sehdule
-
ప్రయాణికుల ప్రత్యేక రైళ్లు ఇవే
సాక్షి, సికింద్రాబాద్: దేశవ్యాప్తంగా జూన్ 1 నుంచి రోజువారీ రాకపోకలు సాగించే 200 రైళ్లను (100 జతలు) రైల్వేబోర్డు ఖరారు చేసింది. జోన్లు, రూట్ల వారీగా నడిపే రైళ్లు, ప్రయాణ వేళల వివరాల్ని అన్ని జోన్ల జీఎంలకు పంపించింది. ప్రయాణికుల అవసరాలు, రద్దీని దృష్టిలో ఉంచుకుని ముఖ్యమైన రూట్లను ఎంపిక చేసినట్లు సమాచారం. ఈ రైళ్ల సమయాలు, ఆగే స్టాపులూ గతంలోలాగే ఉంటాయి. వీటిని ప్రత్యేక రైళ్లుగా నడుపుతారు. తమ జోన్లో 9 జతల రైళ్లను నడుపుతామని, మరో నాలుగు జతల రైళ్లు తమ జోన్ గుండా ప్రయాణిస్తాయని దక్షిణమధ్య రైల్వే గురువారం తెలిపింది. మొత్తం 13 జతల రైళ్ల వివరాలను వెల్లడించింది. (అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం) ప్రస్తుతం ఉన్న నిబంధనలను అనుసరించి ఆర్ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో టిక్కెట్ జారీ చేస్తామని.. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు టికెట్ కన్ఫర్మ్ కాకపోతే రైలులోకి అనుమతించబోమని పేర్కొంది. గమ్యస్థానం చేరిన తర్వాత ఆయా రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ ఆరోగ్య మార్గదర్శకాలకు లోబడి ప్రయాణికులు సహకరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఐఆర్సీటీసీ వెబ్సైట్, మొబైల్ యాప్ మాత్రమే ఆన్లైన్లో టిక్కెట్లు బుక్‌చేసుకోవచ్చు. కేంద్ర మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు తదితరులు హెచ్ఓఆర్ ద్వారా టిక్కెట్లు బుక్‌చేసుకునే వీలు కల్పించింది. పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్ర్య సమరయోధులు, రైల్వే, మిలటరీ, పోలీస్ వారెంట్లు, వోచర్లు, రైల్వే బోర్డు నిర్దేశించిన 4 రకా దివ్యాంగులు, 11 రకాల రోగులు విద్యార్థులు పీఆర్ఎస్(పాసింజర్ రిజర్వేషన్ సిస్టం) కౌంటర్లలో టిక్కెట్లు తీసుకోవచ్చు. -
ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్లో మార్పు
సాక్షి, అమరావతి: ఏపీపీఎస్సీ నిర్వహించే పలు పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ కమిషన్ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 21, 22, 27, 28, 29 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను ఏప్రిల్, మేలో నిర్వహించేలా కొత్త షెడ్యూళ్లను ప్రకటించింది. (చదవండి: ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు) ఇంజనీరింగ్ ఫీజులపై ప్రభుత్వానికి కమిషన్ నివేదిక సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర కోర్సులకు కాలేజీల వారీగా ఫీజులు నిర్థారిస్తూ రాష్ట్ర ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ మంగళవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కమిషన్ చైర్మన్ జస్టిస్ వి. ఈశ్వరయ్య నేతృత్వంలో వైస్ చైర్మన్ ప్రొఫెసర్ ఎన్. భార్గవ రామమోహన్‌రావు, సభ్యకార్యదర్శి డాక్టర్ ఎన్. రాజశేఖరరెడ్డి, సభ్యులు అశుతోష్ మిశ్రా, కల్కి విజయులురెడ్డి, ప్రొఫెసర్ డి.ఉషారాణి, డాక్టర్ జి.శాంతారావు, ప్రొఫెసర్ పి.విజయప్రకాశ్, ఎ.సాంబశివారెడ్డి ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్రను కలిసి నివేదిక అందజేశారు. ఈ నివేదిక పరిశీలించిన అనంతరం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేస్తుంది. -
20వ తేది నుంచి కొత్త టీచర్ల నియామకాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతేడాది నిర్వహించిన డీఎస్సీ–2018 నియామక ప్రక్రియకు ప్రభుత్వం ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 20వ తేదీ నుంచి టీచర్ పోస్టులకు అర్హులైన వారి ఎంపికకు పాఠశాల విద్యా శాఖ తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ ప్రక్రియ సుదీర్ఘంగా సెప్టెంబర్ 4 వరకు కొనసాగనుంది. తెలుగు భాషా పండితులు, హిందీ భాషా పండితులు, స్కూల్ అసిస్టెంటు తెలుగు, స్కూల్ అసిస్టెంటు హిందీ, పీఈటీ పోస్టులు (మొత్తం అయిదు కేటగిరీలు) మినహాయించి తక్కిన అన్ని కేటగిరీల పోస్టులకూ అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. రాష్ట్రంలో 7,902 పోస్టులతో డీఎస్సీ–2018 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు అర్హతల నిర్ణయం, పరీక్షల నిర్వహణలో అనేక లోటుపాట్లు తలెత్తాయి. ఇప్పటికే న్యాయస్థానాల్లో పలు కేసులు కూడా దాఖలయ్యాయి. ఈ న్యాయ వివాదాల కారణంగానే అయిదు కేటగిరీల నియామకాలు మినహాయించి తక్కిన వాటికి షెడ్యూల్ ఇచ్చారు. వివాదాలు పరిష్కారమైన తరువాత మిగిలిన పోస్టులకూ నియామకాలు పూర్తిచేయనున్నారు. ఈ పోస్టులకు నియామకాల ప్రక్రియ మొత్తం తొలిసారిగా ఆన్లైన్లో చేపడుతుండడం విశేషం. అభ్యర్థులు పూర్తిగా కంప్యూటర్ ద్వారానే తమ ధ్రువపత్రాల పరిశీలన తదితర కార్యక్రమాలు పూర్తిచేసుకోవడం, నియామక పత్రాలు పొందేలా ఏర్పాట్లు చేపట్టారు. ప్రతి కేటగిరీలో అభ్యర్థుల జాబితాల ప్రకటన, ధ్రువపత్రాల అప్లోడ్, వాటి పరిశీలన కార్యక్రమాన్ని మూడు దఫాలుగా చేయనున్నారు. పోస్టులు ఖాళీగా ఉండిపోకుండా జాబితాలో అర్హులైన తదుపరి మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు వీలుగా ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఆయా కేటగిరీల పోస్టులకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ మొత్తాన్ని పాఠశాల విద్యా శాఖ కమిషనరేట్ (సీఎస్ఈ) ఆన్లైన్ పర్యవేక్షణలో కొనసాగనుంది. అంతిమంగా ఎంపికైన అభ్యర్థుల జాబితాలను పాఠశాల విద్యాశాఖ విడుదల చేస్తుంది. అనంతరం పాఠశాలల ఎంపికకు వీలుగా వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. పోస్టింగ్ ఆర్డర్లను కూడా ఆన్లైన్లో విడుదల చేస్తారు. వాటిని అనుసరించి ఆయా జిల్లాల ఎంపిక కమిటీల మెంబర్ సెక్రటరీలు (నియామకాధికారులు) అభ్యర్థులను ఆయా పాఠశాలల్లో చేరేలా ఉత్తర్వులు ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థి ఎవరైనా పోస్టింగ్ కోసం ప్రాంతాన్ని ఎంపిక చేసుకోలేని పక్షంలో అతనికి మెంబర్ సెక్రటరీనే కేటాయింపు చేస్తారు. -
ఏప్రిల్ 8, 9, 10, 12 తేదీల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్–2019 పరీక్షలను వచ్చే నెల 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలు వచ్చే నెల 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో తాజా షెడ్యూలును ఖరారు చేసింది. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాజా షెడ్యూలును ఖరారు చేసింది. -
కాంగ్రెస్ యాత్ర షెడ్యూల్ ఖరారు
వరంగల్ : జిల్లాలో జరిగే రెండో విడత ప్రజాచైతన్య బస్సు యాత్రపై హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ చీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నేతలు హాజరు కాగా.. వచ్చే నెల మూడు నుంచి పదో తేదీ వరకు జరిగే బస్సు యాత్ర షెడ్యూల్‌ను డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి పత్రికలకు విడుదల చేశారు. ఏప్రిల్ 3న భూపాలపల్లి నియోజకవర్గంలో బస్సు యాత్ర బృందం రాత్రి బస చేస్తుంది. 4న మధ్యాహ్నం 2 గంటలకు స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గానికి చేరుకుంటుంది. సాయంత్రం 6గంటలకు పాలకుర్తి నియోజకవర్గంలో బస చేస్తారు. 6వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు పరకాల నియోజకవర్గంలో, సాయంత్రం వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. అనంతరం నైట్‌హాల్ట్ చేస్తారు. 8వ తేదీన డోర్నకల్ నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు, సాయంత్రం 6గంటలకు మహబూబాబాద్ నియోజకవర్గంలో బస్సు యాత్ర జరుగుతుంది. నైట్‌హాల్ట్ భద్రాచలంలో చేస్తారు. 9వ తేదిన మణుగూరు మీదుగా ములుగు నియోజకవర్గంలో యాత్ర చేసి సాయంత్రం 5 గంటలకు సభలో పాల్గొని అక్కడే రాత్రి బస చేస్తారు. 10వ తేదీన వర్ధన్నపేట నియోజకవర్గంలో మధ్యాహ్నం 2గంటలకు జరిగే కార్యకర్తల సమావేశంలో పాల్గొనడంతో రెండో విడత బస్సు యాత్ర ముగుస్తుందని రాజేందర్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు భరత్‌చంద్రారెడ్డి, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి, బలరాంనాయక్, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు టి.జీవన్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి, దొంతి మాధవరెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా పరిశీలకులు సయ్యద్ అజమతుల్లా హుస్సేనీ, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నమిండ్ల శ్రీనివాస్, బక్క జడ్సన్, నేరేళ్ల శారద, బట్టి శ్రీను, పులి అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, పొదెం వీరయ్య, వేం నరేందర్‌రెడ్డి, సీతక్క తదితరులు పాల్గొన్నారు. -
ధర్మశాలలో భారత్-పాక్ మ్యాచ్
ముంబై: భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు ఐసీసీ తీపికబురు అందించింది. దాయాది జట్ల మధ్య ధర్మశాలలో మ్యాచ్ జరుగుతుందని ప్రకటించింది. టి20 ప్రపంచకప్ లో భాగంగా మార్చి 19న రెండు జట్ల మధ్య ముఖాముఖి పోరు జరగనుంది. టి20 ప్రపంచకప్ షెడ్యూల్ ను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 3 వరకు వరల్డ్ కప్ జరుగుతుంది. ఢిల్లీ, ముంబైలలో సెమీఫైనల్స్ నిర్వహించనున్నారు. కోల్ కతాలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టీమ్ లు ఒకే గ్రూపులో ఉన్నాయి. న్యూజిలాండ్ తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, శ్రీలంక మరో గ్రూపులో ఉన్నాయి.