‘మాధవీ కృష్ణమూర్తి’ పిటిషన్పై నేడు విచారణ
సాక్షి, హైదరాబాద్: తనకు అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ కన్ఫర్డ్ ఐఏఎస్ హోదా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరిస్తోందని, ఈ క్రమంలోనే తన పేరును యూపీఎస్సీకి సిఫార్సు చేయలేదని ఆరోపిస్తూ ప్రభుత్వాధికారి మాధవీ కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు. వివాదం తేలేవరకు 6 కన్ఫర్డ్ పోస్టుల్లో ఒకదాన్ని ఖాళీగా ఉంచేలా ఆదేశించాలని ఆమె తన పిటిషన్లో కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రానుంది.
నేడు, రేపు ఇంటర్వ్యూలు
రెవెన్యూయేతర 6 కనఫర్డ్ ఐఏఎస్ పోస్టులకుగాను శుక్ర, శనివారాల్లో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. మొత్తం 30 మందిలో 14 మందికి ఇప్పటికే ఇంటర్వ్యూలు ముగియగా, మిగతా 16 మందికి యూపీఎస్సీ చైర్మన్ నేతృత్వంలోని కమిటీ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.