Madarsa teacher
-
మదరసాలో కీచకపర్వం
సాక్షి, దాచేపల్లి: మదరసాలో చదువుకునేందుకు వచ్చిన బాలికపై మదరసా నిర్వాహకుడు కన్నేశాడు. బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆపై బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. గుంటూరు జిల్లా దాచేపల్లిలోని చాపలగడ్డ మదరసాలో జరిగిన ఈ ఘటన శుక్రవారం వెలుగులోకొచ్చింది. విషయం తెలుసుకున్న ముస్లిం మతపెద్దలు, నాయకులు మదరసా వద్ద ఆందోళనకు దిగారు. స్థానికులు, ముస్లిం నేతల కథనం ప్రకారం.. ఆలిం కోర్సు చదివేందుకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 60 మంది బాలికలు మదరసాలో చేరారు. షేక్ ముఫ్తీ అబ్దుల్ సత్తార్ దీనిని పర్యవేక్షిస్తున్నాడు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు. మదరసాలోని 17 ఏళ్ల బాలికపై ఆయన కన్నేసి.. కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి బాలిక, సత్తార్ కలిసి ఉండటాన్ని మిగతా విద్యార్థినులు గమనించి నిలదీశారు. ఈ విషయం ముస్లిం మతపెద్దలు, నాయకుల దృష్టికెళ్లడంతో వారంతా శుక్రవారం మదరసా వద్దకు వచ్చి అబ్దుల్ సత్తార్, అతని కుటుంబ సభ్యులను నిలదీశారు. వారం కిందటే తాను బాలికను వివాహం చేసుకున్నట్లు అబ్దుల్ సత్తార్ చెప్పాడు. మత సంప్రదాయాలకు విరుద్ధంగా, మైనార్టీ కూడా తీరని బాలికను ఎలా వివాహం చేసుకున్నావంటూ వారు నిలదీయటంతో అక్కడ నుంచి ఉడాయించాడు. పిల్లలను ఇళ్లకు తీసుకెళ్లిన తల్లిదండ్రులు ఈ విషయంపై ముస్లిం మతపెద్దలు, నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి.. మదరసా ఖాళీ చేయాలని డిమాండ్ చేయడంతో అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులను పిలిపించి మదరసా నుంచి పిల్లలను పంపించారు. అబ్దుల్ సత్తార్ కుటుంబ సభ్యులను బయటకు పంపేలా.. మదరసా నిర్వహణకు సహకారం అందించే ముస్లింలతో పాటు మతపెద్దలు తీర్మానం చేశారు. గురజాల డీఎస్పీ శ్రీహరి, సీఐ కోటేశ్వరరావు కూడా మదరసాను సందర్శించి జరిగిన వ్యవహారం గురించి ఆరా తీశారు. అంగన్వాడీ కార్యకర్తల సమక్షంలో బాధిత బాలిక వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. అబ్దుల్ సత్తార్ తనను బెదిరించి లైంగిక దాడి చేసి.. బలవంతంగా వివాహం చేసుకున్నాడని బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
జై శ్రీరాం అనలేదని.. రైలు నుంచి తోసేశారు
కోల్‌కతా : గత ఏడాది మూక హత్యలు, గో రక్షకుల దాడులతో దేశం అట్టుడికిపోగా తాజాగా జై శ్రీరాం నినాదాల పేరిట హింసాకాండ కొనసాగుతోంది. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ ముఖ్యంగా ముస్లింల మీద దాడులు చేస్తున్న సంఘటనల గురించి వింటూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో తాజాగా ఇలాంటి సంఘటన మరొకటి పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకుంది. జై శ్రీరాం నినాదాలు చేయాలంటూ కొందరు వ్యక్తులు ఓ మదర్సా టీచర్‌పై దాడి చేసి రైలులోంచి తోసేశారు. వివరాలు.. హఫీజ్ మహ్మద్ షారుక్ హల్దార్(26) మదర్సా టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న హఫీజ్ దగ్గరకు కొందర వ్యక్తులు వచ్చారు. అతనిపై దాడి చేస్తూ.. జై శ్రీరాం నినదాలు చేయాల్సిందిగా బలవంతం చేశారు. కానీ హఫీజ్ అందుకు ఒప్పకోలేదు. దాంతో అతడిని ట్రైన్ నుంచి బయటకు తోసేశారు. ప్లాట్‌ఫాం మీద పడిపోయిన హఫీజ్‌ను గమనించిన స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అదృష్టవశాత్తు.. ఈ దాడిలో హఫీజ్ చిన్న చిన్న గాయాలతోనే బయటపడ్డాడు. ఈ విషయం గురించి రైల్వే పోలీసు అధికారులు మాట్లాడుతూ.. హఫీజ్‌పై దాడి చేసిన వ్యక్తుల గురించి ఎలాంటి సమాచారం లభించలేదు. కానీ త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని వెల్లడించారు. -
లైంగిక వేధింపుల కేసులో టీచర్ అరెస్ట్
తిరువనంతపురం : విద్యాబుద్ధులు నేర్పించి పిల్లలకు మార్గదర్శనంగా నిలవాల్సిన మదర్సా టీచర్ మైనర్ బాలికలను లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. పన్నెండు మందికి పైగా విద్యార్ధినులపై లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక గురువును పోలీసులు అరెస్ట్ చేశారు. కొట్టాయం జిల్లా కొడునగలూర్లో స్ధానిక మొహల్లా కమిటీ ఫిర్యాదుపై మదర్సా టీచర్ యూసఫ్(63)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాను పాతికేళ్ల వయసు నుంచే బాలికలపై లైంగిక దాడులకు పాల్పడేవాడినని నిందితుడు యూసఫ్ అంగీకరించాడని పోలీసులు తెలిపారు. తాను చిన్నతనంలో లైంగిక వేధింపులకు గురయ్యానని, తనపై లైంగిక దాడి చేసిన వ్యక్తి కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి ప్రతీకారం తీర్చుకున్నానని చెప్పాడని వెల్లడించారు. బాలికలకు లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసే అవగాహన, చట్టపరమైన చర్యలు తెలియవనే ధీమాతో తాను ఈ పనులకు తెగబడ్డానని నిందితుడు పేర్కొనడం గమనార్హం. -
అమ్మాయిపై మదర్సా టీచర్ అత్యాచారం
బండి (రాజస్థాన్): పదహారేళ్ల బాలికపై ఓ మదర్సా ఉపాధ్యాయుడు, అతడి స్నేహితుడు కీచక చర్యకు పాల్పాడ్డారు. రాజస్థాన్‌లోని సమర్గంజ్ మండి పట్టణంలో బాధిత బాలికపై ఆ ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టారు. ఇందరగఢ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జనవరి 1న మదర్సాలో చదువుతున్న తన చెల్లెలిని ఇంటికి తీసుకొచ్చేందుకు బాధిత బాలిక అక్కడికి వెళ్లింది. దీంతో షరీఫ్ అనే ఉపాధ్యాయుడు ఆమెకు మాయమాటలు చెప్పి మసీదులోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మళ్లీ గత బుధవారం బాలిక ఇంటికి వచ్చి ఆమెకు ఏవో కారణాలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అతను, అతని స్నేహితుడు అక్బర్ అత్యాచారానికి ఒడిగట్టారు. తనపై జరిగిన దురాగతాన్ని బాధిత బాలిక రషీద్ అనే వ్యక్తికి చెప్పగా.. ఈ విషయాన్ని బయటకు చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు. దీంతో గత్యంతరం లేక ఆ బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో ముగ్గురు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 376 డీ (అత్యాచారం), 120, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షలకు పంపించామని, ప్రస్తుతం పరారీలో నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.