'తెలుగు విద్యార్ధులు వలస పోతున్నారు'
హైదరాబాద్: ఎంసెట్ అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో చాలామంది తెలుగు విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వలసపోతున్నారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొ.ఎల్ వేణుగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలనుకూడా దృష్టిలో ఉంచుకుని ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన తెలిపారు.
అడ్మిషన్లకు ఈనెల 30న నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టు 7 నుంచి సర్టిఫికెట్ల పరిశీలన ఉంటుందని వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఆప్షన్ల ఎంపిక తర్వాత చేపడతామని ఓ ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈలోగా అడ్మిషన్లకు సంబంధించి వివిధ అంశాలపై ఇరురాష్ట్రాలు దృష్టిపెట్టాలని ఉన్నత విద్యామండలి ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొ.ఎల్ వేణుగోపాల్‌రెడ్డి సూచించారు.