'అసెంబ్లీ అయినా.. గోల్కొండ కోటైనా రెడీ' | ts congress leaders takes on cm kcr | Sakshi
Sakshi News home page

'అసెంబ్లీ అయినా.. గోల్కొండ కోటైనా రెడీ'

Published Sat, Aug 27 2016 1:13 PM | Last Updated on Tue, Aug 14 2018 10:59 AM

ts congress leaders takes on cm kcr

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలను జైలులో పెడతామంటూ ఒక ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడటం సరికాదని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు.

ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని.. అవసరం అయితే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు. ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోందని చెప్పారు. 2019 తర్వాత వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలోనైనా, గోల్కొండ కోటలోనైనా తాము చర్చకు సిద్ధం అని వారు సవాల్ విసిరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement