Maa Nanna Naxalite Movie
-
తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’
‘‘నక్సల్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే తండ్రీకొడుకుల ఎమోషనల్ కథే ‘మా నాన్న నక్సలైట్’ చిత్రం. ఈ చిత్రం ప్రేక్షకుల మనసులను హత్తుకుంటుంది. చదలవాడ శ్రీనివాసరావుగారు కథ విని మంచి సినిమా అవుతుందనే నమ్మకంతో మమ్మల్ని ప్రోత్సహించారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ బ్యానర్లో సినిమా చేయడాన్ని హ్యాపీగా ఫీలవుతున్నాను’’ అన్నారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి. గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె ప్రధాన పాత్రలో సునీల్‌కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘మా నాన్న నక్సలైట్’ చిత్రం బాగా వచ్చింది. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న మంచి సెంటిమెంట్ సినిమా ఇది. సోసైటీకి ఉపయోగపడుతుంది. నా బ్యానర్లో వస్తోన్న మరో అద్భుతమైన చిత్రం ఇది. సునీల్కుమార్గారితో మరిన్ని సినిమాలు చేస్తా’’ అన్నారు. -
Maa Nanna Naxalite : ‘ఒసేయ్ రాములమ్మ’ గుర్తొచ్చింది
గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు రఘు కుంచె లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మా నాన్న నక్సలైట్’. పి. సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్‌పై చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ– ‘‘గతంలో ‘మాతృదేవోభవ’ చిత్రం చూసి ఎంత భావోద్వేగానికి లోనయ్యానో ‘మా నాన్న నక్సలైట్’ చూశాక అంతే అనుభూతికి లోనయ్యాను’’ అన్నారు. ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూస్తుంటే దాసరి నారాయణరావుగారు తీసిన ‘ఒసేయ్ రాములమ్మ’ చిత్రం గుర్తుకు వచ్చింది’’ అన్నారు దర్శకుడు రేలంగి నరసింహారావు. ‘‘నా తండ్రికి ఇచ్చే సెల్యూట్, నా కొడుకుకి ఇచ్చే గిఫ్ట్ ఈ సినిమా’’ అన్నారు సునీల్ కుమార్ రెడ్డి. ఈ కార్యక్రమంలో డైరెక్టర్, నటుడు కాశీ విశ్వనాథ్, నిర్మాత ప్రసన్న కుమార్, లిరిక్ రైటర్ రవీంద్ర బాబు, నటుడు కృష్ణ, నటి రేఖా నిరోషా పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి , కెమెరా: ఎస్వి శివరామ్.