'అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ' | YS Jagan Mohan Reddy hawa in Seemandhra, says M V Mysoora Reddy | Sakshi
Sakshi News home page

'అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ'

Published Wed, May 7 2014 3:19 PM | Last Updated on Wed, Aug 8 2018 5:54 PM

'అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ' - Sakshi

'అన్ని ప్రాంతాల్లో మాకే ఆదరణ'

రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ సీనియర్ నేత ఎం. వి. మైసూరారెడ్డి తెలిపారు. బుధవారం హైదరాబాద్లో మైసూరారెడ్డి విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్రలోని అన్ని ప్రాంతాలలో తమ పార్టీని సీమాంధ్ర ప్రజలు ఆదరించారన్నారు. ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఏకపక్షంగా ఓటు వేశారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ సీపీని ఆదరించిన ప్రజలకు మైసూరా రెడ్డి ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.

 

ఎన్నికల్లో తమ పార్టీ140 సీట్లు కైవసం చేసుకుంటుందని మా అంచనా ప్రకారం తేలిందని చెప్పారు.  25 లోక్సభ సీట్లు గెలిచి కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ కేంద్రంలో చక్రం తిప్పబోతోందని అన్నారు. టీడీపీ నేతలకు జనస్పందన లేక చేతులెత్తేసి భౌతిక దాడులకు దిగారని మైసూరా ఆ పార్టీ నేతలను ఉద్దేశించి ఆరోపించారు. అందుకు సాక్షాత్తు ఈసీని కూడా బెదిరించి బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నారని విమర్శించారు.సీమాంధ్రలో బుధవారం అటు లోక్సభ ఇటు శాసనసభకు ఎన్నికలు జరిగాయి. ఈ సందర్బంగా మైసూరా రెడ్డి విలేకర్లతో పై విధంగా మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement