
సాక్షి,చిట్యాల(భూపాలపల్లి): భూపాలపల్లి నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటువేసి గెలిపించాలని స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండలంలోని జడల్‌పేట, నైన్‌పాక, భావుసింగ్‌పల్లి, కొత్తపేట, ఒడితల గ్రామాలలో పర్యటించిన స్పీకర్‌కు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వృత్తిదారుల వద్దకు వెళ్లి వారితో కలిసి పనిచేస్తూ ఓట్లు అభ్యర్థించారు. వివిధ పార్టీల నుంచి చేరిన నాయకులు, కార్యకర్తలకు టీఆర్‌ఎస్ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చిట్యాల ఏరియాలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా 500 ఎకరాల పేదల భూమిని కబ్జా చేసుకుని ఓట్ల కోసం మాయమాటలు చెబుతూ వస్తున్న భూబకాసురులను తరిమికొట్టాలని ప్రజలను కోరారు.
నాపాక ఆలయానికి ప్రపంచ పటంలో స్థానం లభించిందని, రూ.5 కోట్లతో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. డబుల్ రోడ్లు, సీసీ రోడ్లు, తాగు, సాగు నీటి సౌకర్యం కల్పించానని, మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో పరకాల మార్కెట్ కమిటీ చైర్మన్ కుంభం రవీందర్‌రెడ్డి, జెడ్పీటీసీ కాట్రేవుల సాయిలు, పీఏసీఎస్ చైర్మన్ కర్రె అశోక్‌రెడ్డి, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఆరెపల్లి మల్లయ్య, నాయకులు భగవాన్‌రెడ్డి, యుగంధర్, గణపతి, సమ్మిరెడ్డి, శంకర్, రవీందర్‌రావు, శ్రీనివాసరావు, రాయమల్లు, మల్లక్క, పుష్పలత, రమేష్; సమ్మయ్య, భీంరావు, రవీందర్, నాగలత, ఓంప్రకాశ్, బాబారాజు, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment