అండమాన్ నికోబార్‌లో భూకంపం
పోర్ట్‌బ్లెయిర్ : అండమాన్ నికోబార్ దీవుల్లో మంగళవారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.3గా నమోదు అయింది. అండమాన్‌లోని మోహిన్‌కు 126 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. కాగా ఎక్కడ ఏలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం రాలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ మధ్యలో కూడా ఇదే ప్రాంతంలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్‌పై 4.6గా నమోదు అయిన సంగతి తెలిసిందే.