నేడు ఆజాద్ మైదాన్‌లో నిరసన
సాక్షి, ముంబై: నగరంలో హత్యకు గురైన తెలుగమ్మాయి ఎస్తేర్ అనూహ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలుగు ప్రజలు మంగళవారం నిరసనకు దిగనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు ఆజాద్ మైదాన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు మాదిరెడ్డి కొండారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆ కేసును త్వరితగతిన విచారించి నిందితులకు శిక్ష వేయాలన్నారు. భారీగా తెలుగు ప్రజలు పాల్గొనాలని కోరారు.
ఘననివాళి
పింప్రి, న్యూస్‌లైన్: పుణే సాక్షి మీడియా బృందం దేహూరోడ్డులోని ‘ట్రైజీసస్ మినిస్ట్రీస్’ తెలుగు చర్చిలో ఆదివారం సాయంత్రం ఘననివాళి అర్పించారు. చర్చి పాస్టర్ జాకప్ వీరప్ప సమక్షంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగువారి కోసం హెల్ప్‌లైన్‌ను ప్రారంభించాలని సూచించారు.
ఏదైనా ఘటన జరిగితే రాష్ర్టంలోని తెలుగువారంతా కుల మతాలకు అతీతంగా ఏకం కావాలన్నారు. కార్యక్రమంలో స్థానిక తెలుగు సమాజ సభ్యులు శివప్రసాద్, దేహూరోడ్ తెలుగు పాఠశాల ఉపాధ్యాయులు వీరేష్, రమాంజనేయులు, భీంసింగ్ తల్వాది,టీసీఎస్ కంపెనీకి చెందిన ఉద్యోగులు లక్ష్మీ సుధీర్, గంగా తల్వాది, దీపా, ప్రియాంక తదితరులు హాజరయ్యారు.