madusudanachari
-
అభివృద్ధిని చూసి ఓటు వేయండి
సాక్షి,చిట్యాల(భూపాలపల్లి): భూపాలపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటువేసి గెలిపించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండలంలోని జడల్పేట, నైన్పాక, భావుసింగ్‌పల్లి, కొత్తపేట, ఒడితల గ్రామాలలో పర్యటించిన స్పీకర్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వృత్తిదారుల వద్దకు వెళ్లి వారితో కలిసి పనిచేస్తూ ఓట్లు అభ్యర్థించారు. వివిధ పార్టీల నుంచి చేరిన నాయకులు, కార్యకర్తలకు టీఆర్ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిట్యాల ఏరియాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా 500 ఎకరాల పేదల భూమిని కబ్జా చేసుకుని ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ వస్తున్న భూబకాసురులను తరిమికొట్టాలని ప్రజలను కోరారు. నాపాక ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించిందని, రూ.5 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డబుల్ రోడ్లు, సీసీ రోడ్లు, తాగు, సాగు నీటి సౌకర్యం కల్పించానని, మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ కుంభం రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ కాట్రేవుల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లయ్య, నాయకులు భగవాన్‌రెడ్డి, యుగంధర్, గణపతి, సమ్మిరెడ్డి, శంకర్, రవీందర్రావు, శ్రీనివాసరావు, రాయమల్లు, మల్లక్క, పుష్పలత, రమేష్; సమ్మయ్య, భీంరావు, రవీందర్, నాగలత, ఓంప్రకాశ్, బాబారాజు, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారాల్లోనే చూడాలి..
సాక్షి, వరంగల్: ఎన్నికల ప్రచారాల్లోనే చూడాలి మన రాజకీయ నాయకుల వేశాలు, చూసిన తెలియును వారి అందాలు. ప్రస్తుతం ఏ రాజకీయ నేతలను చూసిన వింత వింత వేశాలు వేసి ప్రచారాల్లో బిజీగా ఉన్నారు. అలాంటి కొంత మంది నాయకులు,వారి అభిమానులు కింద ... అభిమానం మాస్కుల రూపంలో... తొర్రూరు మండలం టీక్యాతండాలో ప్రచారానికి వచ్చిన టీఆర్ఎస్ పాలకుర్తి అభ్యర్థి ఎర్రబెల్లి కోసం పాఠశాల వదిలిన తర్వాత తల్లిదండ్రులతో కలిసి మాస్కులతో వచ్చిన చిన్నారులు బోనమెత్తిన సీతక్క ఓటాయి గ్రామానికి వచ్చిన సీతక్కకు మహిళలు బోనాలు, బతుకమ్మలతో స్వాగతం పలికారు. సీతక్క వారితో బోనమెత్తుకుని నడిచారు ఎన్ని‘కల’ కోలాటం ఏనుమాముల 12వ డివిజన్ పరిధిలోని చాకలి ఐలమ్మనగర్లో మహిళలతో కలిసి కోలాటం వేస్తున్న మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ రూపురేఖలు మారుస్తా... చిట్యాల మండలం నైన్‌పాకలో కుమ్మరి సారె తిప్పుతున్నటీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి మధుసూదనాచారి -
ఎన్నికల కోలాటం..
సాక్షి, వరంగల్: రేగొండ మండలంలో ప్రచారంలో భాగంగా కోలాటం ఆడుతున్న టీఆర్ఎస్ భూపాలపల్లి అభ్యర్థి సిరికొండ మధుసూదనాచారి -
అధ్యయనం తర్వాతే నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వం రద్దుకు సంబంధించిన విషయంలో తన పరిధిలో ఏం చేయగలనో చూస్తున్నానని స్పీకర్ మధుసూదనాచారి పేర్కొన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని కాంగ్రెస్ నేతలకు హామీ ఇచ్చారు. సోమవారం కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత జానారెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం స్పీకర్‌ను ఆయన చాంబర్లో కలిసి.. కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలను రాజ్యాంగ విరుద్ధంగా సస్పెండ్ చేశారని, ఈ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం లేదని, స్పీకర్‌గా ఉన్న విశేషాధికారాలను ఉపయోగించి కోమటిరెడ్డి, సంపత్‌ల శాసనసభ్యత్వాలను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేస్తూ.. వినతిపత్రం అందజేసింది. దాదాపు అరగంటకుపైగా జరిగిన ఈ భేటీలో స్పీకర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల వాదనలు విన్నారు. ఈ అంశంలో ఏం చేయాలన్న దానిపై అధ్యయనం చేసి, నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. న్యాయం చేస్తారనే నమ్మకముంది: జానా కాంగ్రెస్ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. ఏదో ఘటనను సాకుగా చూపి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బహిష్కరించడం, మిగతా సభ్యులందరినీ సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని జానారెడ్డి స్పీకర్‌తో పేర్కొన్నారు. ఈ విషయంలో న్యాయం చేస్తారనే నమ్మకంతో వచ్చామని, బహిష్కరించిన సభ్యులకు న్యాయం చేసి సభ ప్రతిష్టను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఇలాంటి అంశాల్లో గతంలో వచ్చిన తీర్పులను కూడా స్పీకర్‌కు వివరించారు. ఇక శాసనమండలి ప్రతిపక్ష నేత షబ్బీర్‌అలీ కూడా తన వాదన వినిపించారు. ఎలాంటి తప్పూ చేయకున్నా, తమ స్థానాల్లోనే ఉన్నా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను కూడా సస్పెండ్ చేశారని... పంచాయతీరాజ్ చట్టంపై కనీస చర్చ జరగకుండా ఆమోదింపజేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను పునరుద్ధరించాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క కూడా స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. స్పీకర్‌ను కలసిన వారిలో సభ్యత్వం రద్దయిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్‌లతో పాటు సీఎల్పీ ఉపనేతలు టి.జీవన్‌రెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, పద్మావతి, రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, ఎంపీ ఎంఏ ఖాన్, మాజీ మంత్రులు దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, మాజీ ఎంపీలు అంజన్‌కుమార్ యాదవ్, రవీంద్రనాయక్ తదితరులు ఉన్నారు. దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తాం..: జానా స్పీకర్ మధుసూదనాచారితో సమావేశమైన తర్వాత కాంగ్రెస్ నేతలు విలేకరులతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యేల అనర్హత విషయంలో కోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేసి సభకు హుందాతనం తీసుకురావాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని జానారెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వమైనా స్పందించి ప్రతిష్టను కాపాడుకోవాలని సూచించారు. మధ్యవర్తిగా స్పీకర్ ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. లేదంటే ఈ విషయాన్ని దేశ ప్రజల దృష్టికి తీసుకెళ్తామని వ్యాఖ్యానించారు. తనకున్న పరిధులు, సందర్భాన్ని బట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామన్న రీతిలో స్పీకర్ హామీ ఇచ్చారని ఉత్తమ్ చెప్పారు. స్పీకర్ నిర్ణయం కోసం వారం రోజులు వేచి చూస్తామన్నారు. అప్పటికీ నిర్ణయం వెలువడకుంటే తెలంగాణలో శాసనసభను, సమాజాన్ని ఏ విధంగా అవమానపరుస్తున్నారనే విషయాన్ని రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేస్తామని.. జాతీయ మీడియా దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
తెలంగాణ అసెంబ్లీ వెబ్సైట్ ల ఆవిష్కరణ
హైదరాబాద్: తెలంగాణా శాసనసభ కార్యకలాపాలకు సంబంధించి రూపొందించిన తెలుగు, ఉర్దూ వెబ్సైట్ ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్ నెంబర్ ఒకటిలో జరిగింది. రెండు వెబ్సైట్ లతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాల, సభ్యుల పోట్రల్ను కూడా స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి హరీష్ రావు , డిప్యూటీ స్పీకర్ పద్మ దేవేందర్ రెడ్డి , శాసనసభ సచివాలయం కార్యదర్శి రాజసదారాం .జాయింట్ సెక్రటరీ నరసింహాచార్యులు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.