తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రైస్తవభవన్ నిర్మాణం కోసం హైదరాబాద్..
స్థలం గుర్తించిన అధికార యంత్రాంగం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు క్రైస్తవభవన్ నిర్మాణం కోసం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ శాఖ మహేంద్ర హిల్స్‌లో రెండెకరాల స్థలాన్ని సేకరించింది. క్రైస్తవుల ప్రగతి, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ నగరంలో క్రైస్తవభవన్ నిర్మిస్తామని ప్రకటించటంతో పాటు శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.10 కోట్ల నిధులు కూడా కేటాయించారు.
ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి జాయింట్ కలెక్టర్ బి.సంజీవయ్య ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు శనివారం మారేడ్‌పల్లి మండలం మల్కాజిగిరి ప్రాంతంలోని మహేంద్ర హిల్స్‌లో రెండెకరాల స్థలాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసే అవకాశముందని అధికారులు అంటున్నారు.