న్యూ ఇయర్ జనరేషన్
అనంతరం
న్యూ ఇయర్ అంటేనే...
న్యూ డ్రీమ్స్‌కి
న్యూ థాట్స్‌కి
న్యూ లైఫ్‌కి
వెల్కమ్ చెప్పడం!
2014...
తెలుగుతెరపై
న్యూ వేవ్ చూపించబోతోంది.
ఎందరో సినీ ప్రముఖుల
వారసులకు ఈ కొత్త సంవత్సరం ఓ కొత్త మలుపు
ఇవ్వబోతోంది.
కమింగ్ సూన్
అక్కినేని నాగార్జున రెండో కొడుకు అఖిల్ తెరంగేట్రానికి రంగం సిద్ధం.
నాగబాబు తనయుడు వరుణ్‌తేజ్ ఫస్ట్ మూవీ శ్రీకాంత్ అడ్డాల
దర్శకత్వంలో షూట్‌కి రెడీ...
ఇన్ ద మేకింగ్
సీనియర్ నటుడు నరేష్ తనయుడు, విజయనిర్మల మనవడు నవీన్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇందుకోసం మూడేళ్లు శ్రమించి మరీ 130 కేజీల నుంచి 70 కేజీలకు తగ్గాడు. యాక్టింగ్, కిక్ బాక్సింగ్, డ్యాన్సులన్నీ నేర్చుకున్నాడు. డేంజర్, రాఖీ, చందమామ లాంటి ఎన్నో చిత్రాలకు కూర్పరిగా పనిచేసిన నవీన్‌కు హీరోగా ఆరేడు ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి. కొత్త సంవత్సరంలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.
సంగీత దర్శకుడు మణిశర్మ కొడుకు మహతి స్వరసాగర్. ఏడేళ్లుగా కీరవాణి, మణిశర్మ, కల్యాణి మాలిక్ తదితరుల దగ్గర కీబోర్డ్ ప్లేయర్‌గా పనిచేస్తున్నాడు. ఈ అనుభవంతో ఈ ఏడాది మ్యూజిక్ డెరైక్షన్ చేపడతారని టాక్.
హాస్యనటుడు బ్రహ్మానందం రెండో కొడుకు సిద్ధార్థ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నాడు.
ఉత్తేజ్ కూతురు హీరోయిన్గా వచ్చే అవకాశాలు బోలెడు.