mahakootami
-
కూటమి మిత్రులకు చుక్కెదురు !
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మహాకూటమి మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఊహించని షాక్ ఇచ్చింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూటమి పక్షాలకు ఒకే ఒక్క స్థానం కేటాయించనున్నట్లు కుండబద్దలు కొట్టేసింది. మిత్రపక్షాలు మాత్రం ఉమ్మడి జిల్లాలో మూడు నుంచి ఆరు స్థానాలను కోరాయి. కూటమిలో భాగస్వాములైన టీడీపీకి నాలుగు స్థానాలు, తెలంగాణ జన సమితి రెండు స్థానాలు కోరిన విషయం వదితమే. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకే సీటు ఇస్తామని.. మక్తల్ నియోజకవర్గం స్థానంతో టీడీపీ సరిపెట్టుకోవాలని స్పష్టం చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. టీజేఎస్‌కు మాత్రం పూర్తిగా మొండి చేయి చూపినట్లు తెలుస్తోంది. దీపావళికి ముందు రోజు కాంగ్రెస్ పార్టీ పేల్చిన బాంబుతో మిత్రపక్షాలకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదురైంది. కాంగ్రెస్ మార్క్ రాజకీయం ! రాజకీయాల్లో తలపండిన కాంగ్రెస్ పార్టీ తనదైన మార్క్‌ను మరోసారి ప్రదర్శించింది. రాష్ట్ర స్థాయిలో బలంగా ఉన్న టీఆర్ఎస్ను గద్దె దింపడం కోసం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ రద్దు అనంతరం చాలా వేగంగా పావులు కదిపింది. విపక్ష ఓట్లు చీలకుండా ఉండటం కోసం టీడీపీ, సీపీఐ, టీజేఎస్‌తో కలిసి మహాకూటమిగా ఏర్పాటు చేసింది. మిత్రపక్షాలకు సముచిత స్థానం కల్పిస్తామంటూ అసెంబ్లీ రద్దు నాటి నుంచి చెప్పుకుంటూ వచ్చింది. తీరా ఎన్నికలకు సమయం దగ్గర పడిన నేపథ్యంలో మిత్రపక్షాలకు కేటాయించాల్సిన స్థానాల విషయంలో నాన్చివేత ధోరణిఅవలంభించింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో టీడీపీ, టీజేఎస్‌లు కొన్ని స్థానాలు కావాలని ప ట్టుబట్టాయి. అందులో భాగంగా టీడీపీ.. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్ లేదా జడ్చర్ల స్థా నాలు కావాలని కోరుతోంది. అదే విధంగా తెలంగాణ జన సమితి కూడా మహబూబ్‌నగర్‌తో పా టు కొల్లాపూర్ స్థానాన్ని కేటాయించాలని వి న్నవించింది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మిత్రపక్షాల స్థానాల విషయంలో ఎలాంటి స్పష్టత ఇ వ్వకుండా సాచివేత ధోరణి అవలంబించింది. తా జాగా నామినేషన్ల గడువు సమీపిస్తుండడంతో ఒ క్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిత్రప క్షాలకు ఒకే ఒక్క స్థానం ఇస్తామంటూ స్పష్టం చేసింది. మిగతా 13 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీనే పో టీ చేస్తుందంటూ కుండబద్ధలు కొట్టినట్లు సమాచారం. టీడీపీకి మాత్రమే చాన్స్ ముందస్తు ఎన్నికల్లో కూటమిగా పోటీ చేయాలని భావిస్తున్న మిత్రపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్క స్థానాన్ని కేటాయించింది. అది కూడా టీడీపీకి మాత్రమే మక్తల్ నియోజకవర్గాన్ని కేటాయించినట్లు సమాచారం. వాస్తవానికి టీడీపీ మూడు నుంచి నాలుగు స్థానాలు కావాలని కోరినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అందులో భాగంగా కొత్తకోట దయాకర్‌రెడ్డి కోసం మక్తల్ స్థానాన్ని, సీతమ్మ కోసం దేవరకద్ర, రావుల చంద్రశేఖర్‌రెడ్డి కోసం వనపర్తి, ఎర్ర శేఖర్ కోసం మహబూబ్‌నగర్ లేదా జడ్చర్ల కావాలని పట్టుబట్టింది. అయితే వివిధ దశల చర్చల అనంతరం కనీసం మూడు స్థానాలైనా కావాలని కోరింది. కానీ కాంగ్రెస్ మాత్రం కేవలం ఒకే ఒక్క స్థానంతో సరిపెట్టినట్లు తెలుస్తోంది. మక్తల్ నియోజకవర్గం నుంచి దయాకర్‌రెడ్డి పోటీ చేసే విషయంలో పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. ఒక్క స్థానమూ దక్కని టీజేఎస్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించిన జేఏసీ నుంచి రూపాంతరం చెందిన తెలంగాణ జన సమితికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క స్థానం కూడా దక్కనట్లు తెలుస్తోంది. టీజేఎస్ పార్టీగా ఏర్పడిన అనంతరం కూడా ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ఉమ్మడి జిల్లాలో పలు అంశాలపై విస్తృతంగా పోరాటం చేసింది. అంతేకాదు జిల్లాలో పార్టీ బలోపేతం కోసం జేఏసీ అధ్యక్షుడిగా పనిచేసిన రాజేందర్‌రెడ్డి తీవ్రంగా కృషిచేశారు. ఈసారి ఎన్నికల్లో మహబూబ్‌నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని ఆయన హార్డ్‌వర్క్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం టీజేఎస్‌కు ఉమ్మడి జిల్లాలో ఒక్క స్థానం కూడా కేటాయించనట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఉమ్మడి జిల్లాలో టీజేఎస్ మహబూబ్‌నగర్, కొల్లాపూర్ స్థానాలు కావాలని కోరింది. ఆఖరికి ఒక్క మహబూబ్‌నగర్ స్థానం కేటాయించినా సరిపెట్టుకుంటామని విన్నవించింది. కానీ కాంగ్రెస్ మాత్రం టీజేఎస్ విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన షాక్‌తో ఉమ్మడి జిల్లాలో టీజేఎస్ పోటీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు ఎదురుకానున్నాయి. -
చేనేత కార్మికులకు అండగా ఉంటాం
సాక్షి, యాదాద్రి: మహాకూటమి అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించి అండగా ఉంటామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో 15 రోజులుగా చేనేత కార్మికులు చేస్తున్న రిలే నిరాహా ర దీక్షను బుధవారం రాత్రి ఆయన టీటీడీపీ అధ్యక్షు డు ఎల్.రమణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, టీజేఎస్ నాయకుడు ప్రభాకర్‌రెడ్డితో కలసి విరమింపజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఉత్తమ్ మాట్లాడుతూ పోచంపల్లి చేనేత కార్మికుల 12 డిమాండ్లను మహాకూటమి ఎజెండాలో చేర్చి అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.1,000 పింఛన్‌ను రూ.2,000కు పెంచుతామన్నా రు. భువనగిరికి చెందిన గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత స్వాధీనం చేసుకున్న భూములు, బంగారం, ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. నయీం ఆస్తులపై టీఆర్ఎస్ను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అన్నీ చేస్తానని ప్రజలకు హామీలు ఇచ్చి ఏమీ చేయని కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గోరీ కట్టాలని, మహాకూటమిని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. కేసీఆర్ సీఎం అయితే ఏదో ఉద్ధ రిస్తాడని, ప్రజల బతుకులు బాగుపడతాయని గెలి పిస్తే వాటన్నింటినీ మరిచిపోయారన్నారు. నాలుగున్నర కోట్ల ప్రజలను మోసం చేశారని విమర్శించారు. మహాకూటమి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పేద ప్రజలకు వారి సొంత స్థలంలో రూ.5 లక్షలతో ఇల్లు కట్టిస్తామని తెలిపారు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ టీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లలో చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేయలేకపోయారన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే రుణాలు మాఫీ చేస్తామని, చేనేత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. పేద ల బాధలు తొలగాలన్నా, ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేరాలన్నా మహాకూటమి అధికారంలోకి రావడం అవసరమని పేర్కొన్నారు. సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై కేసీఆర్ సిగ్గుపడాలన్నారు. కేసీఆర్ వైఫల్యం వల్లే చేనేత కార్మికుల ఆత్మహత్యలు పెరిగాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి రాష్ట్ర నాయకుడు ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్, నేతలు చింతకింది రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పరాజయ పరంపరకు నాంది
విశ్లేషణ మోదీ వెల్లువ చాలా వరకు చెదిరిపోయింది. ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పుడే ఉద్యోగావకాశాల కల్పన జరుగుతుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ దాదాపు నిశ్చలంగా నిలచిపోయి ఉంది. మోదీని నమ్మిన యువత బీజేపీ గెలిచినా ఉద్యోగాలు లేక నిరాశ చెందింది. తమను మోసగించారని గుర్తించింది. ఇప్పుడిక పలు ఇతర రాష్ట్రాలు కూడా బిహార్ ఎన్నికల క్రమాన్నే అనుసరిస్తాయి. కాబట్టి స్టాలిన్గ్రాడ్ యుద్ధం తర్వాత జర్మనీ లాగా బీజేపీ కూడా ఇక అదే పనిగా తిరోగమించాల్సిందేనని అంచనా వేయవచ్చు. బిహార్ కులాల లెక్కలను, నరేంద్ర మోదీ పట్ల నానాటికీ భ్రమలు తొలగిపోతుండటాన్ని, మతోన్మాద వాతావరణం వేడెక్కుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే, తాజా ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరమైన వేమీ కావు. అయితే ఈ ఫలితాలు మోదీ వెల్లువ అంతరించిపోయిందని కూడా సూచిస్తున్నాయి. మోదీ తన సకల శక్తులనూ ధారపోసి మరీ సాగించిన ఈ సంగ్రామంలో ఆయన ఎదుర్కొన్న అత్యంత అవమా నకరమైన ఓటమి బహుశా ఆయన పాలిటి స్టాలిన్గ్రాడ్ యుద్ధం కావచ్చు. ఇక ఎన్నికల ఫలితాలను సన్నిహితంగా పరిశీలిద్దాం. బిహార్‌సహా మన దేశంలో చాలా మంది ప్రజలు కుల, మత ప్రాతిపదికపైనే ఎన్నికలలో ఓటు చేస్తుంటారు. అప్పుడప్పుడూ ఏదైనా వెల్లువ ఉంటే తప్ప ఇందుకు భిన్నంగా జరగదు. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, మోదీ వెల్లువపై ఆధారపడే విజయం సాధించింది. నిన్నటి మోదీ వెల్లువకు కారణాలు 1. మోదీ ఇచ్చిన ‘అభివృద్ధి’ అద్భుత నినాదానికి అర్థం పదుల లక్షల ఉద్యోగాలను కల్పించడమనే ప్రజలు అర్థం చేసుకున్నారు. 1988లోనే యువతరం ఓటింగ్ హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. దీంతో ఓటర్లలో వారొక ముఖ్య భాగంగా మారారు. నిరు ద్యోగమనే భయానక భవితను వారు ఎదుర్కొంటున్నారు. ఏటా కోటి మంది యువత కొత్తగా ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కాగా సంఘటిత రంగం కల్పించగలుగుతున్న ఉద్యోగాలు మాత్రం ఏడాదికి 5 లక్షలు మాత్రమే. దీంతో అందరికీ ఉద్యోగాలనే మోదీ నినాదానికి ఆకర్షితులై వారంతా కుల, మత విభేదాలకతీతంగా మోదీకి మూకుమ్మడిగా ఓటు చేశారు. 2. దురదృష్టవశాత్తూ మతోన్మాద వైరస్ మన సమాజంలో బలంగా వేళ్లూనుకుని ఉంది. ‘ముస్లింలను సంతృప్తిపరుస్తున్నార’ని చాలా మంది హిందువులు భావిస్తున్నారు. మోదీ అయితేనే దేశవ్యాప్తంగా వారిని తగు స్థానంలో ఉంచుతారని భావించి వారు ఆయనకు ఓటు చేశారు. 3. ఒక కుంభకోణం తర్వాత మరో కుంభకోణం క్రమం తప్పకుండా వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు కాంగ్రెస్ అంటే, యూపీఏ అంటే అసహ్యించుకోసాగారు. ఉద్యోగాలు ఏవీ? ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మోదీ వెల్లువ చాలా వరకు చెదిరిపోయింది. కరడుగట్టిన మోదీ మద్దతుదార్లలో, అది కూడా ప్రధానంగా అగ్రకులాల హిందువుల్లో మినహాయిస్తే ఎక్కడా అది కనబడదు. బీజేపీ గెలిచినా ఉద్యోగాలు లేవు, నినాదాల వల్ల ఉద్యోగాలు వచ్చిపడేవి కావు. ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పుడు ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ ఆచరణలో నిశ్చలంగా నిలచిపోయి ఉంది. ఉద్యో గాలు వస్తాయని ఆశిస్తున్న యువత బీజేపీ వారు తమను మూర్ఖులను చేసి మోసగించారని గుర్తించింది. విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చిపడి ఉద్యోగాలను సృష్టిస్తాయ నడం భ్రమ మాత్రమేనని రుజువైంది. ప్రముఖ అమెరికన్ పెట్టుబడిదా రుడు జిమ్ రోజర్స్ భారత్‌లోని తన పెట్టుబడులను ఉపసంహరించుకు న్నారు. దాంతోపాటూ, కేవలం ఆశ మీదనే ఆధారపడి ఎవరూ పెట్టుబడు లు పెట్టలేరని ఆయన చేసిన వ్యాఖ్య కూడా పత్రికల్లో ప్రము ఖంగానే వచ్చింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు కొరవడ గా, భారీ అవినీతి వెల్లువెత్తుతుండగా ఎవరు మాత్రం భారత్‌లో పెట్టుబ డులు పెడతారు లేదా ఫ్యాక్టరీలు నిర్మిస్తారు? ‘నేను తినను, ఎవర్నీ తిననివ్వను’ అని మోదీ నినాదమిచ్చినా అవినీతి ఏమాత్రం తగ్గలేదు. మరోవంక పప్పు, ఉల్లి వంటి నిత్యజీవితావసర వస్తువుల ధరలు మిన్నంటుతున్నాయి. అంటే దేశ ప్రజలలో అత్యధికుల నిజ ఆదాయాలు భారీగా పడిపోయాయని అర్థం. పారని పాచిక దీంతో మతం పాచికను ప్రయోగించాలని ప్రయత్నించారు. ఘాతుకమైన దాద్రీ హత్య వంటి ఘటనల్లో, గోమాంసం లేదా బీఫ్ రాజకీయాలలో అది కనిపిస్తుంది. కానీ అదేమంత ప్రభావాన్ని కలిగించలేకపోయింది. మతం లేదా డిజిటల్ ఇండియా కబుర్ల కంటే, మోదీ విదేశీ పర్యటనల జోరు కంటే ప్రజలకు ఆహారం, ఉద్యోగాలే ముఖ్యం. బిహార్ ఓటింగ్ సంప్రదాయక కుల, మతాల అమరిక ప్రకారమే సాగింది. కాబట్టి నిశిత దృష్టిగల పరిశీలకులు ముందుగా ఊహించిన ఫలితాలే వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 10.4 కోట్ల బిహార్ జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 16 శాతం. 23 దళిత ఉప కులాల్లో 21 ఉప కులాలను ఈ జనగణన మహాదళితులుగా పేర్కొంది. ఇక ఆది వాసీలు లేదా షెడ్యూల్డ్ కులాలు బిహార్ జనాభాలో 1.3 శాతం. ఆ రాష్ట్రంలోని ఆదివాసులలో గోండు, సంథాల్, తరు తెగలు ప్రధాన మైనవి. తీవ్రంగా వెనుకబడిన కులాలను (ఈబీసీలు) కొన్ని సంద ర్భాల్లో అత్యంత వెనుక బడిన కులాలు (ఎంబీసీలు) అని కూడా పిలుస్తుంటారు. బిహార్‌లో 130కి పైగా ఈబీసీ కులాలున్నాయి. ఫలితాల సవివరమైన విశ్లేషణ ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటికైతే నితీశ్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లకు యాదవులు, కుర్మీలు, జనాభాలో 19 శాతంగా ఉన్న ముస్లింల మద్దతు లభించిందని అనిపిస్తోంది. సంఘ్ పరివార్ చేపట్టిన లవ్ జిహాద్, ఘర్ వాప్సీ కార్యక్రమాలూ, అవైద్యనాథ్, సాధ్వీ నిరంజన జ్యోతి ప్రసంగాలూ, ముజఫర్ నగర్, వల్లభ్ఘర్ల నుంచి తాజాగా జరిగిన దాద్రీ ఘోరం వరకు పరిణామాలన్నీ ముస్లింలలో అభద్రతను రేకెత్తించాయనేది స్పష్టమే. మరో ‘స్టాలిన్గ్రాడ్’ ఓటమి లాలూ ఈ ఎన్నికల పోరును వెనుకబడిన, అభివృద్ధి చెందిన కులాల మధ్య పోరుగా విజయవంతంగా చిత్రించగలిగారు. దీంతో వెనుకబడిన కులాల(ఓబీసీ)లోని ఒక విభాగం (జనాభాలో దాదాపు 8 నుంచి 10 శాతం) కూడా వారి కూటమికి మద్దతునిచ్చి ఉండాలి. మహాకూటమి ఘన విజయానికి ఇది కారణం కావాలి. ఇక అగ్రకులాలు, ఈబీసీలలో ఒక విభాగం ఎన్డీఏకు మద్దతునిచ్చాయి. రామ్‌విలాస్ పాశ్వాన్, జీతన్‌రాం మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాలు బీజేపీ నేతృత్వంలోని కూటమిలో ఉండటం వల్ల దళితులలోని ఒక విభాగం కూడా వారికి మద్దతునిచ్చింది. భారత ప్రజాస్వామిక వ్యవస్థలో సీట్లు ఓట్ల శాతంపై ఆధారపడి ఉండవు. కేవలం 31 శాతం ఓట్లతో బీజేపీ లోక్‌సభలో పూర్తి ఆధిక్యతను సాధించగలిగింది. ఇప్పుడు అదే పరిస్థితి తలకిందులైంది. చాలా రాష్ట్రాలు కూడా ఇప్పుడిక బిహార్ ఎన్నికల క్రమాన్నే అనుసరిస్తాయి. కాబట్టి స్టాలిన్గ్రాడ్ యుద్ధం తర్వాత జర్మన్ సైన్యంలాగా బీజేపీ కూడా అదే పనిగా తిరోగమించాల్సిందేనని నిర్భయంగా అంచనా వేయవచ్చు. మార్కండేయ కట్జు ( వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) thewire.com సౌజన్యంతో)