made in china
-
సమతామూర్తి విగ్రహం.. ప్రధానిపై ‘మేడ్ ఇన్ చైనా’ విసుర్లు
ప్రపంచంలోనే అతిపెద్ద రెండో విగ్రహం(కూర్చున్న పొజిషన్లో) రామానుజాచార్యను ఆవిష్కరించిన దేశ ప్రధాని మోదీ.. జాతికి అంకితమిచ్చిన విషయం తెలిసిందే. ముచ్చింతల్(శంషాబాద్ దగ్గర) జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమం.. టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల తుటాలకు కారణమైంది. అయితే ఇప్పుడు అంశం దేశ రాజకీయాలకు చేరింది. సమతామూర్తి విగ్రహం ఆధారంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మేడ్ ఇన్ చైనా కామెంట్లతో దేశ ప్రధాని నరేంద్ర మోదీపై విసుర్లు విసిరారు. సమతామూర్తి విగ్రహం చైనాలో తయారైంది. కాబట్టి, నవ భారతం.. ఆత్మ నిర్భర్ కాదు.. చైనా నిర్భర్(ఆధారపడడం) అంటూ సెటైర్లు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ అంటారు. కానీ, నవ భారతం చైనా మీద ఆధారపడుతోంది. సమతామూర్తి విగ్రహమే అందుకు నిదర్శనం. ఇది చైనా కంపెనీ ఆధ్వర్యంలో రూపొందించబడింది అంటూ రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు. Statue of Equality is Made in China. ‘New India’ is China-nirbhar? — Rahul Gandhi (@RahulGandhi) February 9, 2022 ఇదిలా ఉంటే.. కొన్ని నివేదికల ఆధారంగా రాహుల్ గాంధీ ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. 216 అడుగుల స్టాచ్యూ ఆఫ్ ఇక్వాలిటీ(సమతామూర్తి విగ్రహం)ను చైనాకు చెందిన అయిర్సన్(Aersun) కార్పొరేషన్ రూపొందించింది. 2015 ఆగష్టులో కాంట్రాక్ట్‌ను ఆ కంపెనీకి అప్పగించగా.. చైనాలోనే దాదాపు పని పూర్తైంది. సుమారు 1,600 భాగాలు చైనాలో తయారయ్యి.. ఇక్కడికి వచ్చాయి. అమరిక ప్రక్రియకు సుమారు 15 నెలలు పట్టింది. కాంట్రాక్టు బిడ్డింగ్‌ను గెలుచుకోవడానికి భారతీయ కంపెనీ కూడా పోటీలో నిలిచింది అని ఆ నివేదిక వెల్లడించింది. మరి రాహుల్ ఆరోపణలపై.. బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. చైనా విషయంలో ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ బలంగా మాటల దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకు ముందు పార్లమెంటులో రాహుల్ ప్రసంగిస్తూ.. చైనీయులకు వాళ్లు ఏమి చేయాలనుకుంటున్నారనే దానిపై స్పష్టమైన దృక్పథం ఉందని, చైనా,పాకిస్తాన్‌లు ఏకతాటిపై రావడానికి భారతదేశం అనుమతించిందని, ఇది అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదమని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘‘భారతదేశపు విదేశాంగ విధానం ఏకైక అతిపెద్ద వ్యూహాత్మక లక్ష్యం.. పాకిస్తాన్ చైనాలను వేరుగా ఉంచడం. ఇది భారతదేశానికి ప్రాథమికమైనది. కానీ, మీరు(మోదీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ..) ఏం చేశారు? వారిని ఏకతాటిపైకి తీసుకొచ్చారు’’ అని లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు. మనమందరం జాతీయవాదులుగా చర్చిద్దాం. విదేశాంగ విధానంలో మన ప్రభుత్వం వ్యూహాత్మక తప్పులు చేస్తోంది. చైనాను తక్కువ అంచనా వేయొద్దు అంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు చైనాలో తయారైన సమతామూర్తి విగ్రహంతో చైనా నిర్భర్‌ను ప్రదర్శిస్తున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. -
చైనా బొమ్మలతో డేంజర్!
Dangerous Chemicals In China Toys: మేడ్ ఇన్ చైనా బొమ్మలకు అమెరికా చెక్ పోస్ట్ వేసింది. చైనా నుంచి నౌకల్లో చేరిన బొమ్మలను దేశంలోకి రాకుండా అడ్డుకుంది. తాజాగా పోర్ట్‌లోనే సుమారు ఏడు బాక్స్‌ల బొమ్మలను అధికారులు సీజ్ చేయడం విశేషం. ఇందుకు కారణం.. బొమ్మల్లో ప్రమాదకరమైన కెమికల్స్‌ను గుర్తించడం!. చైనా నుంచి వచ్చిన బొమ్మల్లో ప్రమాదకరమైన రసాయనాల ఆనవాళ్లను అమెరికా అధికారులు గుర్తించారు. ఈ మేరకు షిప్లో వచ్చిన మేడ్ ఇన్ చైనా బొమ్మల్ని అమెరికా కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. భారత్‌లో బాగా ఫేమస్ అయిన లగోరి(స్వీట్, పల్లీ.. ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు) తరహా చైనా మేడ్ బొమ్మలూ ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది. జులై 16న చేపట్టిన కన్జూమర్ ప్రొడక్ట్స్ సేఫ్టీ కమిషన్(CPSC), సీబీపీ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీలలో ప్రమాదకరమైన కెమికల్స్ ఉన్న బొమ్మల్ని గుర్తించారు. కొన్ని బొమ్మలకు సీసం, కాడ్మియం, బేరియం పూత పూస్తున్నారని, దానివల్ల పిల్లల ప్రాణాలకు ముప్పుపొంచి ఉందని పేర్కొంటున్నారు వైద్యులు. అంతేకాదు ఆగష్టు 24న చైనా నుంచి షిప్ ద్వారా వచ్చిన కొన్ని బొమ్మల్లోనూ ఈ కెమికల్స్ ఆనవాళ్లను నిర్ధారించారు. ఈ తరుణంలో అక్టోబర్ 4న అమెరికాకు చేరుకున్న చైనా బొమ్మల్ని సీజ్ చేయడం విశేషం. మరోవైపు హాలీడే షాపింగ్ సీజన్ నేపథ్యంలో యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్(సీపీబీ) అప్రమత్తమైంది. అంతేకాదు ఆన్లైన్ షాపింగ్ చేసేప్పుడు పిల్లల బొమ్మల విషయాల్లో జాగ్రత్తగా ఎంచుకోవాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ ఎఫెక్ట్‌తో చైనా బొమ్మల వర్తకంపై భారీ ప్రతికూల ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది. చదవండి: చైనాలో భారీ కార్పొరేట్ పతనం తప్పదా? -
చైనా కార్లా?.. టెస్లాకు భారత్ డెడ్లీవార్నింగ్
న్యూఢిల్లీ: గత కొద్ది నెలల నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా ఎలక్ట్రిక్ కార్ల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలో ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయాలని అమెరికాకు చెందిన టెస్లాను అనేకసార్లు కోరినట్లు, అదే సమయంలో సంస్థకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 'ఇండియా టుడే కాన్ క్లేవ్ 2021'ను ఉద్దేశించి గడ్కరీ మాట్లాడుతూ.. టాటా మోటార్స్ తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్లు టెస్లా తయారు చేసిన ఎలక్ట్రిక్ కార్ల కంటే తక్కువ ఏమి కాదని అన్నారు. చైనా ఎలక్ట్రిక్ కార్లు విక్రయించొద్దు.. "చైనాలో తయారు చేసిన మీ కంపెనీ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో విక్రయించవద్దు. భారతదేశంలోనే ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయాలి. ఇంకా అవసరం అయితే టెస్లా కార్లను ఇక్కడ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు" అని ఆయన అన్నారు. పన్ను రాయితీల విషయంలో సంస్థ డిమాండ్ చేసిన వాటి గురుంచి టెస్లా అధికారులతో తాను ఇంకా చర్చలు జరుపుతున్నానని రోడ్డు రవాణా, రహదారుల మంత్రి తెలిపారు. గత నెలలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ టెస్లాను మొదట భారతదేశంలో తన ఐకానిక్ ఎలక్ట్రిక్ వాహనాల తయారీని ప్రారంభించాలని కోరిన విషయం మనకు తెలిసిందే. (చదవండి: టెస్లా ఎలన్ మస్క్.. బెంజ్‌ని చూసి నేర్చుకో..!) ఇప్పటికే జర్మనికి చెందిన మెర్సిడెజ్ బెంజ్ ఇక్కడే ప్లాంట్ ఏర్పాటు చేసింది. గతేడాది ఆ సంస్థ రిలీజ్ చేసిన ఎస్ సిరీస్ కార్లు ఇండియాలో బాగానే క్లిక్ అయ్యాయి. దీంతో అమ్మకాలు పెంచుకునేందుకు పూనేలో కార్ల తయారీ యూనిట్‌ని రూ. 2,200 కోట్ల వ్యయంతో మెర్సిడెజ్ బెంజ్ ఏర్పాటు చేసింది. ఇండియాలో కార్ల తయారీ యూనిట్ నెలకొల్పి కార్ల ఉత్పత్తి ప్రారంభించడంతో కేంద్రం విధించే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించింది. దీంతో ఒక్కసారిగా బెంజ్ కార్ల ధరలు తగ్గిపోయాయి. మెర్సిడెజ్ బెంజ్ ఎస్ క్లాస్ 450 4 మ్యాటిక్ ధర రూ. 2.19 కోట్ల నుంచి రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. అలాగే, టెస్లా గనుక ఇక్కడే కార్ల తయారీ ప్లాంట్ నిర్మిస్తే దిగుమతి సుంకం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉన్నట్లు కొందరు అధికారులు తెలుపుతున్నారు. -
3 సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు ఎంత?
ముంబై: ఈ దీపావళికి బాలీవుడ్ నుంచి మూడు సినిమాలు బరిలో నిలిచాయి. అక్షయ్‌కుమార్ ‘హౌస్‌ఫుల్ 4’, తాప్సి ‘శాండ్ కీ ఆంఖ్’, రాజ్‌కుమార్ రావు ‘మేడిన్ చైనా’ ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. భారీ తారాగణంతో తెరకెక్కిన ‘హౌస్‌ఫుల్ 4’, అంచనాలకు తగినట్టుగానే ఆరంభ వసూళ్లు రాబట్టింది. తొలిరోజు ఈ సినిమా రూ.19.08 కోట్లు వసూలు చేసింది. శని, ఆదివారాల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశముంది. ప్రముఖ మహిళా షూటర్లు ప్రకాషి తోమర్, చంద్రో తోమర్ జీవిత కథ ఆధారంగా ‘శాండ్ కీ ఆంఖ్’ బాక్సాఫీస్ వద్ద కాస్త నిదానంగా వసూళ్లు రాబడుతోంది. తాప్సి పొన్ను, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం మొదటి రోజు దాదాపు రూ. 4.5 కోట్లు కలెక్షన్లు తెచ్చుకుంది. విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు ప్రధాన పాత్రలో నటించిన ‘మేడిన్ చైనా’ తొలి రోజు సుమారు రూ. 3 కోట్లు రాబట్టింది. సీనియర్ నటులు పరాశ్ రావల్, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించారు. విభిన్న కథలతో తెరకెక్కిన ఈ మూడు సినిమాల్లో ప్రేక్షకులు వేటిని ఆదరిస్తారో చూడాలి. -
ఆదంత్యం నవ్వించేలా ‘మేడ్ ఇన్ చైనా’ ట్రైలర్
బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్‌రావు నటించిన తాజా చిత్రం ‘మేడ్ ఇన్ చైనా’ ట్రైలర్ విడుదలైంది. గుజరాత్‌కు చెందిన వ్యాపారవేత్త రఘు జీవితకథ ఆధారంగా ‘మేడ్ ఇన్ చైనా’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా చిత్ర దర్శకుడు మిఖిల్ మాట్లాడుతూ.. ‘రాజ్‌కుమార్ రావు ‘మేడ్ ఇన్ చైనా’ చిత్రంలో నటించడానికి తన జీవితాన్ని కూడా రిస్కులో పెట్టారు. చిత్రంలోని పాత్ర కోసం అతడు షూటింగ్‌కు ముందు నెలరోజలపాటు చైనాలో గడిపారు. అక్కడ మాట్లాడే భాషను ఇష్టంగా నేర్చుకున్నారు. ముఖ్యంగా సినిమాలో లావుగా ఉండే పాత్ర కోసం శరీర బరువును సుమారు ఎనిమిది కిలోలు పెంచుకున్నారు. ఈ చిత్రానికి సంతకం చేయడానికి ముందునుంచే తన పాత్ర కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నార’ని తెలిపారు. మిఖిల్ ఇంతకుముందు ‘రాంగ్ సైడ్ రాజు’ చిత్రానికి దర్శకత్వం వహించి, జాతీయ అవార్డును సాధించిన విషయం తెలిసిందే. ‘హిందీ మీడియం’ ఫేమ్ దినేష్ విజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో మౌనీ రాయ్ రాజ్‌కుమార్‌రావుకు జంటగా.. వ్యాపారవేత్త రఘు భార్య రుక్మిణి పాత్రలో నటిస్తున్నారు. వ్యాపారవేత్త రఘు భారతదేశం నుంచి చైనా సందర్శనకు వెళ్లిన తీరు, అక్కడ ఆయన ఎదుర్కొన్న కష్టాలు, అనుభవాలు, ఆయన వ్యాపారవేత్తగా ఎదిగిన తీరు.. అన్ని అంశాలను ఫన్నీగా ప్రేక్షకులకు చూపినట్టు ట్రైలర్‌ను బట్టి అర్థమవుతోంది. కడుపుబ్బా నవ్వించేలా ఉన్న ఈ సినిమా ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి ఆదరణ లభిస్తోంది. ‘మేడ్ ఇన్ చైనా’ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. -
మేడిన్ చైనా
-
చైనా ఉత్పత్తులకు మళ్లీ ఆదరణ!
బీజింగ్ : కొన్నేళ్ల క్రితం వరకూ 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులకు అసలు ఆదరణ ఉండేది కాదు. అలాంటిది ప్రస్తుతం వాటికి డిమాండ్ పెరుగుతోందట. చైనాలోనే కాదు.. విదేశాల్లో సైతం వీటికి గిరాకీ ఎక్కువగానే ఉందట. ఈ ఉత్పత్తులు చౌకగా లభ్యం కావడంతో పాటు, నాణ్యతలోనూ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుండటంతో ఆదరణ కోల్పోయిన తన మార్కెట్ కు తానే ఓ గౌరవాన్ని సంపాదించుకుందట. 2011 వరకూ 70 శాతం స్మార్ట్ ఫోన్లు చైనాలో అమ్ముడుపోతే, అవన్నీ శామ్ సంగ్, యాపిల్, నోకియా ఫోన్లే. కనీసం వారి ఉత్పత్తులను ఆ దేశస్తులే కొనలేనంతగా ఆదరణ కోల్పోయారు. తమ ఉత్పత్తుల్లో అసలు నాణ్యత ఉండదని ఆ దేశ ప్రజలే ఒప్పుకొన్నారు. అలాంటి చైనా ఉత్పత్తులను ఐదేళ్ల తర్వాత చూస్తే... ప్రస్తుతం వాటి చరిత్ర మారిపోయిందట. చైనాలో స్వదేశీ స్మార్ట్ ఫోన్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగిందట. ప్రస్తుతం చైనాలో టాప్-10 స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో 8 చైనావే ఉన్నాయట. అంతర్జాతీయ ప్రమాణాలను అందిపుచ్చుకొని తన ఉత్పత్తుల్లో నాణ్యత పెంచుకోవడంతో వీటికి డిమాండ్ పెరిగిందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. 'మేడ్ ఇన్ చైనా' గౌరవాన్ని, ప్రతిష్టను మార్చడంలో స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా సహకరించాయని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో 'మేడ్ ఇన్ చైనా' ఉత్పత్తులు మళ్లీ మార్కెట్లకి ఆశ్చర్యాన్ని కలిగించవచ్చని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
మేక్ ఇన్ ఇండియా నినాదానికి బ్రేక్