మంథని–పెద్దపల్లి రహదారిపై శుక్రవారం కమ్ముకున్న పొగమంచు – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి
సాక్షి,నెట్‌వర్క్/హైదరాబాద్: రాష్ట్రాన్ని చలి గజగజ వణికిస్తోంది. రాత్రివేళనేకాదు...పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శుక్రవారం సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత 8.9 డిగ్రీలుగా నమోదైంది. ఆ తర్వాతి స్థానంలో మేడ్చల్ జిల్లా చౌదరిగూడెంలో 9.4 డిగ్రీలు, కుమ్రంభీం జిల్లా సిర్పూరు(యు)లో 9.7 డిగ్రీలు నమోదు కావటంతో వాతావరణశాఖ అలర్ట్ నోటీస్ జారీ చేసింది.
ఆయా జిల్లాల వారీగా చూస్తే...
రాష్ట్రవ్యాప్తంగా చాలాచోట్ల సాధారణం కంటే 2 డిగ్రీల మేర తక్కువగా నమోదవుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే..గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 30.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 12.8 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఆదిలాబాద్, నల్లగొండ, హైదరాబాద్, వరంగల్, మెదక్, కరీంనగర్‌లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.8 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యాయి. రానున్న మూడు రోజుల పాటు ఇదే తరహాలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment