మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న రేవ్ పార్టీపై శనివారం అర్థరాత్రి పోలీసులు అకస్మికంగా దాడి చేశారు. 22 మంది యువకులు, ముగ్గురు యువతులను షాద్నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. షాద్నగర్ సమీపంలోని ఫరూఖ్నగర్ మండలం మధురానగర్లోని ఓ ప్రైవేట్ రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరుతుందని పోలీసులకు సమాచారం అందింది.
దాంతో పోలీసులు దాడి చేశారు. ఆ సమయంలో యువతి, యువకులు మద్యం సేవించి నృత్యాలు చేస్తున్నారు. దాంతో వారిని స్టేషన్కు తరలించి, వారిపై కేసులు నమోదు చేశారు. అయితే రేవ్ పార్టీలో పట్టుబడిన ముగ్గురు యువతులు ముంబై నగరానికి చెందని వారని పోలీసులు తెలిపారు.