madhapoor
-
మాదాపూర్ డ్రగ్స్ కేసు: పరారీలో హీరో నవదీప్.. అరెస్ట్ కోసం గాలింపులు!
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్ డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి . ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. డ్రగ్స్ తీసుకున్నవారిలో హీరో నవదీప్ కూడా ఉన్నారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు పేర్కొన్నాడు. (చదవండి: అలాంటి సీన్లు ఉన్నాయ్.. బేబీ సినిమాపై సీపీ సీవీ ఆనంద్ సీరియస్) నవదీప్ స్నేహితుడు రాంచందర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా పోలీసులు తేల్చి చెప్పారు. గతంలో టాలీవుడ్ డ్రగ్స్ కేసులోనూ నవదీప్ అభియోగాలు ఎదుర్కొన్నారు. అప్పట్లో ఎక్సైజ్, ఈడీ విచారణకు కూడా ఆయన హాజరయ్యారు. నేను ఎక్కడికి పారిపోలేదు: నవదీప్ మాదాపూర్ డ్రగ్స్ కేసుపై నవదీప్ స్పందించాడు. అసలు ఆ కేసుతో తనకు సంబంధమే లేదన్నారు. మీడియాలో వస్తున్న కథనాలపై స్పందిస్తూ.. సీపీ ఆనంద్ చెప్పినట్లుగా తాను పరారీలో లేనన్నాడు. హైదరాబాద్‌లోనే ఉన్నానని, పారిపోవాల్సిన అవసరం లేదన్నాడు. లవ్ మౌళి అనే తన కొత్త సినిమాకి సంబంధించిన సాంగ్ లాంచింగ్ ఈవెంట్లో బిజీగా ఉన్నానని ఆయన చెప్పారు. That's not me gentlemen I'm right here .. pls clarify thanks — Navdeep (@pnavdeep26) September 14, 2023 -
క్యాన్సర్‌ను జయించిన పిల్లలతో సెలబ్రిటీల 'మైరా' ర్యాంప్ వాక్
-
మాదాపూర్‌లో మహిళ హంగామా
హైదరాబాద్: మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ హంగామా సృష్టించింది. అతివేగంగా కారు నడుపుతూ మరో ఆడీ కారును ఢీకొట్టింది. మాదాపూర్‌లోని బెంజ్ షోరూం వద్ద నిన్న(శుక్రవారం) అర్ధరాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. రెండు కార్లకు చెందిన మహిళలు ఒకరిపై ఒకరు మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు విచారణ చేస్తున్న సమయంలోనే ఆ మహిళ హంగామా చేసింది. ఆ మహిళ తాగి ఉన్నట్లు అనుమానం రావడంతో పోలీసులు బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. ఆ టెస్ట్‌లో మహిళకు 130 పాయింట్లు వచ్చాయి. మహిళతో పాటు మరో వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. వారి వివరాలను మాత్రం పోలీసులు వెల్లడించలేదు. -
ఆ నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
సాక్షి, హైదరాబాద్ : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సీటీ(హెచ్‌సీయూ) విద్యార్థినిపై అత్యాచారయత్నం చేసిన దుండగులను మాదాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. డీసీపీ విశ్వప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం యూనివర్సీటీకి చెందిన ఓ యువతి ప్రవీణ్ అనే తన స్నేహితునితో కలిసి నల్లగండ్ల లేక్ వద్దకు వెళ్లింది. అక్కడే మాటు వేసి ఉన్న నలుగురు దుండగులు వీరిద్దరిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారు. వారి వద్ద ఉన్న డబ్బులు లాక్కున్నారు. అనంతరం ఆ నలుగురు యువతిపై లైంగికదాడికి యత్నించారు. ఆమె తన స్నేహితుడు ప్రవీణ్ సాయంతో దుండగుల నుంచి తప్పించుకొని బయటపడింది. అనంతరం యూనివర్సిటీ మిత్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఈ మేరకు రంగంలోకి దిగి డాగ్ స్క్వాడ్ సాయంతో దుండగులని పట్టుకున్నామని డీసీపీ తెలిపారు. అయితే ఆ నలుగురు మైనర్లు కావడం గమనార్హం. వారిలో ఇద్దరు పాత నేరస్తులేనని డీసీపీ పేర్కొన్నారు. -
చిత్ర రమణీయం
మాదాపూర్‌లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన సందర్శకులను ఆకట్టుకుంటోంది. కళాకారులు చాయ, పవన్ కుమార్ల చిత్రాలతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ను శ్రీవేంకటేశ్వర ఫైనార్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఎస్.వాణిదేవి శనివారం ప్రారంభించారు. ఈ ప్రదర్శన ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. కార్యక్రమంలో ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ కె.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. – మాదాపూర్ -
మాదాపూర్‌లో చే'నేత'..
మాదాపూర్: ‘సంఘం ది వీవింగ్ జర్నీ’ చేనేత వస్త్రప్రదర్శన మాదాపూర్ ఎన్ కన్వెన్షన్‌లో ఆదివారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు సాగనున్న ఈ ప్రదర్శనను ఎంపీ కవిత ప్రారంభించారు. డీకే ఆరుణ, పురందేశ్వరి ఈ ప్రదర్శనను సందర్శించి ఉత్పత్తులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డిజైనర్ శిల్పారెడ్డి, పింకిరెడ్డి, ఉమారెడ్డి, నాగ సుశీల, రజనీ యార్లగడ్డ, పలువురు డిజైనర్లు పాల్గొన్నారు. -
మాదాపూర్‌లో మెరిసిన సమంత
సాక్షి, సిటీబ్యూరో: టాలీవుడ్ బ్యూటీ సమంత నగరంలోని ఓ ప్రైవేటు కార్యక్రమంలో తళుక్కుమన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థ పేరం గ్రూప్ మాదాపూర్‌లోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన మెగా వెంచర్ల ఆవిష్కరణలో ఆమె పాల్గొన్నారు. ఆదిత్య అంకుర, ఆదిత్య గ్రాండ్, ఆదిత్య వర్ణ, ఆదిత్య లోటస్ పేరుతో తాము ఈ వెంచర్లను అందిస్తున్నట్టు సంస్థ సీఈఓ హరిబాబు చెప్పారు. కార్యక్రమంలో దర్శకుడు మారుతి, పలువురు సినీ నటులు పాల్గొన్నారు. సినీ నేపద్య గాయకులు సింహ, పరిణిక, హరిప్రియ, శోభన తమ పాటలతో డ్యాన్సర్లు నృత్యాలతో అతిథులను అలరించారు. -
నగరంలో మెరిసిన తేజస్విని..
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్, స్టైల్, లుక్ ప్రస్తుత జీవనశైలిలో భాగంగా మారాయని, తగిన జాగ్రత్తలు, ట్రీట్మెంట్స్తో అందాన్ని మరింతగా మెరిపించొచ్చని సినీ తార తేజస్విని అన్నారు. మాదాపూర్‌లో అనూస్ ఫ్రాంచైజీ సెలూన్‌ను ఆమె గురువారం ప్రారంభించారు. -
హైలైఫ్.. స్టైల్
సాక్షి, వీకెండ్ ప్రతినిధి: అత్యాధునిక, విలాస వస్తువులకు పేరొందిన హైలైఫ్ ఎక్స్పో మాదాపూర్‌లోని నోవాటెల్ హోటల్లో శుక్రవారం ప్రారంభమైంది. అహ్మదాబాద్, జైపూర్, ముంబై, పుణె, బెంగుళూర్, చెన్నై, కొచ్చి... తదితర ప్రాంతాలతో పాటు విదేశాల ఉత్పత్తులు ఇందులో కొలువుదీరాయి. ఈ ఎక్స్‌పోకు వర్ధమాన నటి జ్యోతి సేథి, పేజ్‌త్రీ ప్రముఖులు, ఫ్యాషన్ ప్రియులు హాజరయ్యారు. ఈ ప్రదర్శన మూడు రోజుల పాటు కొనసాగుతుంది. -
రోశయ్య మనువడి పెళ్లిలో వైఎస్.జగన్
సాక్షి,సిటీబ్యూరో: తమిళనాడు గవర్నర్ రోశయ్య మనుమడు అనిరుద్, బొమ్మిడాల కాశీవిశ్వనాథం మనుమరాలు లక్ష్మీప్రదీప్తిల వివాహం మాదాపూర్‌లోని ఎన్.కన్వెన్షన్‌లో ఆదివారం ఉదయం ఘనంగా జరిగింది. తెలంగాణ స్పీకర్ మధుసూధనాచారి, ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి, ఎంపీలు కేవీపీ రామచంద్రరావు, కవిత, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తదితర ప్రముఖులు వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. -
వావ్ నగరంలోనే..
ఇటీవల కురిసిన వర్షాలకు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పక్కన ఉన్న మేడికుంటలో నీళ్లు చేరాయి. దీంతో అక్కడ చేపలను పట్టే వారిలో ఆనందం కనిపిస్తోంది. గురువారం ఓ యువకుడు ఉత్సాహంగా వల వేస్తూ... చేపలు పట్టుకునే యత్నం చేశాడు. -
అఖిలానందం...
మాదాపూర్: మాదాపూర్ కావురిహిల్స్లో యువ హీరో అఖిల్ సందడి చేశాడు. బుధవారం స్టార్టప్ క్రికెట్ లీగ్ 2016 ప్రోగ్రామ్‌లో పాల్గొన్న ఈ ‘సిసింద్రీ’ సెల్ఫీలతో అభిమానులను అలరించారు. -
బలవంతంగా ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకెళ్లి..
► రూ.1.25 కోట్లకు చెక్కులపై సంతకాలు చేయించుకున్న దుండగులు ► పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు మాదాపూర్: బలవంతంగా ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకెళ్లి.. అతడితో రూ. కోటి 25 లక్షల చెక్కులపై సంతకం చేయించుకున్నరు ఆరుగురు దుండగులు. మాదాపూర్ ఇన్స్పెక్టర్ కలింగరావు కథనం ప్రకారం... నెల్లూరుకు చెందిన మల్లికార్జున(44) మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ సాయినికేతన్ అపార్ట్మెంట్, ప్లాటు నెం–304లో నివసిస్తూ స్థాని కంగా వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 13న ఉద యం 11.30కి ఖైరతాబాద్‌లో ఉన్న గెలాక్సీ వైన్స్ యజమాని ప్రవీణ్ తన కారు (ఏపీ11 ఏవో7299) లో మరో ఐదుగురితో కలిసి మల్లికార్జునను బల వంతంగా తీసుకెళ్లాడు. బేగంపేట తీసుకెళ్లి రూ. 50 లక్షలకు ఒక చెక్కుపై , రూ.75 లక్షలకు మరో చెక్కు పై సంతకాలు చేయించుకున్నారు.అంతేకాకుండా వంద రూపాయల స్టాంపు పేపర్‌పై నెల్లూరులో ఉన్న మల్లికార్జున్‌కు చెందిన ఆస్తులను కూడా రాయించుకొని... అదే రోజు రాత్రి మల్లికార్జునను వదిలేశారు. బాధితుడు ఈ విషయంపై ఈనెల 15 మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రవీణ్‌తో పాటు ఆరుగురిపై 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం మాదాపూర్ పోలీసులు గాలిస్తున్నా రు. గతంలో మల్లికార్జున్– ప్రవీణ్‌ల మధ్య లావాదేవీలున్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.