madhura nagar
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు దిగుతుంటే.. మరోవైపు అదే ట్రాఫిక్ పోలీస్ అధికారి మద్యం తాగి అడ్డంగా బుక్కయ్యాడు. అంతటితో ఆగకుండా తాను మద్యం తాగలేదని బుకాయిస్తూ బ్రీత్ అనలైజర్‌కు సహకరించలేదు. అనంతరం సినిమా రేంజ్ ట్విస్ట్‌తో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ఏసీపీ సుమన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ చిక్కారు. ఆ సమయంలో యూనిఫామ్‌లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. అందుకు ఆయన నిరాకరించాడు. అంతటితో ఆగకుండా తాను కూడా పోలీసు డిపార్ట్మెంట్ అంటూ అక్కడున్న వారిపై మండిపడ్డారు. దీంతో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే సుమన్‌కు అదుపులోకి తీసుకున్నారు. -
కాలు జారి బస్సు కింద పడి విద్యార్థిని మృతి
-
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్‌పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్‌కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్‌ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శివారెడ్డి స్వీట్ షాప్‌లో దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ మిఠాయి దుకాణం శివారెడ్డి స్వీట్ షాప్‌లో దారుణం చోటుచేసుకుంది. శివారెడ్డి స్వీట్ హౌస్‌లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది ఓ మహిళ విషయంలో తీవ్రంగా ఘర్షణ పడ్డారు. తీవ్ర గాయాలైన ఓ వర్కర్ మృతి చెందాడు. వివరాలు.. మధురానగర్‌లోని శివారెడ్డి స్వీట్ షాప్‌లో శ్రీనివాస్, గౌస్ పనిచేస్తున్నారు. ఓ మహిళతో వివాహేతర సంబంధం విషయంలో ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన గౌస్.. శ్రీనివాస్ మొహం, తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం కొత్త గూడెం జిల్లా రామవరం. భద్రాద్రి జిల్లాకు చెందిన మహిళ వీరి గొడవకు కారణంగా తెలిసింది. ఆమె ముందే జరిగిన ఈ ఘర్షణ జరిగినట్టు సమాచారం. ఘటనపై ఎస్సార్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: మహిళపై 12 మంది గ్యాంగ్ రేప్) -
లేడీస్ స్పెషల్
సాక్షి,సిటీబ్యూరో: తరుణి మధురానగర్ మెట్రో స్టేషన్ సమీపంలో మహిళలకు ప్రత్యేకంగా 60 రోజుల పాటు ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. త్వరలో ఈ ప్రదర్శనను ప్రారంభిస్తామన్నారు. ఈ స్టేషన్ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా మహిళలే చేపడతారన్నారు. ఈ ప్రదర్శనలో మహిళలు, చిన్నారులకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు లభ్యమయ్యేలా దుకాణాలను ఏర్పాటు చేయనున్నామన్నారు. స్టేషన్ సమీపంలో సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఇందుకు సంబందించి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మహిళా సాధికారత పెంచడం, లింగ సమానత్వ సాధనను ఈ స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ సందర్భంగా పలు పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోటీల వివరాలివీ.. ♦ ఆన్లైన్ స్లోగన్ కాంపిటీషన్: మహిళా సాధికారత, లింగ సమానత్వంపై స్లోగన్లను హెచ్‌టీటీటీపీఎస్://హెచ్ఎంఆర్ఎల్.సిఓ.ఐఎన్‌కు పంపించాల్సి ఉంటుంది. స్లోగన్లు ప్రధానంగా భారతీయ కుటుంబంలో మహిళల కీలక పాత్ర, ఆడపిల్లల చదువు ప్రాముఖ్యత, తల్లి, చెల్లి, భార్య, బామ్మలుగా మహిళలు నిర్వహించే పాత్రలకు సంబంధించినవై ఉండాలి. ♦ ఒక వైపు ఉద్యోగాలు చేస్తూ..మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చాగోష్టి. ♦ చిన్నారులకు పెయింటింగ్, డ్రాయింగ్, వ్యాసరచన, వక్తృత్వ పోటీల నిర్వహణ. ♦ మహిళలకు రంగోలి, కుకింగ్‌లపై పోటీలు. ♦ బెంగాళీ, తమిళ, మళయాలి, గుజరాతి, మరాఠి, రాజస్థానీ, ఈశాన్య భారత రాష్ట్రాల సంప్రదాయలు, కళల ప్రదర్శనలు. తరుణి ఎగ్జిబిషన్ ప్రత్యేకతలివీ.. ♦ ఈ ప్రదర్శన తిలకించేందుకు వచ్చే వారికి ప్రవేశం ఉయితం. ♦ ఈ ప్రదర్శనలో 150 దుకాణాలను ఏర్పాటుచేయనున్నారు. వీటిలో మహిళలు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు లభ్యమౌతాయి. ♦ వెయ్యి ద్విచక్రవాహనాలు, వంద కార్లు పార్కింగ్ చేసుకునే అవకాశం. ♦ చిన్నారుల ఆటా–పాటకు అనుగుణంగా ప్లే ఏరియా, ఇతర గేమ్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ♦ దేశ, విదేశీ వంటకాలను రుచిచూసేందుకు ఫుడ్‌కోర్టులు ఏర్పాటు చేయనున్నారు. ♦ వివిధ సంప్రదాయ, సాంస్కృతిక కళల ప్రదర్శనకు ఏర్పాట్లు. ♦ ఫైర్‌సేఫ్టీ ఏర్పాటు. ♦ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు ♦ మహిళా పారిశ్రామిక వేత్తలను స్టాల్స్ ఏర్పాటుకు ప్రోత్సహించడం. తరుణి ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారా...? ఈ ఎగ్జిబిషన్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలనుకునేవారు హెచ్ఎంఆర్ఎల్ ఎస్టేట్ మేనేజర్ సయ్యద్ అబ్దుల్ మాజిద్ మొబైల్ నం.7702800944, జీఎం రాజేశ్వర్ మొబైల్ నం.8008456866 సంప్రదించాలని హెచ్ఎంఆర్ అధికారులు తెలిపారు. -
మధురానగర్‌లో తరుణి మెట్రో స్టేషన్
సాక్షి, సిటీబ్యూరో: మధురానగర్ మెట్రో స్టేషన్లో మహిళలు, చిన్నారులకు అవసరమైన అన్ని రకాల దుస్తులు, వస్తువులు, సౌకర్యాలను కల్పించడంతోపాటు ఈ స్టేషన్ పేరును మహిళల కోసమే ప్రత్యేకంగా ‘తరుణి మెట్రో స్టేషన్’గా నిర్ణయించినట్లు హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ స్టేషన్‌లోని దుకాణాలను సైతం మహిళలే నిర్వహిస్తారన్నారు. నగర మెట్రో ప్రాజెక్టులో భాగంగా స్మార్ట్ పార్కింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడం, కాలుష్య రహిత ఈ–బైక్స్‌ను వినియోగంలోకి తీసుకురావడం, ముఖ్యమెట్రో స్టేషన్లలో ఎలక్ట్రికల్ వాహనాలకు ఛార్జింగ్ చేసే సదుపాయం కల్పించడం, మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్సుల నిర్మాణం వంటి అంశాలకు నూతన సంవత్సరంలో పెద్దపీఠ వేస్తామన్నారు. బుధవారం హెచ్ఎంఆర్ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. మెట్రో సిబ్బంది కృషివల్లే ఇప్పటివరకు నగర మెట్రో ప్రాజెక్టు 72 జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులను సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంఆర్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదంలో 40 పూరిళ్లు దగ్ధం
కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మధురానగర్‌లో గురువారం జరిగన అగ్నిప్రమాదంలో సుమారు 40 పూరిళ్లు దగ్ధం అయ్యాయి. కాగా అగ్నిప్రమాదం సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కాగా గుర్తు తెలియని దుండగులు కావాలనే తమ ఇళ్లకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాదంలో వస్తువులన్ని కాలి బూడిద అవటంతో బాధితులు రోదించారు. -
రేవ్ పార్టీపై పోలీసులు దాడి: 25 మంది అరెస్ట్
మహబూబ్‌నగర్ జిల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీపై శనివారం అర్థరాత్రి పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. 22 మంది యువకులు, ముగ్గురు యువతులను షాద్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. షాద్‌నగర్ సమీపంలోని ఫరూఖ్‌నగర్ మండలం మధురానగర్‌లోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్‌లో రేవ్ పార్టీ జరుతుందని పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో యువతి, యువకులు మద్యం సేవించి నృత్యాలు చేస్తున్నారు. దాంతో వారిని స్టేషన్‌కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు. అయితే రేవ్ పార్టీలో పట్టుబడిన ముగ్గురు యువతులు ముంబై నగరానికి చెందని వారని పోలీసులు తెలిపారు.