mahendhar reddy
-
ప్రభుత్వంతో చర్చలు: ఆర్టీసీ సమ్మె యథాతథం?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీకి చెందిన ఆయా కార్మిక సంఘాల నేతలు శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 11వతేదీ నుంచి ఆర్టీసీలో సమ్మె నిర్వహిస్తామంటూ సమ్మె నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సమ్మె నోటీస్‌పై రవాణా మంత్రితో కార్మిక సంఘాల నేతలు చర్చలు జరిపారు. ఈ భేటీలో ఆర్టీసీ చైర్మన్ సత్యనారాయణ, రవాణా శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సునీల్ శర్మ, ఎండీ రమణారావు, అధికారులతో సంస్థ స్థితిగతుల మీద మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంస్థ నష్టాల్లో ఉంది. సమ్మె నిర్ణయంపై పునరాలోచించండి. 97 డిపోలలో కేవలం 11 డిపోలు నష్టాల్లో ఉన్నాయి. ఆర్టీసీకి సుమారు 3 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఏటా ఆర్టీసీకి రూ. 700 కోట్లు నష్టంతో పాటు వడ్డీకి 250 కోట్ల రూపాయలు కడుతున్నారు. జీతాలు పెంచితే అదనంగా సంస్థ మీద రూ.1400 కోట్ల భారం పడుతుంది. 53 వేల మంది కార్మికులు ప్రయోజనంతో పాటు నాలుగున్నర కోట్ల ప్రజల ప్రయోజనాలు కూడా ముఖ్యం. సంస్థను ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ ఉన్నారు. కార్మికులను తప్పుడు ఆలోచనలతో సమ్మెకు దించటం సరికాదు. కార్మిక నాయకులు ఎన్నికల కోసం ఆర్టీసీ కార్మికులను, సంస్థను నష్టాల్లోకి నెట్టరాద’ని వ్యాఖ్యానించారు. సమ్మె వాయిదా లేదు చర్చల అనంతరం టీఎంయూ నేత అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె వాయిదా వేయాలని మంత్రి కోరారని తెలిపారు. లాభనష్టాలతో ఆర్టీసీని చూడొద్దని, డైరెక్టర్ పోస్టులపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు. 11 జరిగే సమ్మెను వాయిదా వేయలేదని వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం యూనియన్ నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సమ్మెపై చర్చించాక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఇదే చివరి సమ్మె కావాలని కోరుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల పేరుతో తమ సమస్యను పక్కదారి పట్టించొద్దని కోరారు. ముఖ్యమంత్రిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. -
రేపు మధ్యాహ్నం మా నిర్ణయం ప్రకటిస్తాం
-
సోషల్‌మీడియా వదంతులపై డీజీపీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు. ఆయన బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వదంతులపై వివరణ ఇచ్చారు. రాష్ట్రంలో దోపిడీ దొంగలు, కిడ్నాపర్లు ఎవరూ తిరగడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దు అని సూచించారు. అనుమానితులను చూడగానే స్థానికులు దాడులకు దిగుతున్నారని, అలా ఎవరైనా అనుమానితులను గుర్తిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. డయల్ 100కి కాల్ చేయాలని సూచించారు. తప్పుడు వార్తలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దన్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలన్నీ నిజం కాదని, సోషల్ మీడియాలో అసత్యాలను ప్రచారం చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరికాదన్నారు. తప్పుడు వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నవారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపైన చర్యలు తప్పవని డీజీపీ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసింగ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, గ్రామాల్లో కూడా సీసీటీవీ వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని యూనిట్లను అప్రమత్తం చేసామన్నారు. నిజామాబాద్ జిల్లా భీంగల్, బీబీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఘటనల్లో దాడి చేసిన వారిపైన చర్యలు తీసుకుంటున్నామని మహేందర్‌రెడ్డి తెలిపారు. -
‘విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోం’
హైదరాబాద్: తెలంగాణలో ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ రెండు నాల్కల ధోరణి వీడాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి సూచించారు. జిల్లాకో మాట మాట్లాడుతూ ప్రాజెక్ట్ ల నిర్మాణాలు అడ్డుకుంటూ సీఎం కేసీఆర్ మీదనే విమ్శలు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆయన హెచ్చరించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్ట్ నిర్మాణాలను కాంగ్రెస్ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి కోర్టులో స్టే తెచ్చి నిలివేయించి , మళ్లీ రంగారెడ్డి జిల్లాలో పాదయాత్రలు చేస్తారా అని ప్రశ్నించారు. మీరు కట్టని, ముట్టని ప్రాజెక్ట్ లు పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. నాయకులు లేక కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం మీద విమర్శలు చేస్తే ఖబర్దార్ అన్నారు. మీరు 50 ఏళ్ళ కాలంలో చేయని పనుల్లో తమ ప్రభుత్వం చేసిందన్నారు. రంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయకు రూ. 378 కోట్ల నిధులు, మిషన్ కాకతీయకు రూ. 2000 కోట్లు కేటాయించడం కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాట తప్పరని, ఎవరు ఎన్ని అడ్డంకులు తెచ్చినా లక్షల ఎకరాలకు సాగు నీరు , తాగు నీరు అందిస్తారని తెలిపారు. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు హరీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులవి తప్పుడు యాత్రలని, రామ్మోహన్ రెడ్డి ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.