maha agreement
-
అసెంబ్లీ అయినా.. గోల్కొండ కోటైనా రెడీ
-
'అసెంబ్లీ అయినా.. గోల్కొండ కోటైనా రెడీ'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలను జైలులో పెడతామంటూ ఒక ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడటం సరికాదని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని.. అవసరం అయితే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు. ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోందని చెప్పారు. 2019 తర్వాత వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలోనైనా, గోల్కొండ కోటలోనైనా తాము చర్చకు సిద్ధం అని వారు సవాల్ విసిరారు. -
కేసీఆర్కు అసదుద్దీన్ ప్రశంసలు
హైదరాబాద్: గోదావరి నదిపై ప్రాజెక్టులు నిర్మించేందుకు మహారాష్ట్రతో ఒప్పందం చేసుకొని వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్కు అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు తెలియజేశారు. ఈ మూడు ప్రాజెక్టులు 2019నాటికి పూర్తవుతాయని తాను ఆశిస్తున్నట్లు ఆయన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అదే సమయంలో గోదావరి నది నీళ్లు ఉపయోగించుకునేందుకు రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలేవీ ఇప్పటి వరకు జరగలేదని కాంగ్రెస్ పార్టీ నేత జానారెడ్డి చెప్పింది సత్యం అని అన్నారు. అలాగే, ప్రతీది రాజకీయం చేయడం తగదని, తెలంగాణకు నీటి పారుదల, అభివృద్ధి అనేది చాలా ముఖ్యమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సూచించారు.