదు రోజులపాటు చలితీవ్రత ఇదే స్థారుులో ఉంటుందని బేగంపేట్‌లోని వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 12 నుంచి 11 డిగ్రీలకు పడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. తెల్లవారు జామున సాధ్యమైనంత వరకు బయటికి వెళ్లక పోవడమే ఉత్తమమని సూచించింది. చలికి పెదాలు, కాళ్లు, చేతులు, చర్మంపై పగుళ్లు ఏర్పడుతుండగా, శ్వాస సంబంధ సమస్యలు రెట్టింపు అయ్యారుు. ఆస్తమా బాధితులు స్వేచ్ఛగా శ్వాస తీసుకోలేకపోతున్నారు. ఇటీవల ఆస్పత్రులకు వస్తున్న బాధితుల్లో 40 శాతం మంది శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న వారే ఉంటున్నారు. నిన్న మొన్నటి వరకు కనిష్టంగా 16 నుంచి 16.8 వరకు నమోదైన ఉష్ణోగ్రతలు తాజాగా 13 డిగ్రీలకంటే తక్కువ నమోదవుతుండడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. గత పదేళ్లతో పోలిస్తే ప్రస్తుత సీజన్లో గత పదిహేను రోజులుగా చలిగాలుల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. పొంచి ఉన్న స్వైన్ ఫ్లూ.. నగర వాతావరణంలో 18 రకాల స్వైన్‌ఫ్లూ కారక వైరస్ ఉన్నట్లు ఇప్పటికే వైద్యుల పరిశోధనలో తేలిన విషయం తెలిసిందే. ఇతర సీజన్లతో పోలిస్తే చలికాలంలో ఈ వైరస్ మరింత బలపడుతుంది. దీనికి వాతావరణ కాలుష్యం తోడవుతుంది. సీజన్‌తో సంబంధం లేకుండా ఫ్లూ కేసులు నమోదవుతున్నారుు. ఎన్నడూ లేని విధంగా గతేడాది 1800పై స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటికే 35 కేసులు నమోదు కావడం విశేషం. గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న హైరిస్క్ గ్రూప్ బాధితులు, శిశువులు, గర్భిణులు ఈ సీజనల్లో సాధ్యమైనంత వరకు రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోకి వెళ్లక పోవడమే మంచిందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్వెటర్లు, జర్కిన్ల అమ్మకాలపై పెద్దనోట్ల ఎఫెక్ట్ చలి భారీ నుంచి శరీరాన్ని కాపాడుకునేందు ప్రత్యామ్నాయాలపై జనం దృష్టి సారించారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా నేపాల్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, కాశ్మీర్ తదితర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఇమ్లీబన్బస్స్టేషన్, కోఠి, ఛాదర్‌ఘాట్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సహా ఇన్నర్‌రింగ్‌రోడ్డు వెంట ప్రత్యేక దుకాణాలను ఏర్పాటు చేశారు. అరుుతే వినియోగదారులు తమకు కావాల్సిన స్వెటర్లు, జర్కిన్లు, మఫ్లర్లు, మంకీ క్యాప్స్ ఎంపిక చేసుకుని పెద్దనోట్లు ఇవ్వగా వారు తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. చేతిలో డబ్బులు ఉండి కూడా తమకు అవసరమైన వస్తువును కొనుగోలు చేయలేక పోతున్నారు. చలిబారి నుంచి శరీరాన్ని కాపాడుకోలేక గ్రేటర్ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. -
చలిః11.2
చలిమంట భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు మూడేళ్ల అనంతరం మళ్లీ అత్యల్పం వచ్చేవారం రోజులూ మరింత గజగజ సిటీబ్యూరో: ‘గ్రేటర్’ చలి కౌగిలిలో చిక్కుకుంటోంది. శీతల గాలులు వణికించేస్తున్నాయి. నగరం రోజురోజుకూ చల్లగా మారిపోతోంది. రాత్రితో పాటు పగటిపూట ఉష్ణోగ్రతలూ మరింతగా పడిపోతున్నాయి. శని వారం తెల్లవారుజామున నగరంలో 11.2, పగటి వేళ 27.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం నుంచి ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. శుక్రవారం రాత్రి 14.7 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు 24 గంటలు గడిచేసరికి 11.3కు పడిపోయాయి. దీనికి తోడు ఉత్తర ఈశాన్యగాలుల ప్రభావంతో శనివారం రోజంతా చలిగాలుల తీవ్రత కొనసాగింది. మూడేళ్లలో అత్యల్పం 2010వ సంవత్సరం (11.4 డిగ్రీలు) తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు శనివారమే నమోదయ్యాయి. ఆదివారం నుంచి మరో వారం రోజుల పాటు మరో డిగ్రీ వరకు ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ నగరంలో 1966 డిసెంబర్లో 7.1 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. అదే ఇప్పటి వరకూ ఉన్న రికార్డ్. అనంతరం 2010లో 8.9 డిగ్రీలు, 2009లో 11.2 డిగ్రీలు, 2005లో 8.7 డిగ్రీలు, 2004లో 10.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. -
చలి
సిటీ గజగజ ప్రకటనలకే పరిమితమైన నైట్‌షెల్టర్లు ఉన్న వాటిలో వసతుల కొరత వినియోగానికి దూరం రాత్రి వేళల్లో జనం అవస్థలు కనిష్ట ఉష్ణోగ్రత 13.7 డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యల్పం గ్రేటర్ సిటీజనులను చలిపులి గజగజలాడిస్తోంది. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రతలు 13.7 డిగ్రీలకు పడిపోయాయి. 24 గంటల వ్యవధిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 15.5 నుంచి ఏకంగా 13.7 డిగ్రీలకు చేరుకోవడం గమనార్హం. ఈ సీజన్లో ఇప్పటివరకు నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే కావడం విశేషం. నగరంలో 2007 నవంబరు 25న 11.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. సిటీబ్యూరో: నగరంపై చలి పులి దాడి చేస్తోంది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం 8 గంటల వరకూ గ్రేటర్ మంచు దుప్పటి కప్పుకుంటోంది. చలి పెరుగుతుండడంతో పక్కా భవనాల్లో ఉన్న వారే గజగజలాడుతున్నారు. ఇక గూడు లేక...కనీసం కప్పుకునేందుకు దుప్పట్లు లేక... రోడ్ల పైనే పడుకునే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించవచ్చు. ఇలాంటి వారు ఎముకలు కొరికే చలిలో...దట్టంగా కురుస్తున్న మంచులో వణుకుతూ... రాత్రి వేళల్లో జాగారం చేస్తున్నారు. వారిని ఆదుకునేందుకు నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలనే యంత్రాంగం ఆలోచనలు ఏళ్ల తరబడి కాగితాలకే పరిమితమవుతున్నాయి. ప్రస్తుతం పది కేంద్రాలు పని చేస్తున్నా .. పూర్తిగా అక్కరకు రావడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఐదు లక్షల జనాభా దాటిన నగరాల్లో ఐదు లక్షల మందికి ఒకటి చొప్పున నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నగరంలో 14 మాత్రమే ఏర్పాటు చేశారు. వాటిలో నాలుగు మూత పడగా... ప్రస్తుతం పది నడుస్తున్నాయి. అవి కూడా అందరికీ అందుబాటులో లేకపోవడమే కాక...మౌలిక సౌకర్యాలు లేక వినియోగించుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. వాటి నిర్వహణ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినజీహెచ్ఎంసీ ఆపై పట్టించుకోవడం మానేసింది. నైట్‌షెల్టర్లు లేక అల్లాడుతున్న వారి దీనగాథలు తెలుసుకున్న జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్ కుమార్ ఏడాది క్రితం దీనిపై సర్వే చేశారు. ఆస్పత్రులు, బస్ స్టాండ్లు, రైల్వేస్టేషన్ల పరిసరాల్లో ఎక్కువమంది ఉంటున్నట్లు గుర్తించారు. తొలిదశలో ఆయా ఆస్పత్రుల వద్ద నైట్‌షెల్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు. సంబంధిత అధికారులతో సంప్రదించి.. నైట్షెల్టర్లకు స్థలం కేటాయించాల్సిందిగా ఒప్పించడంతోనే ఏడాది గడచిపోయింది. ప్రస్తుతానికి నైట్‌షెల్టర్ల ఏర్పాటుకు ఏడు ఆస్పత్రులు సుముఖత వ్యక్తం చేశాయి. కానీ.. ఈ చలికాలం పూర్తయ్యేలోగానైనా అవి అందుబాటులోకి వస్తాయో, లేదో అనుమానమే. నామాలగుండులో.... బౌద్దనగర్: నామాలగుండులోని మహిళల నైట్‌షెల్టర్‌ను సదుపాయాల లేమితో ఎక్కువమంది వినియోగించుకోవడం లేరు. అక్కడ ప్రస్తుతం 13 మంది మహిళలు ఉంటున్నారు. వారికి సరిపడా మంచాలు, బెడ్లు లేవు. బాత్రూమ్లు ఉన్నా వాటికి తలుపులు లేవు. దీంతో మహిళలు స్నానాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నైట్‌షెల్టర్‌లో ఉండే వారికి అమన్ వేదిక సంస్థ భోజనం అందిస్తుంది. ఇందుకు రూ. 20 చెల్లించాలి. కానీ ఇక్కడకు వస్తున్న వారికి ఆ స్థోమత కూడా లేదు. జీహెచ్ఎంసీ ఇస్తున్న ఖర్చులు నిర్వహణకు సరిపోవడం లేదు. ఇక్కడి మహిళల్లో చంటి పిల్లల తల్లులు ఐదుగురు ఉన్నారు. ఏడాది పైబడిన చిన్నారుల ఆలనా పాలనా చూసేందుకు క్రెష్‌ను అందుబాటులోకి తేవాల్సిన అవసరం ఉంది. తల్లులు ఉపాధి కోసం బయటకు వెళితే పిల్లలకు తగిన రక్షణ ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. ఉప్పల్‌లో... ఉప్పల్ సర్కిల్లోని నిరాశ్రయ మహిళల కేంద్రంలో వసతులు కరువయ్యాయి. 15 మందికి పైగా మహిళలు ఉండగా.. కేవలం పది బెడ్లే ఉన్నాయి. తుప్పుపట్టిన మంచాలు, చిరిగిపోయిన బెడ్లు ఉండటంతో నిరాశ్రయ మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పురాతన భవనంలో ఉప్పల్ వార్డు కార్యాలయంలో నడుస్తున్న ఈ కేంద్రంలో మహిళలు సమస్యలతో సతమతమవుతున్నారు. పడుకోవడానికి స్థలం లేక, సరిపడా బాత్రూంలు లేక తీవ్ర అవస్థలు పడుతున్నారు.