బలవంతంగా ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకెళ్లి.. | man forced to kidnaped and money robbed | Sakshi
Sakshi News home page

బలవంతంగా ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకెళ్లి..

Published Wed, Jul 20 2016 9:37 PM | Last Updated on Wed, Aug 29 2018 8:36 PM

man forced to kidnaped and money robbed

  ►     రూ.1.25 కోట్లకు చెక్కులపై సంతకాలు చేయించుకున్న దుండగులు
  ►     పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు

మాదాపూర్‌: బలవంతంగా ఓ వ్యక్తిని కారులో ఎక్కించుకెళ్లి.. అతడితో రూ. కోటి 25 లక్షల చెక్కులపై సంతకం చేయించుకున్నరు ఆరుగురు దుండగులు. మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కలింగరావు కథనం ప్రకారం... నెల్లూరుకు చెందిన మల్లికార్జున(44) మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీ సాయినికేతన్‌ అపార్ట్‌మెంట్, ప్లాటు నెం–304లో నివసిస్తూ స్థాని కంగా వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 13న ఉద యం 11.30కి ఖైరతాబాద్‌లో ఉన్న  గెలాక్సీ వైన్స్‌ యజమాని ప్రవీణ్‌ తన కారు (ఏపీ11 ఏవో7299) లో మరో ఐదుగురితో కలిసి మల్లికార్జునను బల వంతంగా తీసుకెళ్లాడు.

బేగంపేట తీసుకెళ్లి రూ. 50 లక్షలకు ఒక చెక్కుపై , రూ.75 లక్షలకు మరో చెక్కు పై సంతకాలు చేయించుకున్నారు.అంతేకాకుండా వంద రూపాయల స్టాంపు పేపర్‌పై నెల్లూరులో ఉన్న మల్లికార్జున్‌కు చెందిన ఆస్తులను కూడా రాయించుకొని... అదే రోజు రాత్రి మల్లికార్జునను వదిలేశారు. బాధితుడు ఈ విషయంపై ఈనెల 15 మాదాపూర్‌ పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. పోలీసులు ప్రవీణ్‌తో పాటు ఆరుగురిపై 384 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం మాదాపూర్‌ పోలీసులు గాలిస్తున్నా రు. గతంలో మల్లికార్జున్‌– ప్రవీణ్‌ల మధ్య లావాదేవీలున్నట్టు తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement