The Mahatma Gandhi National Rural Employment Guarantee Scheme
-
ఏదీ ఉపాధి ‘హామీ’?
ఈ ఏడాది పనిదినాలు కేవలం 42 రోజులే ఏపీలో సగం కుటుంబాలకూ దక్కని కూలీ కర్నూలు: ఇంటిల్లిపాదీ కూలి పనులకు వెళితే కానీ కుటుంబం కడుపు నిండని నిరుపేద కుటుంబాలు అవి. ఉన్న ఊర్లో పనులు అంతంత మాత్రమే కావడంతో పనులు వెదుక్కుంటూ వలస వెళ్లక తప్పని దుస్థితి వారిది. వారి కోసం ఉన్న ఊర్లోనే పని చూపిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ఏడాదికి కనీసం వంద రోజుల పనికల్పిస్తామని, కనీస రోజు కూలీ 169 రూపాయలుగా నిర్ణయించి చట్టం చేసి మరీ అమలు చేస్తోంది. ఈ పథకం అమలులోకి వచ్చాక నిరుపేద కూలి కుటుంబాలు పనుల కోసం వలస వెళ్లే కష్టాలు కాస్తంతైనా తగ్గాయి. కానీ.. గత రెండు మూడేళ్లుగా రాష్ట్రంలో ఉపాధి హామీ అమలు నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కూలీలకు కల్పిస్తున్న పనులు ఏటికేడూ తగ్గుతూ వస్తున్నాయి. ఈ ఏడాది అది మరింతగా క్షీణించిపోయింది. ఇదీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని దాదాపు లక్ష పేద కూలీ కుటుంబాల దయనీయ స్థితి. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కింద ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా కల్పించిన సగటు ఉపాధి దినాలు కేవలం 42 రోజులు మాత్రమే. వాస్తవానికి చట్టం ప్రకారం ఏడాదికి 100 రోజుల పనిదినాలు కల్పించాల్సి ఉంది. చట్టం మేరకు వీరికి సగటున రోజుకు రూ. 169 కూలీ రావాల్సి ఉండగా.. వస్తోంది సగటున కేవలం రూ. 118.67 మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కుటుంబానికి ఒకటి చొప్పున 81,61,321 జాబుకార్డులు ఉన్నాయి. ఇందులో నమోదు చేసుకున్న కూలీల సంఖ్య 1,74,51,791 మంది ఉన్నారు. అయితే.. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జనవరి 22 నాటికి రాష్ట్రం మొత్తం మీద 31,83,791 కుటుంబాలకు మాత్రమే ఉపాధి కల్పించారు. నూరు రోజుల పనిదినాలకు మంగళం... గత ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీన మొదలైన ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 300 రోజులు గడచిపోయాయి. మార్చి 31వ తేదీతో ఆర్థిక ఏడాది ముగిసిపోనుంది. అంటే ఇక మిగిలివుంది నికరంగా 60 - 65 రోజులు మాత్రమే. ఇక్కడి నుంచీ ప్రతి రోజూ పని కల్పిస్తే తప్ప ఈ ఆర్థిక సంవత్సరానికి వంద రోజుల పని కల్పించాలన్న లక్ష్యం పూర్తికాదు. కానీ ఆ ప్రయత్నమే జరగడం లేదు. -
మార్పులు ఒప్పుకోం
ఉపాధి హామీపై రాజ్యసభలో ధ్వజమెత్తిన విపక్షాలు న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మార్పులు చేసేందుకు కేంద్రం చేస్తున్న యత్నాలపై రాజ్యసభలో విపక్షాలు మండిపడ్డాయి. పేదల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాన్ని మూసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తాయి. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి 100 రోజులు ఉపాధి కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉపాధి హామీపై సావధాన తీర్మానం ఇచ్చిన సీపీఐ ఎంపీ డి.రాజా మాట్లాడుతూ... బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యపరచి, ఆ తర్వాత స్వస్తి పలికే ప్రయత్నాలు చేస్తోందన్నారు. పథకంలో మార్పులు చేసి అవినీతికి కేంద్రం దోహదం చేస్తోందని సీపీఐతోపాటు విపక్ష సభ్యులు విమర్శించారు. దీనిపై గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేందర్ సింగ్ మాట్లాడుతూ... ఎనిమిదేళ్లలో ఈ పథకం మంచి ఫలితాలను సాధించిందని, రూ.1.80లక్షల కోట్లు వేతనాల కింద చెల్లించామని, ఐదుకోట్ల కుటుంబాలు లబ్ధిపొందాయని, దీనిని మరింత సమర్థంగా అమలుచేసేందుకు ఆస్తుల కల్పనపై దృష్టి పెట్టామని చెప్పారు. -
ఆందోళనలో ఇందిర జలప్రభ..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నాబార్డు నిధులతో చేపట్టే ‘ఇందిర జలప్రభ’ (ఐజేపీ) కార్యక్రమం ముందుకు సాగడం లేదు. రూ.48 కోట్ల వ్యయంతో 20,229 ఎకరాలను సాగులోకి తెచ్చి షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన కుటుంబాల పరిస్థితి మెరుగుపరచాలనేది దీని లక్ష్యం. మూడేళ్ల కాలంలో దశలవారీగా ఈ పథకాన్ని అమలు చేసి, భూములకు సాగు నీరు అందించేందుకు బోర్లు, కరెంటు, పంపుసెట్లు ఏర్పాటు చేయాలి. మూడేళ్లు కావస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఇప్పటి వరకు రూ.14.47 కోట్లు ఖర్చు చేసిన అధికారులు కేవలం 613 బోర్లకు మాత్ర మే కరెంటు కనెక్షన్లు ఇచ్చి, 448 బోర్లకు పంపుసెట్లు బిగించారు. దీంతో 290 ఎకరాలు కూడా వినియోగంలో రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదీ పరిస్థితి ఇందిర జలప్రభ కింద ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన బంజరు, అసైన్డ్ భూములను అభివృద్ధి చేసేందుకు అధికారులు పంపిన ప్రతిపాదనలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆమోదిస్తూ వచ్చింది. మూడేళ్లలో 3,056 బ్లాకులుగా విభజించి, దాదాపు 20,229 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించారు. ఇందులో 2,420 బ్లాకులను సర్వేచేసి 1,998 బోర్లు వేయాలని సిఫారసు చేయగా, 1,518 బోర్లు వేసేందుకు పరిపాలనా అనుమతి లభించింది. ఈ మేరకు అధికారులు 2011 నవంబర్ మొదటి వా రం లో టెండర్లు నిర్వహించారు. బోర్వెల్ (డీటీహె చ్) కోసం మీటరుకు రూ.230 చొప్పున 90 మీటర్ల వరకు, ట్యూబ్‌వెల్ కన్స్ట్రక్షన్(రోటరీ) మీటర్‌కు రూ.820 చెల్లించే ందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం అధికారులు భూ గర్భ జలాల సర్వే పూర్తి చేసి, బోర్లు వేసే బాధ్యతను అర్హత గల సంస్థలకు అప్పగించారు. ఇప్పటిదాకా నాబార్డు, ఈజీఎస్ కింద 1,518 బోర్లు వేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇందులో 304 బోర్లు ఫెయిల్ కాగా, 1,214 మాత్రమే స క్సెస్ అయ్యాయి. వీటి కింద తక్షణమే భూము లు సాగులోకి తీసుకు రావాల్సి ఉంది. కానీ, మూడేళ్లలో కేవలం 613 బోర్లకే అధికారులు కరెంటు సౌకర్యం కల్పించగలిగారు. 448 బోర్ల కే పంపుసెట్లు బిగిం చారు. ఇంకా 601 మంది ఎస్సీ, ఎస్టీ రైతులు విద్యుత్తు కనెక్షన్ల కోసం ఎదురు చూస్తున్నారు. విద్యుత్ కనెక్షన్లు, పంపుసెట్ల కొనుగోలుపై గందరగోళం భూగర్భ జలాల గుర్తింపు, బోరుబావుల త వ్వకం, కరెంటు కనెక్షన్లు, పంపుసెట్ల ఏర్పాటు పై మొదటి నుంచి గందరగోళమే ఉంది. బోర్‌వెల్స్ కోసం 2011 నవంబర్ 19, 26 తేదీలలో రెండు పర్యాయాలు టెండర్లు నిర్వహించగా, అ గ్రిమెంట్ పూర్తయ్యే సరికి రెండు మాసాలు గడిచింది. బోర్లు వేసేందుకు భూగర్భజల పరీక్షల నిర్వహణకు సిబ్బంది కొరత ఏర్పడగా, డిప్యూటేషన్‌పై ఇతర జిల్లాల నుంచి తాత్కాలిక ని యామకాలు చేశారు. 1,518 బోర్లు వేసేందుకు సర్వే పూర్తయినా, 1,214 బోర్లు మాత్రమే సక్సెస్‌ఫుల్‌గా వేయగలిగారు. తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆ శాఖ అధికారులకు సిఫారసు చేయగా, 613 కనెక్షన్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. సబ్మెర్సిబుల్ మోటార్లు, పంపుసెట్లు, ఇన్సులేషన్, పీవీసీ పైపులు, మినీ ప్యానెల్ బోర్డు తదితర సామగ్రి కోసం రెండు పర్యాయాలు నిర్వహించిన టెండర్లు కొలిక్కి వ చ్చినా రైతులకు స్పష్టత లేదు. ఐఎస్ఐ-9283, ఐఎస్ఐ-8034 గుర్తింపు పొందిన మోటార్లు, పంపుసెట్లను సరఫరా చేసేందుకు అర్హత గల కాంట్రాక్టర్లను ఎంపిక చేశామంటున్నా, రైతులకు చేరిన మోటార్లపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బావులు, పర్క్యులేషన్ ట్యాంకులు, లిఫ్ట్ ఇరిగేషన్ వంటివి అమలుకు నోచుకోలేదు.