Maha Ganapathi statue
-
18న ఖైరతాబాద్ మహాగణపతి కర్రపూజ
ఖైరతాబాద్: ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలను 66వ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్ణయించారు. ప్రతి సంవత్సరం తొలి ఏకాదశి రోజు కర్ర పూజ నిర్వహించి ప్రారంభించే పనులను ఈ నెల 18న సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. కర్రపూజలో పాల్గొనే వారు తప్పనిసరిగా మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటించాలని ఉత్సవ కమిటీ అధ్యక్షులు సింగరి సుదర్శన్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వినాయకుడి తయారీ, ఎత్తు విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ విషయంపై పోలీసుల అనుమతి తీసుకున్న తర్వాతే ముందుకు వెళతామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. -
ఖైరతాబాద్ గణపతికి 5 టన్నుల లడ్డు
తయారీకి సిద్ధమైన మండపేట తాపేశ్వరం సురుచి ఫుడ్స్ తూర్పుగోదావరి: ఖైరతాబాద్ గణనాథుని చెంత ఉంచేందుకు తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం తాపేశ్వరం సురుచి ఫుడ్స్ ఈసారి భారీ లడ్డూ తయారు చేయనుంది. ప్రతిష్టించే 60 అడుగుల ‘శ్రీ కైలాస విశ్వరూప మహా గణపతి’ విగ్రహం చేతిలో ఉంచేందుకు 5 వేల కేజీల లడ్డూను తయారు చేయనున్నట్టు సంస్థ అధినేత పోలిశెట్టి మల్లిబాబు సోమవారం తెలిపారు. లడ్డూ తయారీ నిమిత్తం ఈ నెల 21న తనతోపాటు 16 మంది గణేశ్ మాలధారణ చేయనున్నామన్నారు. పూర్తైన లడ్డూను 28న క్రేన్ సాయంతో ప్రత్యేక వాహనంలో హైదరాబాద్ పంపిస్తామన్నారు.