పాదాలు.. కోమలం...
బ్యూటిప్స్
చలికాలం అరికాళ్ళ పగుళ్ల సమస్యలు కూడా ఎక్కువే. సరైన జాగ్రత్తలు తీసుకుంటే పగుళ్ల నివారణ సాధ్యమే. గ్లిజరిన్-రోజ్‌వాటర్ పావు టీ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ రోజ్‌వాటర్, టీ స్పూన్ నిమ్మరసం, పాదాలను నానబెట్టేందుకు వెచ్చని నీళ్లు, టీ స్పూన్ ఉప్పు, ప్యుమిక్ స్టోన్ తీసుకోండి. గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్, నిమ్మరసం కలిపి పక్కన ఉంచాలి. .వెచ్చని నీటిలో ఉప్పు కలిపి అందులో పాదాలను ఉంచాలి.15-20 నిమిషాలు గడిచాక కొద్దిగా నిమ్మరసం ఆ నీటిలో కలపాలి. ఇలా చేస్తే మృతకణాలు త్వరగా వదులుతాయి.ప్యుమిక్స్టోన్తో పాదాలను కింది భాగం, మడమలను రుద్దాలి. మృతకణాలు వదిలాక పాదాలను బయటకు తీసి, పొడి క్లాత్‌తో తడి లేకుండా తుడవాలి.
గ్లిజరిన్ మిశ్రమాన్ని రాయాలి. మూడు, నాలుగు రోజులకు ఒకసారైనా రాత్రి పడుకునేముందు ఈ విధంగా చేయాలి. అలాగే గ్లిజరిన్ లోషన్‌ను రాత్రి పడుకునేముందు ప్రతిరోజూ తప్పక రాసుకోవాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే అరికాళ్ల పగుళ్ల సమస్య ఉండదు.