madhusudan rao
-
జూన్‌లో దర్శకులు మధుసూదనరావు శత జయంతి ఉత్సవాలు
ప్రముఖ దివంగత దర్శకులు వీరమాచనేని మధుసూదనరావు (జూన్ 14, 1923లో జన్మించారు) శతజయంతి ఉత్సవాలు జూన్ 11న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్లో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన సమావేశంలో దర్శకుడు కోదండ రామిరెడ్డి మాట్లాడుతూ– ‘‘మధుసూదనరావుగారు మన మధ్య లేకపోయినా దర్శకుడిగా ఆయన ప్రతిభ మరికొన్ని వందల ఏళ్లు బతికే ఉంటుంది. ఆయన దగ్గర శిష్యరికం చేయడం నా అదృష్టం’’ అన్నారు. ‘‘నాన్నగారి శత జయంతి ఉత్సవాలకు సినీ పరిశ్రమ నుంచి అందర్నీ ఆహ్వానిస్తున్నాం’’ అన్నారు మధుసూదనరావు కుమార్తె వాణీదేవి. ‘‘ఈ సంవత్సరం నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావుగారు, సూర్యకాంతంగారు, వి. మధుసూదనరావుగారి శత జయంతి కావడం తెలుగు పరిశ్రమ పులకించి పోయే సంవత్సరం. మన మధ్య లేకపోయినా వారు పరిశ్రమకు చూపించిన మంచి మార్గాన్ని ఎప్పటికీ అనుసరిస్తూనే ఉంటాం’’ అన్నారు శివాజీరాజా. ‘‘మావయ్య విలువలతో జీవించారు. అదే విలువలను తన చిత్రాల ద్వారా పది మందికి పంచటానికి ప్రయత్నించారు’’ అన్నారు నాని (మధుసూదనరావు మేనల్లుడు). ఈ కార్యక్రమంలో మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ప్రిన్సిపాల్ డా. జి. కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. -
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - వీరమాచనేని మధుసూదనరావు
-
సీబీఐ ప్రిన్సిపల్ జడ్జిగా మధుసూదన్‌రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ న్యాయస్థానాల్లో ఖాళీలను భర్తీ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఖాళీలను భర్తీ చేసేందుకు బుధవారం సాయంత్రం హైకోర్టు న్యాయమూర్తుల కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. ఏయే న్యాయాధికారులకు ఎక్కడెక్కడ పోస్టింగ్‌లు ఇవ్వాలన్న దానిపై కమిటీ తుది నిర్ణయం తీసుకున్న అరగంటలోపే ఆ వివరాలను హైకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. బదిలీలు, పోస్టింగులపై ఇంత వేగంగా నిర్ణయం తీసుకోవడం.. వాటిని అందరికీ అందుబాటులోకి తీసుకురావడం ఇటీవల కాలంలో ఇదే మొదటిసారి. ఏడుగురు జిల్లా జడ్జీలను వేర్వేరు స్థానాలకు బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇవ్వగా, 25 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతి కల్పించి ఆ మేర పోస్టింగ్‌లు ఇచ్చారు. కమ్యూనల్ అఫెన్సెస్ అదనపు సెషన్స్ జడ్జి కమ్ 7వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, హైదరాబాద్ కమ్ 21వ అదనపు చీఫ్ జడ్జి, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు జడ్జిగా వ్యవహరిస్తున్న బీఆర్ మధుసూదన్‌రావు హైదరాబాద్, సీబీఐ ప్రిన్సిపల్ జడ్జిగా నియమితులయ్యారు. న్యాయవర్గాల్లో ఈయనకు చాలా సౌమ్యుడిగా పేరుంది. సికింద్రాబాద్ జుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న జీవీ సుబ్రహ్మణ్యం మహబూబ్‌నగర్ ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఆ స్థానంలో ఉన్న సీహెచ్‌కే భూపతిని జుడీషియల్ అకాడమీ అదనపు డైరెక్టర్‌గా నియమించింది. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు రెండవ అదనపు చీఫ్ జడ్జి బి.పాపిరెడ్డిని సంగారెడ్డి మొదటి అదనపు జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమించింది. సీబీఐ కోర్టు మూడవ అదనపు స్పెషల్ జడ్జిగా ఉన్న డాక్టర్ టి.శ్రీనివాసరావును హైదరాబాద్ 4వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కమ్ సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్ 18వ అదనపు చీఫ్ జడ్జిగా నియమించింది. ఈ కోర్టు ఎన్ఐఏ హోదా కలిగి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ చట్టం కింద దాఖలయ్యే కేసులను విచారిస్తున్న ఎస్.నాగార్జున హైదరాబాద్, లేబర్‌కోర్టు–1 ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. తెలంగాణ వక్ఫ్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఎస్.గోవర్ధన్‌రెడ్డిని ఏసీబీ ప్రిన్సిపల్ జడ్జిగా నియమించింది. ప్రస్తుతం ఉన్న పోస్టుల నుంచి వీరంతా ఈ నెల 18లోపు రిలీవ్ అయి, 25లోపు కొత్త పోస్టుల్లో చేరాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ వెంకటేశ్వరరెడ్డి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే 25 మంది సీనియర్ సివిల్ జడ్జీలకు జిల్లా జడ్జీలుగా పదోన్నతులు కల్పిస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన ఈ 25 మందికి పలు చోట్ల పోస్టింగ్‌లు ఇచ్చింది. వీరు కూడా ఈ నెల 25లోపు కొత్త బాధ్యతలను చేపట్టాల్సి ఉంటుంది. -
నోట్ల మార్పిడి ముఠా పట్టివేత
► ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ► కొనసాగుతున్న విచారణ గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పాతనోట్లు ఇచ్చి కొత్త నోట్ల మార్పిడి వ్యవహారం బట్టబయలైంది. దందాను సాగిస్తున్న ఓ ముగ్గురిని ఆదివారం రాత్రి గోదావరిఖని స్వతంత్ర చౌక్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ హక్ స్వంతంత్ర చౌక్‌లో బంగారు నగలు తయారు చేసే దుకాణం నిర్వహిస్తున్నాడు. ఎల్బీనగర్కు చెందిన తంగళ్లపల్లి సురేశ్ బంగారం దుకాణాలలో వర్కర్‌గా పని చేస్తున్నాడు. వీరితోపాటు మరో వ్యక్తి రద్దు చేసిన నోట్లను తీసుకుంటూ 30 శాతం కమీషన్‌పై కొత్త రూ.2 వేల నోట్లను ఇవ్వడానికి సిద్ధమయ్యారు. ఈ సమాచారంతో డీసీపీ ఆదేశం మేరకు కమాన్‌పూర్ ఎస్ఐ మధుసూదన్‌రావు రంగంలోకి దిగి నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా వద్దకు చేరుకుని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పాత లక్ష రూపాయలు, కొత్తవి రూ.70 వేలు స్వాధీనం చేస్తున్నారు. గోదావరిఖని వన్‌టౌన్ ఐ ఎ.వెంకటేశ్వర్, సిబ్బంది వెళ్లి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠాలో ఇంకెవరైనా ఉన్నారా ? అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరుుతే రద్దు చేసిన నోట్లకు కొత్త రూ.2 వేల నోట్లకు బదులుగా నకిలీ నోట్లను అంటకట్టేందుకు కూడా ఓ ముఠా ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు వారి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
బలిజపేట మండలం అంతవరం గ్రామశివారు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. మోటారుబైక్పై వెళ్తుండగా వెనక నుంచి వ్యాన్ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు బలిజపేట మండలం కావారివాడ గ్రామానికి చెందిన రావెలపల్లె మధుసూదన్ రావు(29) అనే యువకుడిగా గుర్తించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తింపు లేని పాఠశాలల మూసివేత
ఏలూరు సిటీ : జిల్లాలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తోన్న ప్రైవేట్ పాఠశాలలను మూసివేస్తామని జిల్లా విద్యాధికారి డి.మధుసూదనరావు హెచ్చరించారు. జిల్లాలో విద్యాధికారులు గుర్తించిన విధంగా 10 ప్రైవేట్ పాఠశాలలకు అనుమతులు లేవన్నారు. ప్రభుత్వ అనుమతులు పొందేందుకు రెండు నెలల గడువు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని, ఈ పాఠశాలలపై విద్యా చట్టం మేరకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. గుర్తింపు లేని స్కూల్స్ ఇవే భీమడోలు మండలం పోతునూరులోని శ్రీ విద్యాలయం ఇంగ్లిష్ మీడియం స్కూల్, దెందులూరు మండలం సత్రంపాడులోని అరవింద విద్యా నికేతన్ ఇంగ్లిష్ మీడియం స్కూల్, ఏలూరు రూరల్ సత్రంపాడులోని అరవింద కాన్వెంట్, కృష్ణవేణి స్కూల్, నరసాపురంలోని శ్రీ చైతన్య టెక్నో స్కూల్, పెరవలి వీఎం రంగా పబ్లిక్ స్కూల్, తణుకులోని సాయిజ్యోతి కాన్వెంట్, శ్రీ వెంకటేశ్వర విద్యానికేతన్, ప్రగతి విద్యానికేతన్, తాడేపల్లిగూడెంలోని సెయింట్ థెరిస్సా ఇంగ్లిష్ మీడియం స్కూల్స్‌కు ప్రభుత్వ అనుమతులు లేవు. 15 వరకు పాఠశాలలు తెరిస్తే చర్యలు ఈ నెల 15 వరకు ప్రభుత్వ నిబంధనల మేరకు సెలవులుగా ప్రకటించామని, నిబంధనలు పాటించకుండా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని డీఈవో హెచ్చరించారు. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు తరగతులు నిర్వహిస్తున్నట్లు సమాచారం ఉందని, అలా ఏవైనా ఉంటే వాటిని మూసివేయించాలని మండల విద్యాధికారులను ఆదేశించారు. -
పొన్నూరు అల్లుడు చక్రి!
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి మృతితో పొన్నూరు కంట తడిపెట్టింది. పక్కనే ఉన్న నిడుబ్రోలు గ్రామానికి చెందిన శ్రావణిని చక్రి వివాహమాడినప్పటికీ ఆయనను అంతా పొన్నూరు అల్లుడు అని పిలుస్తుంటారు. శ్రావణి చిన్నతనంలోనే కుటుంబం అంతా భద్రాచలం వెళ్లి స్థిరపడిపోయారు. పొన్నూరు రూరల్: హైదరాబాద్‌లో సోమవారం ఉదయం కన్నుమూసిన ప్రముఖ సినీ సంగీత దర్శకుడు చక్రి పొన్నూరు అల్లుడని స్థానికులు పిలుస్తారు. ఆయన భార్య శ్రావణి సొంతూరైన నిడుబ్రోలు గ్రామం పొన్నూరు పక్కనే ఉండటం, చక్రి తరచూ పొన్నూరు రావటం, మండలంలోని నండూరు గ్రామంలో పలుసార్లు కచేరీలు చేయటమే ఇందుకు కారణం. శ్రావణి, తల్లిదండ్రులు అన్నంరాజు మధుసూదనరావు, సురేఖ తొలుత నిడుబ్రోలులోని నేతాజీనగర్‌లో నివాసం ఉండేవారు. శ్రావణి చిన్నతనంలోనే వారంతా భద్రాచలం వెళ్ళిపోయారు. చక్రి మరణవార్త విన్న శ్రావణి నాయనమ్మ రాధాంబ హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. ఇంత హడావుడిలోనూ దుఖాన్ని దిగమింగుకుంటూ ఆమె సాక్షితో మాట్లాడారు. ‘పెద్దలంటే చక్రికి ఎంతో గౌరవం. అయన లేరని నేను భావించడం లేదు. చక్రి ప్రతి పాటలోనూ వేణువై అందరి నోళ్లలో నర్తిస్తూనే ఉంటారు’ అని అంటూ కన్నీరు మున్నీరయ్యూరు. గుప్తదానాలు చేసేవారు.. ‘అల్లుడూ అని నేను పిలిస్తే మామగారూ అంటూ అప్యాయంగా స్పందించే చక్రి గొంతు మరోసారి వినలేనా?’ అని సినీ మాటల రచయిత కృష్ణేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు నేతాజీనగర్‌లో ఉన్న ఆయన చక్రి మరణవార్త విన్న వెంటనే హైదరాబాద్ బయలుదేరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘గోపి గోపిక గోదావరి’ చిత్రం నుంచి చక్రితో పరిచయం ఏర్పడిందని చెప్పారు. స్నేహానికి మారుపేరైన చక్రి ఎందరికో గుప్తదానాలు చేశారని వెల్లడించారు. అనేకమంది సంగీత కళాకారులకు సినిమా రంగంలో స్థానం కల్పించిన వ్యక్తి అని కొనియాడారు. కొత్త రచయితలను పరిచయం చేయడమే కాకుండా వారు ఉండేందుకు సౌకర్యం కల్పించేవారని చెప్పారు. -
ఐదుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్
అనంతపురం ఎడ్యుకేషన్/బత్తలపల్లి, న్యూస్‌లైన్ : పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుల్లో కొందరు క్రమశిక్షణ తప్పుతున్నారు. పాఠశాలలకు ఇష్టారాజ్యంగా వెళుతున్నారు. స్వయాన డీఈఓ మధుసూదన్ రావు ఆకస్మిక తనిఖీలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఆయన ఐదుగురిని సస్పెండ్ చేశారు. డీఈఓ సోమవారం ఉదయం బత్తలపల్లి మండలం సంజీవపురం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలను తనిఖీ చేశారు. ఆయన సరిగ్గా ఉదయం 8.55 గంటలకు పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికి ఒక్క ఉపాధ్యాయుడూ రాలేదు. నిబంధనల మేరకు 8.45 గంటలకే రావాలి. డీఈఓ తొమ్మిది వరకు ఎదురు చూసినా ఒక్కరూ రాలేదు. చేసేదిలేక ఆయనే పిల్లలతో ప్రార్థన చేయించారు. 9.20 గంటలకు ఒకరు, 9.26కు మరొకరు, 9.40కి ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు చేరుకున్నారు. ఈ పాఠశాలలో మొత్తం 40 మంది విద్యార్థులున్నారు. ఖాసీం, నాగిరెడ్డి, మారుతీప్రసాద్, పావనరేఖ అనే నలుగురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా ఆ నలుగురినీ సస్పెండ్ చేశారు. అనంతరం డీఈఓ పక్కనే ఉన్న ఈదుల ముష్టూరు ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. హెచ్ఎం వెంకటయ్య ఆలస్యంగా ఉదయం 10.30కి రావడంతో ఆయ న్నూ సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ ప్రకటించారు. సంజీవపురం గ్రామం అనంతపురం-ధర్మవరం ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఈ ఊరికి ప్రతి ఐదు నిమిషాలకో బస్సు ఉంది. ఇలాంటి పాఠశాలకే ఉపాధ్యాయులు సమయానికి వెళ్లడం లేదు. దీన్నిబట్టి రవాణా సౌకర్యాలు అంతగా లేని పాఠశాలలకు ఏమాత్రం వెళ్తుంటారో అర్థం చేసుకోవచ్చు. డీఈఓ ఇదే తరహాలో ఆకస్మిక తనిఖీలు కొనసాగిస్తే చాలామంది ఉపాధ్యాయులపై స స్పెన్షన్ వేటు పడే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు చెబు తున్నారు.