M Kantha Rao
-
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని ఆదివారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ భోసలే కుటుంబసభ్యులతో శ్రీవారిని దర్శించుకున్నారు. అలాగే టాస్క్‌ఫోర్స్ డీఐజీ ఎం. కాంతారావు, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే నారాయణస్వామి కుటుంబసభ్యులతో శ్రీనివాసుని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. -
వరంగల్ డీఐజీ ఎదుట ఇద్దరు మావోల లొంగుబాటు
ఆనారోగ్యం కారణంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు మావోయిస్టులు ఈ రోజు తమ ఎదుట లొంగిపోయారని వరంగల్ రేంజ్ డీఐజీ ఎం.కాంతారావు శనివారం ఇక్కడ వెల్లడించారు. సుకుమా జిల్లాకు చెందిన దులారాం అలియాస్ యోగేశ్ పశ్చిమ బస్తార్ డివిజన్లో కమిటీ సభ్యునిగా పనిచేస్తున్నారని తెలిపారు. అలాగే కే పూజి అలియాస్ అనిత బీజాపూర్ డివిజన్లో కమిటీ సభ్యురాలుగా పని చేస్తుందని చెప్పారు. యోగేశ్‌పై దాదాపు 100 కేసులు ఉన్నాయని వాటిలో 13 హత్య కేసులని అన్నారు. అతన్ని పట్టుకుంటే 1.6 లక్షల రివార్డు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించిందని కాంతారావు చెప్పారు. అలాగే అనితపై 8 కేసు నమోదు ఉన్నాయని తెలిపారు. ఆమె 2001 నుంచి మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహారిస్తుందని అన్నారు. ఆమె తలపై రూ. లక్ష రివార్డును ప్రభుత్వం ప్రకటించిందన్నారు.