
వివరాలను వెల్లడిస్తున్న రాజేందర్‌రెడ్డి
వరంగల్ : జిల్లాలో జరిగే రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కాగా.. వచ్చే నెల మూడు నుంచి పదో తేదీ వరకు జరిగే బస్సు యాత్ర షెడ్యూల్‌ను డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పత్రికలకు విడుదల చేశారు. ఏప్రిల్ 3న భూపాలపల్లి నియోజకవర్గంలో బస్సు యాత్ర బృందం రాత్రి బస చేస్తుంది. 4న మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చేరుకుంటుంది. సాయంత్రం 6గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో బస చేస్తారు. 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పరకాల నియోజకవర్గంలో, సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. అనంతరం నైట్‌హాల్ట్ చేస్తారు. 8వ తేదీన డోర్నకల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు, సాయంత్రం 6గంటలకు మహబూబాబాద్ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. నైట్‌హాల్ట్ భద్రాచలంలో చేస్తారు. 9వ తేదిన మణుగూరు మీదుగా ములుగు నియోజకవర్గంలో యాత్ర చేసి సాయంత్రం 5 గంటలకు సభలో పాల్గొని అక్కడే రాత్రి బస చేస్తారు. 10వ తేదీన వర్ధన్నపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో రెండో విడత బస్సు యాత్ర ముగుస్తుందని రాజేందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, బలరాంనాయక్, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిశీలకులు సయ్యద్ అజమతుల్లా హుస్సేనీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, నేరేళ్ల శారద, బట్టి శ్రీను, పులి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు.