Madrid Masters tennis tournament
-
నాదల్‌పై అల్కరాజ్ సంచలన విజయం
మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీ క్వార్టర్ ఫైనల్లో దిగ్గజ ఆటగాడు రాఫెల్ నాదల్ (స్పెయిన్)కు అనూహ్య పరాజయం ఎదురైంది. తన దేశానికే చెందిన, ‘భవిష్యత్ నాదల్’గా ఇప్పటికే గుర్తింపు తెచ్చుకున్న కార్లోస్ అల్కరాజ్ 6–2, 1–6, 6–3తో ఐదు సార్లు చాంపియన్ నాదల్‌ను ఓడించాడు. సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక పోరులో 2 గంటల 28 నిమిషాల పాటు ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. గురువారమే తన 19వ పుట్టిన రోజు జరుపుకున్న అల్కరాజ్... తన ఆరాధ్య ఆటగాడు నాదల్‌ను, అదీ అతడికి కోటలాంటి ‘క్లే కోర్టు’పై ఓడించడం విశేషం. గత ఏడాది ఇదే టోర్నీ రెండో రౌండ్లో నాదల్ చేతిలో పరాజయంపాలైన అల్కరాజ్ ఇప్పుడు అదే వేదికపై బదులు తీర్చుకున్నాడు. ఫలితంతో తానేమీ బాధపడటం లేదని... ఫ్రెంచ్ ఓపెన్‌కు మరో రెండున్నర వారాల సమయం ఉంది కాబట్టి తన ప్రణాళికలతో సిద్ధమవుతానని నాదల్ వ్యాఖ్యానించగా...తన కెరీర్లో ఇది అత్యుత్తమ క్షణంగా అల్కరాజ్ పేర్కొన్నాడు. చదవండి: Asian Games 2022: చైనాలో కరోనా తీవ్రత.. ఆసియా క్రీడలు వాయిదా! -
క్వార్టర్ ఫైనల్లోకి దూసుకు వెళ్లిన నాదల్
మాడ్రిడ్: ఐదుసార్లు చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) మాడ్రిడ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్–1000 టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. క్వాలిఫయర్ డేవిడ్ గాఫిన్ (బెల్జియం)తో గురువారం జరిగిన మూడో రౌండ్లో నాదల్ 3 గంటల 9 నిమిషాల్లో 6–3, 5–7, 7–6 (11/9)తో గెలిచాడు. నిర్ణాయక మూడో సెట్ టైబ్రేక్‌లో నాదల్ నాలుగు మ్యాచ్ పాయింట్లను కాపాడుకోవడం గమనార్హం. చదవండి: Deaflympics: డెఫ్లింపిక్స్లో గోల్డ్‌మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్ -
ముర్రేకు షాక్
మాడ్రిడ్ మాస్టర్స్ టెన్నిస్ టోర్నీ మాడ్రిడ్: స్పెయిన్‌లో జరుగుతున్న మాడ్రిడ్ మాస్టర్స్ టోర్నీలో ప్రపంచ నం.1 టెన్నిస్ ప్లేయర్ ఆండీ ముర్రే (బ్రిటన్)కు చుక్కెదురైంది. భారత కాలమానం ప్రకారం గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడోరౌండ్లో ముర్రే 3–6, 3–6తో ప్రపంచ 59వ ర్యాంకర్, బోర్నా కోరిక్ (క్రొయేషియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. గంటన్నరపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఓసారి బ్రేక్ చేసిన ముర్రే.. తన సర్వీస్‌ను నాలుగుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. మరోవైపు ప్రపంచ మాజీ నం.1 నోవాక్ జకోవిచ్, రఫెల్ నాదల్ ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో రెండోసీడ్ జకోవిచ్ 6–4, 7–5తో ఫెలిసియానో లోపెజ్ (స్పెయిన్)పై, నాలుగో సీడ్ నాదల్ 6–3, 6–1తో నికీ కిర్గియోస్ (ఆస్ట్రియా)పై అలవోక విజయం సాధించారు.