ts congress
-
సీఎం ఎవరనేది పార్టీ నిర్ణయిస్తుంది: భట్టి విక్రమార్క
-
రూటు మార్చిన తెలంగాణ కాంగ్రెస్.. పార్టీలోకి కీలక నేతలు
-
జగ్గారెడ్డిని ఈడ్చుకెళ్తున్న పోలీసులు
-
కాంగ్రెస్ పార్టీ రాజ్ భవన్ ముట్టడిలో ఉద్రిక్తత
-
పువ్వాడ అజయ్ పై రేణుక చౌదరి దారుణ వ్యాఖ్యలు
-
ఖైరతాబాద్ లో కాంగ్రెస్ భారీ నిరసన
-
రాహుల్ ఈడీ విచారణ నేపథ్యంలో కాంగ్రెస్ ఆందోళన
-
సర్వే ఉంది.. తెలంగాణలో గెలిచే పార్టీ ఏదంటే..??
-
టీఆర్ఎస్, బీజేపీ నేతలను కూడా పిలుస్తా.. రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
-
తెలంగాణలో టీఆర్ఎస్ కు 16 సీట్లు గెలిచే సత్తా ఉందా: ఎమ్మెల్యే జగ్గా రెడ్డి
-
అగమ్యగోచరంగా తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి
-
మళ్ళీ కాంగ్రెస్ గూటికి డి. శ్రీనివాస్
-
ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ సైడ్... ?
-
రాజీనామా చేస్తా.. జగ్గారెడ్డి సంచలన ప్రకటన
-
14న ‘సాగర్’కు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఈ నెల 14న హాలియా పట్టణ శివారులో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. 14న సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హాజరుకానున్నారు. సభ నిర్వహణకు సంబంధించి హాలియా శివారులోని పెద్దవూర మార్గంలో 20 ఎకరాల ఖాళీ స్థలాన్ని గుర్తించి పార్టీ నేతలు అనుమతులు కూడా పొందారు. నాగార్జునసాగర్ నియోజకవర్గం నలుమూలల నుంచి జనసమీకరణ చేస్తున్న నేపథ్యంలో 30 ఎకరాలను పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించారు. బహిరంగ సభ కోసం ఎంపిక చేసిన స్థలాన్ని సీఎం సెక్యూరిటీ విభాగం అధికారులు కూడా సందర్శించి ఆమోదం తెలిపారు. సభ నిర్వహణకు మరో 7 రోజులే వ్యవధి ఉండటంతో జన సమీకరణ బాధ్యతను సాగర్ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల ఇన్చార్జీ లుగా వ్యవహరిస్తున్న పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు అప్పగించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో సభ సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్‌షోల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. అయితే ఎన్నికల వ్యయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని రోడ్‌షోలు రద్దు చేసుకోవాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితి రూ.28 లక్షలు కాగా.. బహిరంగ సభ నిర్వహణకు ఎక్కువ మొత్తంలో ఖర్చువుతున్నట్లు తెలిసింది. ఇన్‌చార్జీలకే ప్రచార, సమన్వయ బాధ్యతలు సాగర్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతలను కొత్త బృందానికి అప్పగించిన కేసీఆర్ వివిధ వర్గాల నుంచి విభిన్న కోణాల్లో ప్రతిరోజూ అందుతున్న నివేదికలను విశ్లేషిస్తూ దిశానిర్దేశం చేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తమ పార్టీ ప్రచార వ్యూహాన్ని రోజువారీగా మారుస్తున్నట్లు ప్రచారంలో సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్న టీఆర్ఎస్ నేత ఒకరు వెల్లడించారు. ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, రవీంద్రకుమార్, కోరుకంటి చందర్, భూపాల్‌రెడ్డి, కోనేరు కోణప్ప, శంకర్‌నాయక్, భాస్కర్‌రావుతో పాటు కరీంనగర్ మేయర్ సునీల్‌రావు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు వంటి నేతలకు సాగర్ నియోజకవర్గం పరిధిలోని మున్సిపాలిటీలు, మండలాల వారీగా పూర్తి స్థాయిలో ప్రచార బాధ్యతలు అప్పగించడం ద్వారా కేసీఆర్ కొత్త తరహా వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. గతంలో వివిధ ఉప ఎన్నికలు, కీలక ఎన్నికల్లో పనిచేసిన సీనియర్లకు బదులుగా కొత్త బృందానికి ప్రచార, సమన్వయ బాధ్యతలు అప్పగించడం కూడా వ్యూహాత్మకమేనని టీఆర్ఎస్ శ్రేణులు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని సామాజికవర్గాల వారీగా ఓటర్ల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని పార్టీ ఇన్చార్జీల ఎంపిక జరిగినట్లు కనిపిస్తోంది. కాగా, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్రావు పార్టీ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తున్నారు. మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా మైనార్టీలు, సామాజిక వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్.. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీతో తలపడిన టీఆర్ఎస్ సాగర్ ఉప ఎన్ని కలో కాంగ్రెస్‌ను ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ విధానాలు, ఆ పార్టీ అభ్యర్థి జానారెడ్డి పనితీరే లక్ష్యంగా ప్రచారం సాగిస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వ పనితీరు, ధరల పెరుగుదల, రాష్ట్రానికి నిధులు, పథకాల అమల్లో వివక్ష తదితరాలపై విమర్శలు గుప్పిస్తున్నా క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ బలంపైనే దృష్టి కేంద్రీకరించింది. గ్రామ స్థాయిలో ఓ మోస్తరు గుర్తింపు పొందిన కాంగ్రెస్ నేతలు, ముఖ్య కార్యకర్తలను పార్టీలో చేర్చుకుంటూ ఆ మేరకు ప్రత్యర్థిని బలహీన పరిచే ఎత్తుగడను అనుసరిస్తోంది.మరోవైపు మండలాలు, గ్రామాల వారీగా వివిధ సామాజిక వర్గాల ఓటర్ల వివరాలు, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి వారిని ప్రత్యక్షంగా కలసి టీఆర్ఎస్ యంత్రాంగం ఓట్లను అభ్యర్థిస్తోంది. ప్రచారంలో పైచేయి సాధించి పోలింగ్ నాటికి విపక్ష శిబిరంలో ఆత్మవిశ్వాసం దెబ్బతీయడం ద్వారా భారీ మెజారిటీ సాధించేందుకు టీఆర్ఎస్ సర్వశక్తులూ ఒడ్డుతోంది. చదవండి: సాగర్ ఉప ఎన్నికపై ప్రత్యేక నిఘా -
హాట్‌హాట్‌గా ఓటు వేట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు ప్రతిష్టాత్మకంగా మారిన నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం వేడెక్కుతోంది. ఓవైపు మండుటెండలు అదరగొడుతున్నా రాజకీయ పార్టీలు ప్రచారంలో భాగంగా నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నాయి. గెలుపే ధ్యేయంగా తెల్లారిన దగ్గరి నుంచి చీకటి పడేంతవరకు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ప్రచారపర్వంలో అధికార టీఆర్ఎస్ ఒకింత ముందంజలో ఉండగా, కాంగ్రెస్, బీజేపీలు కూడా శక్తిమేరకు ప్రయత్నం చేస్తున్నాయి. సాగర్‌లో పార్టీ అభ్యర్థి నోముల భగత్ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్న రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి తన టీంతో కలిసి విస్తృతంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డి, ఆయన తనయులకు తోడు రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం కూడా జట్టుగా గ్రామాల్లోకి వెళ్లి ప్రచారంలో ఎక్కడా వెనుకబడకుండా చూసుకుంటుండగా, బీజేపీ అభ్యర్థి రవినాయక్ స్థానిక నేతలతో కలిసి వినూత్నంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కోసం రాష్ట్ర మంత్రి కేటీఆర్ రెండ్రోజుల రోడ్‌షోకు ఏర్పాట్లు చేసుకుంటుండగా, సీఎం కేసీఆర్‌తో మరోమారు బహిరంగ సభ కూడా నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా జనగర్జన తరహాలోనే మరోమారు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈనెల 10 తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా సాగర్‌కు వెళ్లేందుకు సన్నద్దమవుతున్నారు. దీంతో మరో పది రోజులు గడువు ఉన్నా... ఎన్నికల ప్రచారం మరింత హీటెక్కనుంది. 14న నిడమనూరులో సీఎం సభ! నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ విజయం కోసం ఆ పార్టీ శ్రేణులు కాళ్లకు బలపాలు కట్టుకొని తిరుగుతున్నాయి. జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి.. భగత్ గెలుపు బాధ్యతలను తీసుకొని గ్రామాలను కలియ తిరుగుతున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్ కూడా నియోజకవర్గంలోనే మకాం వేసి ప్రతి రోజు గ్రామాలకు వెళ్లి కేసీఆర్ పాలనను మరోసారి ఆశీర్వదించాలని కోరుతున్నారు. ఇప్పటికే మండలాల వారీగా ఇన్ఛార్జిలుగా నియమితులైన బయటి జిల్లాల ఎమ్మెల్యేలు తమకు అప్పగించిన టీంలతో సమన్వయం చేసుకుంటూ ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఒకటీ రెండు రోజుల్లో ఐటీ మంత్రి కేటీఆర్ కూడా నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహిస్తారనే ప్రచారం సాగర్ గులాబీ దండును ఉరకలు పెట్టిస్తోంది. దీంతోపాటు ముఖ్యమంతి కేసీఆర్ మరోమారు నియోజకవర్గంలో బహిరంగసభకు హాజరవుతారని, ఈ నెల 14న ఆయన నిడమనూరులో జరిగే సభలో పాల్గొంటారని తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ఎండలను సైతం ఖాతరు చేయని, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు భగత్ విజయం కోసం పట్టు వదలకుండా పని చేస్తున్నారు. టార్గెట్ జానా జానారెడ్డినే టార్గెట్ చేసి టీఆర్ఎస్ తమ ప్రచారం నిర్వహిస్తోంది. ఆయన ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, తెలంగాణ వచ్చాకే సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీళ్లు ఇవ్వగలిగామని చెబుతోంది. జానారెడ్డి అనేక శాఖలకు మంత్రిగా పని చేసినా నియోజకవవర్గ ప్రజలను ఉద్దరించిందేమీ లేదని, కాంగ్రెస్‌కు ఓటేస్తే ఉపయోగం లేదంటూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు గులాబీ నేతలు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. టీఆర్ఎస్కు దీటుగా ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జానారెడ్డి వ్యక్తిగత చరిష్మాపైనే ఆధారపడి ఉప ఎన్నికను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారంలో టీఆర్ఎస్కు తీసిపోకుండా దూసుకెళ్తోంది. జానారెడ్డితో పాటు ఆయన తనయులు రఘువీర్, జయవీర్‌లు విస్తృతంగా గ్రామాల్లో పర్యటిస్తున్నారు. ఆదివారం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జెట్టి కుసుమకుమార్ తదితరులు నియోజకవర్గంలోనే ఉండి ఓటర్లను కలుస్తున్నారు. జానారెడ్డి అభివృద్ధి చేయలేదన్న టీఆర్ఎస్ విమర్శలను తిప్పికొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. జానారెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నపుడే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందని, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఒరిగిందేమీలేదని ఓటర్లకు చెప్పి ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే మండలాల వారీగా మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఇన్ఛార్జీలుగా నియమించిన కాంగ్రెస్ పార్టీ మరోసారి బహిరంగ సభను నిర్వహించే యోచనలో ఉంది. అయితే సీఎం కేసీఆర్ సభ ఎప్పుడు నిర్వహిస్తారన్న దానిని బట్టి కాంగ్రెస్ సభ నిర్వహించాలా? వద్దా..? అన్న దానిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఎంపీలు కోమటిరెడి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డిలు కూడా జానా ప్రచారానికి తోడు కానున్నారు. పార్టీకి చెందిన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, మాజీ నాయకులు సాగర్‌లోనే ఉండి జానా గెలుపు బాధ్యతలను భుజానవేసుకున్నారు. సర్దిచెప్పుకొని సమన్వయంతో ముందుకెళ్తున్న బీజేపీ నియోజకవర్గంలో గతంలో పోటీ చేసిన అభ్యర్థిని కాదని కొత్త వ్యక్తి డాక్టర్ రవి నాయక్‌కు టికెట్ ఇవ్వడంపై మొదట్లో కొంత అసంతృప్తి వ్యక్తమైనా క్షేత్ర స్థాయి నాయకత్వానికి సర్ది చెప్పుకోవడంలో బీజేపీ సఫలీకృతమైంది. ప్రస్తుతానికి స్థానిక నేతలలో కలిసి రవికుమార్ టీఆర్ఎస్, కాంగ్రెస్‌ల పార్టీలకు పోటీ ఇచ్చేలా ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్‌రెడ్డి, టికెట్ ఆశించిన నివేదితా రెడ్డి కూడా తాజాగా ప్రచారంలో కలిసి వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తన స్వగ్రామం పలుగుతండాకు వెళ్లిన సందర్భంగా విలపించి వార్తల్లోకెక్కిన రవికుమార్ ఆ తరువాతి రోజున రూటు మార్చి డాన్స్‌లు చేసి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే పార్టీలోని రాష్ట్ర స్థాయి, ద్వితీయ శ్రేణి నేతలను సాగర్‌లో ప్రచారానికి పంపించిన బీజేపీ ముఖ్యనేతలను రంగంలోకి దింపేందుకు చర్యలు చేపట్టింది. రవికుమార్ ఎన్నికల ప్రచారానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, నిజమాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తదితరులు తరలిరానున్నారు. ఈ మేరకు పార్టీ నాయకత్వం ప్రచార షెడ్యూలు ఖరారు చేస్తోంది. ఈనెల 10వ తేదీ తరువాత బండి సంజయ్ సాగర్‌లో మకాం ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వారితోపాటు ఒకరిద్దరు కేంద్ర మంత్రులు, జాతీయ నేతలను కూడా సాగర్‌కు తీసుకురావాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. మరో 38 మంది కూడా బరిలో ఉన్నా ప్రధాన పోటీ ఈ మూడు పార్టీల మధ్యే నెలకొంది. చదవండి:6 ఎమ్మెల్సీలు ఖాళీ.. కడియంకు మళ్లీ ఛాన్స్ ఉండేనా? -
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతికి చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కొత్త ఒరవడితో ముందుకెళ్లనుందా..? టీపీసీసీ అధ్యక్ష పదవి చుట్టూ తిరుగుతున్న వ్యవహారాన్ని తనదైన శైలిలో అధిష్టానం చేతిలోకి తెచ్చుకోనుందా..? తెలంగాణలోని నాయకులందరికీ సముచిత ప్రాధాన్యం ఇస్తూ పార్టీలో ఎలాంటి అసమ్మతి తలెత్తకుండా గుజరాత్ తరహా ప్రయోగానికి సిద్ధమవుతోందా..? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. గత కొన్ని రోజులుగా టీపీసీసీ అధ్యక్ష పదవిపై కొనసాగుతున్న సస్పెన్స్‌కు కొత్త ట్విస్ట్ ఇచ్చి తెరదింపే దిశలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా టీపీసీసీ అధ్యక్షుడితో పాటు ఆరు కమిటీలను కొత్త ఏడాదిలో ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. కొత్తగా అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఆధ్వర్యంలోనే ఇతర కమిటీలు పనిచేసేలా దిశానిర్దేశం చేయనుందనే చర్చ ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పదవులపై కొత్త సంవత్సరంలో స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పార్టీలో సీనియర్లు ఎవరికి వారు టీపీసీసీ అధ్యక్షుని ఎంపికపై విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి అమ్ముడుపోయారనే ఆరోపణలు చేస్తున్నారు. బలహీనవర్గాలకు అధ్యక్ష పదవి ఇవ్వాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి అయితే తన పేరు జాబితాలో చేర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పకడ్బందీ వ్యూహంతో ముందుకు.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా రెండు దఫాలు రాష్ట్ర ప్రజల మన్ననలు పొందలేక పోయిన కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికలను జీవన్మరణ సమస్యగా భావిస్తోంది. ఆ ఎన్నికల్లో వచ్చే ఫలితాల ఆధారంగానే పార్టీకి తెలంగాణలో మనుగడ ఉంటుందనే ఆలోచనలో ఉన్న ఢిల్లీ పెద్దలు.. పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే 162 మంది నాయకుల అభిప్రాయాన్ని అధిష్టానం సేకరించింది. అయితే ఇందులో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, ఫలానా నాయకుడికే పీసీసీ పగ్గాలు ఇవ్వాలనే వాదనలు పెరుగుతుండడంతో పార్టీకి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయాలవైపు హైకమాండ్ దృష్టి పెట్టిందనే చర్చ జరుగుతోంది. 6 కమిటీలు.. అందరికీ పదవులు రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి సాఫీగా పదవుల పందేరాన్ని పూర్తి చేయాలన్నది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన. అందులో భాగంగానే టీపీసీసీ అధ్యక్ష పదవితోపాటు పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ, వ్యూహ, మేనిఫెస్టో, కార్యక్రమాల అమలు, మీడియా పబ్లిసిటీ, సమన్వయ సలహా కమిటీలను ఏర్పాటు చేసే దిశలో కసరత్తు చేస్తోంది. సలహా కమిటీ చైర్మన్‌గా పొన్నాల లక్ష్మయ్య, కో చైర్మన్‌గా జానారెడ్డిల పేర్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందులో దామోదర రాజనర్సింహ, వీహెచ్, షబ్బీర్ అలీ, గీతారెడ్డిలను నియమించనున్నట్టు తెలుస్తోంది. ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టి విక్రమార్కలకు కీలక పదవులు కట్టబెట్టాలన్నది సోనియా ఆలోచన అని చర్చ జరుగుతోంది. ఒకరికి టీపీసీసీ పగ్గాలు ఇచ్చి మిగిలిన ఇద్దరికి ప్రచార కమిటీ చైర్మన్, ఏఐసీసీ పదవులు ఇస్తారనే చర్చ జరుగుతోంది. మధు యాష్కీగౌడ్, సంపత్‌లను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. -
డీసీసీ పీఠం ఎవరికో..
రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు ఇన్చార్జి అధ్యక్షుడు కొనసాగుతున్నారు. కొత్త జిల్లాలకు ప్రత్యేకంగా అధ్యక్షుణ్ణి నియమించాలని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్న తరుణంలో కామారెడ్డితో పాటు, నిజామాబాద్ కు అధ్యక్షుడి నియామకం చేస్తారని చర్చ సాగుతోంది. డీసీసీ పదవికి పోటీ ఏర్పడింది. సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఉన్న ఇన్చార్జి అధ్యక్షుడిని కొనసాగిస్తారా.? లేదా ఈ స్థానంలో కొత్త వారిని నియమిస్తారా.? అనే దానిపై సందిగ్ధం నెలకొంది. డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన తాహెర్‌బిన్ హందాన్ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఖాళీ అయిన ఈ స్థానాన్ని నిజామాబాద్ నగర అధ్యక్షులుగా ఉన్న కేశవేణుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు డీసీసీ అధ్యక్షులను నియమించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో పదవిలో ఎవరిని నియమిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలకు డీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. కొత్తగా ఏర్పడిన జిల్లాలకు కూడా ప్రత్యేకంగా అధ్యక్షుణ్ణి నియమించాలని కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ పదవి తెరపైకి వచ్చింది. కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిని నియమించినప్పుడే., నిజామాబాద్ జిల్లాకు కూడా అధ్యక్షున్ని ప్రకటించే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లా అధ్యక్షులుగా నియమితులైన నేతలు అన్ని మండలాల్లో ఉన్న పార్టీ నేతలు, క్యాడర్‌ను కలుపుకుని పనిచేయాల్సి ఉంటుంది. ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులను సమన్వయం చేయాల్సి ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న విషయం విదితమే. ఉమ్మడి జిల్లాలో తొమ్మిది స్థానాల్లో కేవలం ఒకే ఒక స్థానాన్ని కైవసం చేసుకోగలిగింది. నిజామాబాద్ జిల్లా పరిధిలో ఒక్క స్థానం కూడా కాంగ్రెస్‌కు దక్కలేదు. దీంతో ఆ పార్టీ నాయకులతో పాటు, కేడర్‌లో కూడా నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించి, శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా చేయడంలో డీసీసీ నేతలు కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల హైదరాబాద్ గాంధీభవన్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులతో సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రె డ్డి, ఏఐసీసీ నేతలు శ్రీనివాస్ కృష్ణన్లు జిల్లా ముఖ్య నేతలతో సమావేశమయ్యా రు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డీసీసీ పదవి విషయం ప్రత్యేకంగా చర్చ కొచ్చింది. అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని జిల్లా నేతలకు సూచించినట్లు సమాచారం. కొందరు నేతలు డీసీసీ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. నెలాఖరులోగా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. -
కాంగ్రెస్‌లో కొనసాగుతున్న గ్రూపు రాజకీయాలు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కాంగ్రెస్ రాజకీయాలు ఆ పార్టీ శ్రేణులకే అంతుచిక్కడం లేదు. రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ను మట్టి కరిపించేందుకు కలిసికట్టుగా కృషి చేస్తామని కాంగ్రెస్ పెద్దలు పదే పదే చెబుతున్నా.. ఆచరణలో మాత్రం అది కానరావడం లేదు. అతి కీలకమైన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలు స్పష్టంగా వెలుగుచూశాయి. ఇటీవల ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ఎన్నికల ప్రచారంలో జైపాల్‌రెడ్డి వర్గం పూర్తిగా దూరంగా ఉండడంతో పాటు... ఆయన వర్గీయులుగా పేరు పడిన వారి నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించలేదు. ఇటీవల మూడు రోజుల పాటు ఉమ్మడి జిల్లాలో చేపట్టిన ప్రచారం మాజీ మంత్రి డీకే.అరుణ ఆధ్వర్యాన నడిపించారు. ప్రచార కార్యక్రమంలో జైపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, చిన్నారెడ్డి పాల్గొనకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. గెలుపే లక్ష్యంగా.. రాష్ట్రంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నట్లు పలు సర్వేల్లో వెల్లడైనట్లు చెబుతారు. పలు నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం, కేడర్ ఉండడంతో పార్టీ పటిష్టంగా ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా కూడా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ మంచి ఫలితాలను సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా వీచినా... పాలమూరులో మాత్రం గట్టి పోటీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి పోటీ ఇచ్చి మెరుగైన స్థానాలు గెలుపొందాలని భావిస్తోంది. అందులో భాగంగా సీట్ల అంశంకొలిక్కి రాకపోయినా సరే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అంతేకాదు ఆయా నియోజకవర్గాల్లో ప్రాతినిధ్యం వహించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేస్తూ కాంగ్రెస్ కేడర్‌లో జోష్ నింపేందుకు యత్నించారు. బట్టబయలైన గ్రూపులు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి పాలమూరులోని గ్రూపులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. ఇప్పటికే జిల్లాలో సీనియర్ నేతలు డీకే అరుణ, జైపాల్‌రెడ్డి రెండు వర్గాలు విడిపోగా.. మిగిలిన నేతలు కూడా చీలిపోయి వేర్వేరుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పలు సందర్భాల్లో బహిర్గతం కాగా.. తాజా ఎన్నికల ప్రచారంలోనూ అదే ఒరవడి కొనసాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సాగిన ప్రచారానికి కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డితో పాటు చిన్నారెడ్డి, రేవంత్‌రెడ్డి పూర్తి దూరంగా ఉండడం చర్చనీయాంశమైంది. జైపాల్‌రెడ్డి మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిన ప్రచారంలో పాల్గొంటారని పలువురు చెప్పినా... ఆయన మాత్రం దూరంగా ఉన్నారు. అంతేకాదు ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న జి.చిన్నారెడ్డి సైతం ప్రచారం విషయంలో తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. ఇక రేవంత్‌రెడ్డి సైతం మూడు రోజుల ప్రచారంలో ఏ ఒక్క రోజు కూడా పాల్గొనలేదు. అంతేకాదు ఒకవైపు సొంత జిల్లాలో ఎన్నికల ప్రచారం జరుగుతుంటే రేవంత్ మాత్రం... నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో చేపట్టిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనడం గమనార్హం. ఆ నియోజకవర్గాలకు దూరం.. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యాన ప్రచారం తీరుపైనా ఉమ్మడి జిల్లాలో చర్చ జరుగుతోంది. మొత్తం 14 నియోజకవర్గాలకు గాను షాద్‌నగర్ పూర్తిగా రంగారెడ్డి జిల్లాలోకి వెళ్లింది. ఈ నేపథ్యంలో 13 అసెంబ్లీ స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం నిర్వహించాల్సి ఉండగా... కేవలం 9 నియోజకవర్గాల్లో మాత్రమే సాగింది. ఇందులో నాగర్‌కర్నూల్‌లో మాత్రం నాగం జనార్ధన్‌రెడ్డి పెద్ద కుమారుడు మృతి కారణంగా వాయిదా వేశారు. ఇక మిగిలిన మూడింట్లో ప్రచార రథం అడుగుపెట్టకపోవడం కాంగ్రెస్ శ్రేణుల్లో నిరాశకు గురి చేసింది. ముఖ్యంగా ఏఐసీసీ కార్యదర్శి జి.చిన్నారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రేవంత్‌రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్, మరో ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్‌రెడ్డి నియోజకవర్గమైన కల్వకుర్తిలో ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. వనపర్తి నియోజకవర్గానికి పక్కనే ఉండే దేవరకద్ర, కొల్లాపూర్‌లో ఎన్నికల ప్రచారం జరిగినా.. చిన్నారెడ్డి నియోజకవర్గంలో మాత్రం అడుగుపెట్టలేదు. అలాగే రేవంత్ విషయంలో అలాగే జరిగింది. ఇక కల్వకుర్తి ఎన్నికల ప్రచారంలో అనేక ట్విస్ట్‌లు నెలకొన్నాయి. మొదట్లో కల్వకుర్తిలో రోడ్డుషోలు ఉండేలా ప్రణాళిక రూపొందించారు. కానీ ఆఖరి క్షణంలో వంశీచంద్‌రెడ్డి రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. పార్టీ సీనియర్ నేత ఎస్.జైపాల్‌రెడ్డి అందుబాటులో లేరన్న ఒకే కారణంతో కల్వకుర్తిలో ప్రచారాన్ని నిలిపేయడాన్ని బట్టి చూస్తే పార్టీలో గ్రూపు తగాదాలు ఏ మేరకు కొనసాగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. -
కదనోత్సాహం
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ముందస్తు ఎన్నికలకు సర్కారు సన్నద్ధమవుతున్న సంకేతాల నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో ముఖ్య నాయకులు వర్గాల వారీగా విడిపోయినా... ఎన్నికలకు మాత్రం సిద్ధమేనని చెపుతున్నారు. ఇటీవల రాష్ట్రంలో రాహుల్‌గాంధీ రెండు రోజుల పర్యటన విజయవంతం కావడంతో పార్టీ యంత్రాంగంలో కదనోత్సాహం నిండిందని ఆ పార్టీ నేతలు విశ్లేషిస్తున్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్చార్జిలతో రాహుల్‌గాంధీ శనివారం ఏర్పాటు చేసిన సమావేశం ప్రాధాన్యతను సంతరించుకొంది. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బృందంలో ఉమ్మడి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కూడా ఉండడం గమనార్హం. ఉమ్మడి జిల్లాలోని రాజకీయ పరిస్థితులు, వర్గ విభేదాలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి పూర్తిగా తెలుసు. ఉత్తమ్‌కు సొంత పార్టీలోనే ప్రత్యర్థిగా ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌రావు నేతృత్వంలో పూర్వ ఆదిలాబాద్ జిల్లాలో గట్టి పోటీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డి శక్తి యాప్ ప్రమోషన్లో చూపించిన ప్రతిభ ద్వారా ఢిల్లీకి వెళ్లడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమే! వచ్చే సంవత్సరం ఏప్రిల్ నెలలో జరగాల్సిన సాధారణ ఎన్నికలను ఆరు నెలల ముందుగానే నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు యోచిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వచ్చే నెల 2న హైదరాబాద్ సమీపంలో లక్షలాది మందితో భారీ బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభ ద్వారానే ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుకు సిద్ధమేనని ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం రాహుల్‌గాంధీతో జరిగిన సమావేశంలో సైతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించి, ఎన్నికలకు సిద్ధంగా ఉన్నట్లు అధినేతకు తెలియజేశారు. ముందస్తు ఎన్నికలు వస్తే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హవానే కాంగ్రెస్‌లో నడుస్తుందని భావిస్తున్న ఆయన వర్గం టిక్కెట్ల కేటాయింపులో కూడా పెద్దపాలు దక్కుతుందని యోచిస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌లో మహేశ్వర్‌రెడ్డి ఆలోచన కూడా అదే. ఎన్నికల్లో తమ వర్గానికి ఎక్కువ సీట్లు దక్కేలా పావులు కదిపే ఆలోచనతో ఉన్నారు. పీసీసీ అధ్యక్షులు, ఇన్చార్జిలతో రాహుల్‌గాంధీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ, మహేశ్వర్‌రెడ్డి మాట్లాడేందుకు కొంత సమయం ఇవ్వడం గమనార్హం. శక్తి యాప్‌ను విస్తృతంగా వినియోగిస్తూ పార్టీకి అండగా నిలుస్తున్న దేశంలోని పది మందిని గౌరవించే కార్యక్రమాన్ని రాహుల్‌గాంధీ చేపట్టగా, వారిలో మహేశ్వర్‌రెడ్డి ఉండడం గమనార్హం. కాగా మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు జిల్లాలో ప్రేంసాగర్‌రావు గ్రూపు కూడా టిక్కెట్ల వేటలో తమవంతు ప్రయత్నాల్లో ఉన్నారు. మండలాల వారీగా బలాన్ని మరింత పెంచుకొని టిక్కెట్ల పోటీలో ముందు వరుసలో ఉండాలని యోచిస్తున్నారు. రాహుల్‌గాంధీకి సంస్థాగత నివేదిక డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని వివరించే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. జిల్లాలో పార్టీ సభ్యత్వ నమోదుకు ఉద్ధేశించిన శక్తి యాప్, బూత్ కమిటీల ఏర్పాటు గురించి నివేదికను సమర్పించారు. శక్తి యాప్ ద్వారా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదిలాబాద్ పూర్వ జిల్లాలో పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ నేపథ్యంలో మహేశ్వర్‌రెడ్డిని ఏఐసీసీ తరుపున రాహుల్‌గాంధీ అభినందించారు. అదే సమయంలో కొత్త జిల్లాల వారీగా డీసీసీల ఏర్పాటు అంశం పీసీసీ పరిధిలో ఉండడంతో తన వర్గీయులను అధ్యక్షులుగా నియమించుకునేందుకు ఈ ఢిల్లీ పర్యటనను మహేశ్వర్‌రెడ్డి వినియోగించుకున్నట్లు సమాచారం. నిర్మల్ మినహా మంచిర్యాల, కుమురంభీం, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ అధ్యక్షుల కోసం మహేశ్వర్‌రెడ్డి వర్గంతో పాటు ప్రేంసాగర్‌రావు వర్గం కూడా తీవ్ర స్థాయిలో పోటీ పడుతోంది. ఈ నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి తన పంతం నెగ్గించుకొనే యోచనతో మహేశ్వర్‌రెడ్డి పావులు కదుపుతున్నారు. వేచి చూసే దోరణిలో ప్రేంసాగర్‌రావు వర్గం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో పాటు మహేశ్వర్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి రాహుల్‌గాంధీతో భేటీ కావడంతో ప్రేంసాగర్‌రావు వర్గం వేచి చూసే దోరణితో ఉంది. రాష్ట్ర స్థాయిలో భట్టి విక్రమార్క, డీకే అరుణ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డిలకు చెందిన గ్రూపులో ఉన్న ప్రేంసాగర్‌రావు, వివిధ నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్న ఈ వర్గం నాయకులు స్థానికంగా పట్టును పెంచుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తరువాత ఢిల్లీలో టిక్కెట్ల పంపిణీ నాటికి అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయని వీరు భావిస్తున్నారు. ఆదివాసీ సమస్యతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యేలు సోయం బాపూరావు, ఆత్రం సక్కు, రేవంత్‌రెడ్డితో పాటు రాహుల్‌గాంధీ సమక్షంలో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన బోడ జనార్దన్, రావి శ్రీనివాస్, గతంలో పోటీ చేసి ఓడిపోయిన గండ్రత్ సుజాత, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు తమ వైపు ఉన్నందున వీరికి టిక్కెట్లు ఖాయమని ప్రేంసాగర్‌రావు వర్గం భావిస్తోంది. వీరందరికీ స్థానికంగా కార్యక్రమాలు చేపట్టాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు వెల్లడంతో కార్యాచరణ ప్రారంభమైంది. -
కాంగ్రెస్ యాత్ర షెడ్యూల్ ఖరారు
వరంగల్ : జిల్లాలో జరిగే రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కాగా.. వచ్చే నెల మూడు నుంచి పదో తేదీ వరకు జరిగే బస్సు యాత్ర షెడ్యూల్‌ను డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పత్రికలకు విడుదల చేశారు. ఏప్రిల్ 3న భూపాలపల్లి నియోజకవర్గంలో బస్సు యాత్ర బృందం రాత్రి బస చేస్తుంది. 4న మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చేరుకుంటుంది. సాయంత్రం 6గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో బస చేస్తారు. 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పరకాల నియోజకవర్గంలో, సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. అనంతరం నైట్‌హాల్ట్ చేస్తారు. 8వ తేదీన డోర్నకల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు, సాయంత్రం 6గంటలకు మహబూబాబాద్ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. నైట్‌హాల్ట్ భద్రాచలంలో చేస్తారు. 9వ తేదిన మణుగూరు మీదుగా ములుగు నియోజకవర్గంలో యాత్ర చేసి సాయంత్రం 5 గంటలకు సభలో పాల్గొని అక్కడే రాత్రి బస చేస్తారు. 10వ తేదీన వర్ధన్నపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో రెండో విడత బస్సు యాత్ర ముగుస్తుందని రాజేందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, బలరాంనాయక్, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిశీలకులు సయ్యద్ అజమతుల్లా హుస్సేనీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, నేరేళ్ల శారద, బట్టి శ్రీను, పులి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీ అయినా.. గోల్కొండ కోటైనా రెడీ
-
'అసెంబ్లీ అయినా.. గోల్కొండ కోటైనా రెడీ'
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నేతలు షబ్బీర్ అలీ, పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలను జైలులో పెడతామంటూ ఒక ముఖ్యమంత్రి మంత్రి మాట్లాడటం సరికాదని చెప్పారు. తెలంగాణ సంస్కృతిని కేసీఆర్ నాశనం చేస్తున్నారని వారు ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని.. అవసరం అయితే జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమని చెప్పారు. ప్రాజెక్టుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం అవినీతికి పాల్పడుతోందని చెప్పారు. 2019 తర్వాత వారంతా జైలుకు వెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. కాళేశ్వరం ద్వారా కోటి ఎకరాలకు నీళ్లు ఎలా ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. దీనిపై అసెంబ్లీలోనైనా, గోల్కొండ కోటలోనైనా తాము చర్చకు సిద్ధం అని వారు సవాల్ విసిరారు.