కరాచీలో బాంబు పేలుడు: 11 మంది చిన్నారులు మృతి
పాకిస్థాన్‌లోని కరాచీ నగరంలో శక్తివంతమైన బాంబు పేలుడు సంభవించి 11 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు బుధవారం ఇస్లామాబాద్‌లో వెల్లడించారు. ఈ ఘటనలో మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. వారిని నగరంలోని ఆసుపత్రికి తరలించామని, అయితే వారి పరిస్థితి ఆందోళనగా ఉందని వైద్యులు తెలిపారన్నారు. నగరంలోని లయరి ప్రాంతంలో మార్కెట్ సమీపంలో పేలుడు పదార్థంతో ఉంచి మోటర్ బైక్ పేలి ఈ దుర్ఘటన చోటు చేసుకుందని తెలిపారు.
ఆ సమీపంలోనే చిన్నారులు పూట్‌బాల్ ఆట ముగించుకున్న కొన్ని నిముషాల వ్యవధిలోనే బాంబు పేలుడు ఘటన చోటు చేసుకుందని లయరి నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రోవెన్షియల్ అసెంబ్లీ సభ్యుడు సానియా నాజ్ చెప్పారు. కాగా గాయపడిన చిన్నారులంతా 12 నుంచి 14 ఏళ్ల లోపు చిన్నారులే అని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఫూట్‌బాల్ మ్యాచ్‌కు ముఖ్యఅతిథిగా హాజరైన సింధ్ ప్రోవెన్సియల్ అసెంబ్లీ సభ్యుడు జావెద్ నగొరి కూడా గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు తెలిపారు.