Lunger house police station
-
భారత్-పాక్ మ్యాచ్ పై జోరుగా బెట్టింగ్
హైదరాబాద్: చాలా కాలం తర్వాత దాయాదులైన ఇండియా- పాకిస్థాన్ ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుండటంతో బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగానేకాక పలు విదేశీ నగరాల్లోనూ భారీగా బెట్టింగ్ కార్యకలాపాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇటు హైదరాబాద్ లోనూ భారీ సంఖ్యలో జూదగాళ్లు రంగంలోకి దిగినట్లు సమాచారం. అయితే మ్యాచ్ ప్రారంభం నుంచే అప్రమత్తమైన పోలీసులు సాధ్యమైనంతమేర ఈ మహమ్మారిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం ఇండియా- పాక్ టీ20 మ్యాచ్ పై బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను లంగర్ హౌస్ పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు రూ. 25 లక్షల మేర బెట్టింగ్ సాగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు రాజేంద్రనగర్ హైదర్ గూడాలోని ఓ స్థావరంపై దాడిచేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.25 వేల నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, ఒక ల్యాప్ టాప్, టీవీని స్వాధీనం చేసుకున్నారు. ఈ రాత్రిలోగా మరిన్ని దాడులు నిర్వహించి బెట్టింగ్ రాయుళ్ల భరతం పడతామని పోలీసులు చెబుతున్నారు. -
ఏమార్చి... ఏటీఎం కార్డు మార్చి...
లంగర్‌హౌస్(హైదరాబాద్): ఏటీఎం కేంద్రంలో దృష్టి మరల్చి ఓ వ్యక్తి ఏటీఎంను కొట్టేశారు.. దానిని వాడుకుని రూ.61 వేలు డ్రా చేసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాలివీ... లంగర్‌హౌస్ బాగ్దాద్ కాలనీ నివాసి సుభాన్ ప్రై వేట్ ఉద్యోగి. సోమవారం అతడు నానల్‌నగర్ వద్ద ఉన్న ఎస్బీఐ ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. కార్డుతో డబ్బు డ్రా చేయడంలో కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అదే సమయంలో వరుస క్రమంలో ఉన్నట్లుగా వెనక కొందరు ఉండగా ఇద్దరు వ్యక్తులు అతనికి చెరో వైపు చేరారు. తాము సహకరిస్తామంటూ వారిద్దరూ అతని చేతిలో ఏటీఎం కార్డును యంత్రంలోకి పెట్టి తీసి, పిన్ నంబర్ కొట్టమన్నారు. అనంతరం 3 వేల నగదు సుభాన్ డ్రా చేశాడు. ఆపై వారి వద్ద నుంచి తన ఏటీఎం కార్డు తీసుకొని వెళ్లిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం డబ్బులు డ్రా చేయడానికి సుభాన్ ఏటీఎంకు వెళ్లాడు. అక్కడ కార్డు పని చేయడం లేదని తెలిసింది. అప్పటికీ గమనించని అతను తన కార్డు పని చేయడంలేదని బ్యాంకును సంప్రదించాడు. బ్యాంకు సిబ్బంది చూసి... డబ్బు డ్రా అయినట్లు చెప్పటంతో లంగర్‌హౌస్ పోలీసులను ఆశ్రయించాడు. ఏటీఎం కేంద్రంలో సాయం చేస్తామంటూ ఇద్దరు వ్యక్తులు వచ్చి..పనికిరాని కార్డును తనకు అంటగట్టి వెళ్లిపోయారని, తన కార్డును వాడుకుని ఖాతాలోని రూ.61 వేలు డ్రా చేసుకున్నారని పేర్కొన్నాడు. -
మత్తు మందిచ్చి బాలికపై అత్యాచారం
లంగర్‌హౌస్(హైదరాబాద్): మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ యువకుడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది. టోలిచౌకి మిరాజ్ కాలనీకి చెందిన బాలిక(15) టోలిచౌకిలోని సీఫా ఎలైట్ షోరూంలో పని చేస్త్తోంది. నౌనంబర్ హుడా కాలనీకి చెందిన హమీద్(26) అదే షోరూంలో సేల్స్ మెన్‌గా పనిచేస్తున్నాడు. ఓకే షోరూంలో పని చేస్తున్న వీరు స్నేహితులు కావడంతో రెండు రోజుల క్రితం హమీద్ ఆ బాలికను నానల్‌నగర్ వద్ద కలవాలని ఫోన్ చేశాడు. సమీపంలో తనకు కొద్దిగా పని ఉందని, ఆ తర్వాత షోరూంకు కలసి వెళ్దామని ఆమెతో నమ్మబలికాడు. దీంతో ఆ బాలిక నానల్‌నగర్‌కు రాగా ద్విచక్ర వాహనంపై గండిపేట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికకు మత్తు మందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చాడు. స్పృహ కోల్పోయిన బాలికపై అత్యాచారానికి పాల్పడాడు. తెలివి వచ్చిన తర్వాత ఆమె తనపై జరిగిన అఘాయిత్యంపై హమీద్‌ను నిలదిసింది. దీంతో అతను బాలికపై చేయిచేసుకున్నాడు. దీంతో బాధితురాలు మళ్లీ స్పృహ కోల్పోవడంతో భయపడ్డ హమీద్ కిషన్ బాగ్‌లో ఉండే తెలిసిన వైద్యుని వద్దకు తీసుకువచ్చి చికిత్స చేయించాడు. అనంతరం ఆమె ఇంటి సమీపంలో దింపి వెళ్లాడు. మరుసటి రోజు పూర్తిగా మత్తునుంచి తేరుకున్న ఆమె తనపై జరిగిన అఘాయిత్యం గురించి కుటుంబసభ్యులకు తెలిపింది. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికకు వైద్య పరిక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మంగళవారం హమీద్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కారు ఢీకొని టిప్పుఖాన్ బ్రిడ్జి ధ్వంసం
హైదరాబాద్: అదుపు తప్పి వేగంగా దూసుకెళ్లి కారు బీభత్సం సృష్టించింది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రెండు రోజుల్లో ఇది మూడో ప్రమాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... మాదాపూర్‌లో నివాసముండే నరేష్ మంగళవారం మధ్యాహ్నం ఆరె మైసమ్మ దేవాలయానికి వెళ్లారు. బోలేరో కారులో సాయంత్రం తిరుగు ప్రయాణంలో వేగంగా వస్తున్న కారు టిప్పుఖాన్ పూల్ కొత్త బ్రిడ్జి వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్‌ను ఢీ కొట్టింది. ఆ సమయంలో కారు ముందు టైరు పగిలింది. అంతటితో కారు అదుపులోకి రాలేదు. అంతే వేగంతో ముందుకు దూసుకెళ్లడంతో కారు ముందు భాగం విరిగింది, ఆ తరువాత కారు బ్రిడ్జిని ఢీ కొట్టింది. దీంతో బ్రిడ్జి భాగం ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆస్తి ధ్వసం కేసు నమోదు చేశారు.