m v mysoora reddy
-
'అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ'
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఎం. వి. మైసూరారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో మైసూరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలలో తమ పార్టీని సీమాంధ్ర ప్రజలు ఆదరించారన్నారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఏకపక్షంగా ఓటు వేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ సీపీని ఆదరించిన ప్రజలకు మైసూరా రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తమ పార్టీ140 సీట్లు కైవసం చేసుకుంటుందని మా అంచనా ప్రకారం తేలిందని చెప్పారు. 25 లోక్‌సభ సీట్లు గెలిచి కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ కేంద్రంలో చక్రం తిప్పబోతోందని అన్నారు. టీడీపీ నేతలకు జనస్పందన లేక చేతులెత్తేసి భౌతిక దాడులకు దిగారని మైసూరా ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు. అందుకు సాక్షాత్తు ఈసీని కూడా బెదిరించి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని విమర్శించారు.సీమాంధ్రలో బుధవారం అటు లోక్‌సభ ఇటు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా మైసూరా రెడ్డి విలేకర్లతో పై విధంగా మాట్లాడారు. -
చిరంజీవి వ్యాఖ్యలు హస్యాస్పదం: మైసూరారెడ్డి
హైదరాబాద్ నగరాన్ని దేశానికి రెండో రాజధానిగా చేయాలని కేంద్ర మంత్రి చిరంజీవి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్‌నేత మైసూరారెడ్డి ఆదివారం విశాఖపట్నంలో వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వల్ల 3 ప్రాంతాలకు నదీజలాల విషయంలో తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. అంతరాష్ట్ర నదీజలాల బోర్డు ఏర్పడితే ప్రాజెక్ట్‌లు వట్టిపోతాయని మైసూరారెడ్డి తెలిపారు. యూపీఏ అధ్యక్షురాలు సోనియా నిర్ణయంతో దేశం ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడుతుందని ఆ పార్టీ నేత దాడి వీరభద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం సాధించలేదన్న ఒకే ఒక్క స్వార్థంతో రాష్ట విభజన చిచ్చుపెట్టి ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారని ఆయన కాంగ్రెస్ అధిష్టానంపై మండిపడ్డారు. విదేశీయురాలైన సోనియాకు దేశ సమగ్రతపై ఏమంత అవగాహన ఉందని దాడి వీరభద్రరావు ఈ సందర్భంగా ప్రశ్నించారు. హైదరాబాద్ నగరాన్ని భారతదేశానికి రెండో రాజధానిగా చేయాలి లేదా కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రమంత్రి చిరంజీవి శనివారం కేంద్రాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.