Maiduguri
-
ఏడు, ఎనిమిదేళ్ల బాలికలకు బాంబులు పెట్టి..
-
ఏడు, ఎనిమిదేళ్ల బాలికలకు బాంబులు పెట్టి..
మైదుగురి: ఉగ్రవాదుల దారుణాలకు అంతు లేకుండా పోతుంది. తాము చేసే పాశవిక చర్యలకోసం అమాయకులను పొట్టనబెట్టుకుంటున్నారు. కనీసం పదేళ్లు కూడా నిండని ఇద్దరు బాలికలను మానవ బాంబులుగా చేసి మారణ హోమం సృష్టించబోయారు. అయితే, ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా దాదాపు 20మందికి పైగా తీవ్ర గాయలపాలయ్యారు. బోర్నో రాష్ట్రంలోని మైదుగురి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం ఏడు, ఎనిమిది సంవత్సరాల బాలికలకు ఐఈడీ బాంబులను అమర్చి జనరద్దీ ప్రాంతంలోకి వదిలారు. అనంతరం పేల్చేశారు. ఈ ఘటనలో ఆ ఇద్దరు బాలికలు చనిపోవడంతోపాటు మరొకరు చనిపోగా, 20మందికి పైగా గాయాల పాలయ్యారు. అయితే, ఈ ఘటనకు తామే పాల్పడినట్లు ఏ ఉగ్రవాదులు బాధ్యత ప్రకటించలేదు. అయితే, ఈ ప్రాంతంలో ఎక్కువగా బోకో హారమ్ ఉగ్రవాదులు దారుణాలకు పాల్పడుతుంటారు. ఈ నేపథ్యంలో వారే చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -
మరోసారి బాంబు దాడి.. 54మంది మృతి
మైదుగురి: నైజీరియాలో బొకో హారమ్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. వారు రెండు చోట్ల బాంబు దాడులు జరపడంతో 54మంది అమాయకులు ప్రాణాలుకోల్పోయారు. మరో 90మంది గాయాలపాలయ్యారు. గత జూలై నుంచి ఈ తరహా బాంబు దాడులు జరగడం ఇదే తొలిసారి అని నైజీరియా అధికారులు తెలిపారు. మైదుగురిలోని అజిలరి అనే ప్రాంతంలో బాంబులు ధరించి వచ్చిన ఓ వ్యక్తి తనను బాంబు విసరడంతోపాటు తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో 54మంది అక్కడికక్కడే చనిపోయారు. గతంలో కూడా మైదుగురి ప్రాంతంలో భారీ స్థాయిలో బాంబు దాడులు చోటుచేసుకుని వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. -
ఆత్మాహుతి దాడి: 25 మంది మృతి
అబూజా: నైజీరియా మైదుగురి పట్టణంలోని మసీదులో శనివారం ఆత్మహాతి దాడి జరిగింది. ఈ దాడిలో 25 మంది మరణించారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారని స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. క్షతగాత్రులు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది. ఆత్మాహుతి దాడికి యత్నించిన వ్యక్తి మసీదులోకి ప్రవేశించి... తనను తాను పేల్చివేసుకున్నాడని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారని చెప్పింది. మసీదులో ప్రార్థన ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఈ ఘటన చోటు చేసుకుందని వారు వివరించారని పేర్కొంది. సంఘటన స్థలంలో 25 మందికిపైగా మృతదేహాలు వెలికితీసినట్లు సహాయక చర్యల్లో పాల్గొన్నవారు తెలిపారని చెప్పింది. అయితే ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారు అనే విషయాన్ని వెల్లడించేందుకు ఉన్నతాధికారులు నిరాకరించారని మీడియా వెల్లడించింది. గత కొద్ది సంవత్సరాలుగా ఈశాన్య నైజీరియాలో బోకో హరామ్ తీవ్రవాదులు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఈ విధ్వంసంలో వేలాది మంది మరణించిన సంగతి తెలిసిందే. -
బాంబు పేలుడు: 35 మంది మృతి
నైజీరియా మైదుగిరి పట్టణంలో అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ పరిసర ప్రాంతంలో శనివారం రాత్రి శక్తిమంతమైన బాంబు పేలుడు సంభవించింది. ఆ ఘటనలో 35 మంది మృతి చెందారని పోలీసు ఉన్నతాధికారులు ఆదివారం వెల్లడించారు. బాంబు విస్ఫోటనం వల్ల మృతదేహలు చెల్లచెదురుగా పడిపోయాయని, వాటిని వెలికి తీసే పని సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.