Mahendra Hills
-
మహేంద్రహిల్స్‌లో కరోనా ఎఫెక్ట్
-
గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై వేటు
మారేడుపల్లి (హైదరాబాద్) : హైదరాబాద్ మహేంద్రహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై వేటుపడింది. కొన్ని రోజుల క్రితం ఈ హాస్టల్లో కలుషిత ఆహారం తిని 67 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ప్రిన్సిపాల్ వై.సత్యనారాయణను శుక్రవారం ఆ బాధ్యతల నుంచి తప్పించారు. సత్యనారాయణ గత సంవత్సరం నుంచి ఇన్చార్జ్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. -
హైదరాబాద్‌లో కేరళ భవన్
నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తాం: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మలయాళీ అసోసియేషన్ భవనం కోసం మహేంద్రహిల్స్‌లో ఎకరం భూమి కేటాయించి, దాని నిర్మాణానికి కోటి రూపాయల నిధులు ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. నగరంలో నివసిస్తున్న నిరుపేద మలయాళీలకు పక్కా ఇళ్లు కట్టిస్తానని సీఎం హామీ ఇచ్చారు. కేరళ ప్రభుత్వ సహకారంతో నగరంలోని మలయాళీ అసోసియేషన్(సీటీఆర్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఆదివారం బాలానగర్‌లోని నవీన సాంస్కృతిక కళా కేంద్రంలో కేరళీయం-2015 పేరుతో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో సుమారు 4 లక్షల మంది కేరళీయులు ఉన్నారని, వారికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. తన చాంబర్లోనూ ఓఎస్డీగా కేరళకు చెందిన ప్రియాంక అద్భుతంగా సేవలందిస్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా టీవీ యాంకర్ సుమతో పాటు పలువురు కేరళ ప్రముఖులను కేసీఆర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కేరళ మంత్రి కె.సి.జోసఫ్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
మహేంద్ర హిల్స్‌లో క్రైస్తవభవన్
స్థలం గుర్తించిన అధికార యంత్రాంగం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రైస్తవభవన్ నిర్మాణం కోసం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ శాఖ మహేంద్ర హిల్స్‌లో రెండెకరాల స్థలాన్ని సేకరించింది. క్రైస్తవుల ప్రగతి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో క్రైస్తవభవన్ నిర్మిస్తామని ప్రకటించటంతో పాటు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.10 కోట్ల నిధులు కూడా కేటాయించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శనివారం మారేడ్‌పల్లి మండలం మల్కాజిగిరి ప్రాంతంలోని మహేంద్ర హిల్స్‌లో రెండెకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశముందని అధికారులు అంటున్నారు.