పరాజయ పరంపరకు నాంది | BJP lost in assembly elections | Sakshi
Sakshi News home page

పరాజయ పరంపరకు నాంది

Published Mon, Nov 9 2015 1:13 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

పరాజయ పరంపరకు నాంది - Sakshi

పరాజయ పరంపరకు నాంది

విశ్లేషణ
మోదీ వెల్లువ చాలా వరకు చెదిరిపోయింది. ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పుడే ఉద్యోగావకాశాల కల్పన జరుగుతుంది. కానీ మన ఆర్థిక వ్యవస్థ దాదాపు నిశ్చలంగా నిలచిపోయి ఉంది. మోదీని నమ్మిన యువత బీజేపీ గెలిచినా ఉద్యోగాలు లేక నిరాశ చెందింది. తమను మోసగించారని గుర్తించింది. ఇప్పుడిక పలు ఇతర రాష్ట్రాలు కూడా బిహార్ ఎన్నికల క్రమాన్నే అనుసరిస్తాయి. కాబట్టి స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం తర్వాత జర్మనీ లాగా బీజేపీ కూడా ఇక అదే పనిగా తిరోగమించాల్సిందేనని అంచనా వేయవచ్చు.
 
బిహార్ కులాల లెక్కలను, నరేంద్ర మోదీ పట్ల నానాటికీ భ్రమలు తొలగిపోతుండటాన్ని, మతోన్మాద వాతావరణం వేడెక్కుతుండటాన్ని దృష్టిలో ఉంచుకుంటే, తాజా ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యకరమైన వేమీ కావు. అయితే ఈ ఫలితాలు మోదీ వెల్లువ అంతరించిపోయిందని కూడా సూచిస్తున్నాయి. మోదీ తన సకల శక్తులనూ ధారపోసి మరీ సాగించిన ఈ సంగ్రామంలో ఆయన ఎదుర్కొన్న అత్యంత అవమా నకరమైన ఓటమి బహుశా ఆయన పాలిటి స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం కావచ్చు.

ఇక ఎన్నికల ఫలితాలను సన్నిహితంగా పరిశీలిద్దాం. బిహార్‌సహా మన దేశంలో చాలా మంది ప్రజలు కుల, మత ప్రాతిపదికపైనే ఎన్నికలలో ఓటు చేస్తుంటారు. అప్పుడప్పుడూ ఏదైనా వెల్లువ ఉంటే తప్ప ఇందుకు భిన్నంగా జరగదు. 2014 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీ, మోదీ వెల్లువపై ఆధారపడే విజయం సాధించింది.

నిన్నటి మోదీ వెల్లువకు కారణాలు
1. మోదీ ఇచ్చిన ‘అభివృద్ధి’ అద్భుత నినాదానికి అర్థం పదుల లక్షల ఉద్యోగాలను కల్పించడమనే ప్రజలు అర్థం చేసుకున్నారు. 1988లోనే యువతరం ఓటింగ్ హక్కు వయస్సును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించారు. దీంతో ఓటర్లలో  వారొక ముఖ్య భాగంగా మారారు. నిరు ద్యోగమనే భయానక భవితను వారు ఎదుర్కొంటున్నారు. ఏటా కోటి మంది యువత కొత్తగా ఉద్యోగాల మార్కెట్లోకి ప్రవేశిస్తోంది. కాగా సంఘటిత రంగం కల్పించగలుగుతున్న ఉద్యోగాలు మాత్రం ఏడాదికి 5 లక్షలు మాత్రమే. దీంతో అందరికీ ఉద్యోగాలనే మోదీ నినాదానికి ఆకర్షితులై వారంతా కుల, మత విభేదాలకతీతంగా మోదీకి మూకుమ్మడిగా ఓటు చేశారు.
2. దురదృష్టవశాత్తూ మతోన్మాద వైరస్ మన సమాజంలో బలంగా వేళ్లూనుకుని ఉంది. ‘ముస్లింలను సంతృప్తిపరుస్తున్నార’ని చాలా మంది హిందువులు భావిస్తున్నారు. మోదీ అయితేనే దేశవ్యాప్తంగా వారిని తగు స్థానంలో ఉంచుతారని భావించి వారు ఆయనకు ఓటు చేశారు.
 3. ఒక కుంభకోణం తర్వాత మరో కుంభకోణం క్రమం తప్పకుండా వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు కాంగ్రెస్ అంటే, యూపీఏ అంటే అసహ్యించుకోసాగారు.  

ఉద్యోగాలు ఏవీ?
ఏడాదిన్నర తర్వాత ఇప్పుడు మోదీ వెల్లువ చాలా వరకు చెదిరిపోయింది. కరడుగట్టిన మోదీ మద్దతుదార్లలో, అది కూడా ప్రధానంగా అగ్రకులాల హిందువుల్లో మినహాయిస్తే ఎక్కడా అది కనబడదు. బీజేపీ గెలిచినా ఉద్యోగాలు లేవు,  నినాదాల వల్ల ఉద్యోగాలు వచ్చిపడేవి కావు. ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్నప్పుడు ఉద్యోగాల కల్పన జరుగుతుంది. కానీ భారత ఆర్థిక వ్యవస్థ ఆచరణలో నిశ్చలంగా నిలచిపోయి ఉంది. ఉద్యో గాలు వస్తాయని ఆశిస్తున్న యువత బీజేపీ వారు తమను మూర్ఖులను చేసి మోసగించారని గుర్తించింది.

విదేశీ పెట్టుబడులు భారీగా వచ్చిపడి ఉద్యోగాలను సృష్టిస్తాయ నడం భ్రమ మాత్రమేనని రుజువైంది. ప్రముఖ అమెరికన్ పెట్టుబడిదా రుడు జిమ్ రోజర్స్ భారత్‌లోని తన పెట్టుబడులను ఉపసంహరించుకు న్నారు. దాంతోపాటూ, కేవలం ఆశ మీదనే ఆధారపడి ఎవరూ పెట్టుబడు లు పెట్టలేరని ఆయన చేసిన వ్యాఖ్య కూడా పత్రికల్లో ప్రము ఖంగానే వచ్చింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో మౌలికసదుపాయాలు కొరవడ గా, భారీ అవినీతి వెల్లువెత్తుతుండగా ఎవరు మాత్రం భారత్‌లో పెట్టుబ డులు పెడతారు లేదా ఫ్యాక్టరీలు నిర్మిస్తారు? ‘నేను తినను, ఎవర్నీ తిననివ్వను’ అని మోదీ నినాదమిచ్చినా అవినీతి ఏమాత్రం తగ్గలేదు.
 మరోవంక పప్పు, ఉల్లి వంటి నిత్యజీవితావసర వస్తువుల ధరలు మిన్నంటుతున్నాయి. అంటే దేశ ప్రజలలో అత్యధికుల నిజ ఆదాయాలు భారీగా పడిపోయాయని అర్థం.
 పారని పాచిక

దీంతో మతం పాచికను ప్రయోగించాలని ప్రయత్నించారు. ఘాతుకమైన దాద్రీ హత్య వంటి ఘటనల్లో, గోమాంసం లేదా బీఫ్ రాజకీయాలలో అది కనిపిస్తుంది. కానీ అదేమంత ప్రభావాన్ని కలిగించలేకపోయింది. మతం లేదా డిజిటల్ ఇండియా కబుర్ల కంటే, మోదీ విదేశీ పర్యటనల జోరు కంటే ప్రజలకు ఆహారం, ఉద్యోగాలే ముఖ్యం.
 బిహార్ ఓటింగ్ సంప్రదాయక కుల, మతాల అమరిక ప్రకారమే సాగింది. కాబట్టి నిశిత దృష్టిగల పరిశీలకులు ముందుగా ఊహించిన ఫలితాలే వచ్చాయి.  

2011 జనాభా లెక్కల ప్రకారం 10.4 కోట్ల బిహార్ జనాభాలో షెడ్యూల్డ్ కులాలు 16 శాతం. 23 దళిత ఉప కులాల్లో 21 ఉప కులాలను ఈ జనగణన మహాదళితులుగా పేర్కొంది. ఇక ఆది వాసీలు లేదా షెడ్యూల్డ్ కులాలు బిహార్ జనాభాలో 1.3 శాతం. ఆ రాష్ట్రంలోని ఆదివాసులలో గోండు, సంథాల్, తరు తెగలు ప్రధాన మైనవి. తీవ్రంగా వెనుకబడిన కులాలను (ఈబీసీలు) కొన్ని సంద ర్భాల్లో అత్యంత వెనుక బడిన కులాలు (ఎంబీసీలు) అని కూడా పిలుస్తుంటారు. బిహార్‌లో 130కి పైగా ఈబీసీ కులాలున్నాయి.
 ఫలితాల సవివరమైన విశ్లేషణ ఇంకా జరగాల్సి ఉంది. ఇప్పటికైతే నితీశ్‌కుమార్, లాలూప్రసాద్ యాదవ్‌లకు యాదవులు, కుర్మీలు, జనాభాలో 19 శాతంగా ఉన్న ముస్లింల మద్దతు లభించిందని అనిపిస్తోంది. సంఘ్ పరివార్ చేపట్టిన లవ్ జిహాద్, ఘర్ వాప్సీ కార్యక్రమాలూ, అవైద్యనాథ్, సాధ్వీ నిరంజన జ్యోతి ప్రసంగాలూ, ముజఫర్ నగర్, వల్లభ్‌ఘర్‌ల నుంచి తాజాగా జరిగిన దాద్రీ ఘోరం వరకు పరిణామాలన్నీ ముస్లింలలో అభద్రతను రేకెత్తించాయనేది స్పష్టమే.

మరో ‘స్టాలిన్‌గ్రాడ్’ ఓటమి
 లాలూ ఈ ఎన్నికల పోరును వెనుకబడిన, అభివృద్ధి చెందిన కులాల మధ్య పోరుగా విజయవంతంగా చిత్రించగలిగారు. దీంతో వెనుకబడిన కులాల(ఓబీసీ)లోని ఒక  విభాగం (జనాభాలో దాదాపు 8 నుంచి 10 శాతం)  కూడా వారి కూటమికి మద్దతునిచ్చి ఉండాలి. మహాకూటమి ఘన విజయానికి ఇది కారణం కావాలి. ఇక అగ్రకులాలు, ఈబీసీలలో ఒక విభాగం ఎన్‌డీఏకు మద్దతునిచ్చాయి. రామ్‌విలాస్ పాశ్వాన్, జీతన్‌రాం మాంఝీ, ఉపేంద్ర కుష్వాహాలు బీజేపీ నేతృత్వంలోని కూటమిలో ఉండటం వల్ల దళితులలోని ఒక విభాగం కూడా వారికి   మద్దతునిచ్చింది.   

భారత ప్రజాస్వామిక వ్యవస్థలో సీట్లు ఓట్ల శాతంపై ఆధారపడి ఉండవు. కేవలం 31 శాతం ఓట్లతో బీజేపీ లోక్‌సభలో పూర్తి ఆధిక్యతను సాధించగలిగింది. ఇప్పుడు అదే పరిస్థితి తలకిందులైంది. చాలా రాష్ట్రాలు కూడా ఇప్పుడిక బిహార్ ఎన్నికల క్రమాన్నే అనుసరిస్తాయి. కాబట్టి స్టాలిన్‌గ్రాడ్ యుద్ధం తర్వాత జర్మన్ సైన్యంలాగా బీజేపీ కూడా అదే పనిగా తిరోగమించాల్సిందేనని నిర్భయంగా అంచనా వేయవచ్చు.     
 

మార్కండేయ కట్జు  ( వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి) thewire.com సౌజన్యంతో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement